Advertisement

Advertisement


Home > Movies - Movie News

అనిల్ సుంకర మళ్లీ అదే పని?

అనిల్ సుంకర మళ్లీ అదే పని?

సబ్జెక్ట్ మీద నమ్మకం వుంటే ఎంతయినా ఖర్చు చేయడం అన్నది నిర్మాతలు చేసే ధైర్యమైన పని. కానీ ఇలాంటి తెగింపు అన్ని వేళలా వర్కవుట్ కాదు. 

హీరో కి పుల్లింగ్ కెపాసిటీ లేకపోయినా, అనుకున్నట్లు రాకపోయినా, తేడా వస్తుంది. అనిల్ సుంకరకు ఇలాంటి గుండె ధైర్యం ఎక్కువ. ఆ రోజుల్లో మహా సముద్రం సినిమా మీద కోట్లు పెట్టినా, ఏజెంట్ సినిమా మీద కోట్లు కుమ్మరించేసినా ఆయనకే చెల్లు. ఇప్పుడు మళ్లీ అలాంటి ధైర్యమే చేస్తున్నారని తెలుస్తోంది.

అనిల్ సుంకర్- రాజేష్ దండా కలిసి తీసిన భైరవ కోన హిట్ కావడంతో మళ్లీ అదే హీరో సందీప్ కిషన్ తో ఓ సినిమా స్టార్ట్ చేసి సగానికి పైగా తీసేసారు. ఈ సినిమాకు పాతిక కోట్ల బడ్జెట్ అని టాక్ వినిపిస్తోంది. సందీప్ కిషన్ మీద ఇంత బడ్జెట్ అనే సరికి టాలీవుడ్ లో ‘అవునా.. నిజ్జమా’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

భైరవకోన థియేటర్ నుంచి బాగానే రాబట్టడంతో అనిల్ సుంకర ఈ ధైర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా భైరవకోన మాదిరిగా హర్రర్ ఫాంటసీ కాదు. కానీ సిజి వర్క్, విజువల్ వర్క్ ఎక్కువగా వుండే ఓ భారీ సబ్జెక్ట్. అందుకే పాతిక కోట్లు ఖర్చు అవుతోందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?