Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫ్లాప్ ల ద‌ర్శ‌కుడికి స్టార్ హీరో ఇంకో ఛాన్స్!

ఫ్లాప్ ల ద‌ర్శ‌కుడికి స్టార్ హీరో ఇంకో ఛాన్స్!

అరుపులు కేక‌ల సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేకత క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు హ‌రి. పోలిస్ స్టోరీల విష‌యంలో అయితే హ‌రి పేరు మ‌రింత ప్ర‌త్యేకం.  ఆ మ‌ధ్య మంచి ఊపు మీదకు వ‌చ్చాడు. తెలుగు స్టార్ హీరోల దృష్టి కూడా ఒక ద‌శ‌లో హ‌రి మీద ప‌డింది. కొంద‌రు పిలిపించుకుని క‌థ‌లు కూడా విన్నార‌ట‌. అయితే ఎందుకో ఆ సినిమాలు ప‌ట్టాలెక్క‌లేదు.

అదే స‌మ‌యంలో రెండు సినిమాల ఫెయిల్యూర్ లు హ‌రిని వెన‌క్కు ప‌డేశాయి. సింగం 3, సామి 2 సినిమాలు ఫెయిల్ కావ‌డంతో హ‌రి కెరీర్ ఇబ్బందుల్లో ప‌డ్డ‌ట్టుగా ఉంది! అంత వ‌ర‌కూ ఈ ద‌ర్శ‌కుడు ఇచ్చిన హిట్ల‌ను అంతా మ‌రిచిపోయారు.  రెండేళ్లుగా సినిమాలు లేవు. అయితే హ‌రితో ఇది వ‌ర‌కూ హిట్స్ కొట్టిన సూర్య మాత్రం మ‌రో అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగా ఉన్నారు. వీరి కాంబోలో ప‌లు సినిమాలు రూపొందాయి. వాటిలో సింగం సీరిస్ లో మూడు సినిమాలున్నాయి.

అంత‌కు ముందు ఆరు, వేల్ వంటి సినిమాలున్నాయి. ఇప్పుడు ఆరో సినిమాకు గానూ వీరు మ‌రోసారి క‌లుస్తున్నారు. దీనికి ఆరువా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిన‌ట్టుగా స‌మాచారం. ఒకే షెడ్యూల్ లో ఈ సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ సారి కూడా హ‌రి సినిమాలో అరుపులు కేక‌లేనా.. లేక వెరైటీగా వ‌స్తారో చూడాల్సి ఉంది!

‘మెగాస్టార్ ది లెజెండ్’ పుస్తకావిష్కరణ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?