అంబానీ కుటుంబం ధరించే అత్యంత ఖరీదైన వాచీలలో రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన ‘ఆర్ఎం 57-03 టర్బిల్లాన్ సఫైర్ డ్రాగన్’ ఒకటి. దీని మార్కెట్ ధర సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయలు.
ఆసియా మార్కెట్ కోసం ఈ మోడల్ వాచీల్ని ప్రత్యేకంగా కేవలం 55 పీసులు మాత్రమే తయారు చేశారు. అరుదైన డిజైన్, అత్యుత్తమ హస్తకళా నైపుణ్యం ఈ వాచీ ప్రత్యేకతలు.
ఈ గడియారం లోపల కనిపించే డ్రాగన్ దీనికి ప్రధాన ఆకర్షణ. డైమండ్ తర్వాత అంతటి గట్టిదనం ఉండే సఫైర్ క్రిస్టల్ అనే స్వచ్ఛమైన పదార్థంతో ఈ డ్రాగన్ ను తయారు చేశారు. లేజర్ సాయంతో అత్యంత సూక్ష్మంగా కట్ చేసి, ఆపై చేతితో మెరుగుపెట్టడం ద్వారా దీనికి నగిషీ అద్దారు.
సఫైర్‌తో ఇలా చేయడం చాలా కష్టంతో కూడిన పని. దీని తయారీకి డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ప్రపంచస్థాయి కళాకారులు, వాళ్లు వెచ్చించే సమయం కూడా లెక్కలోకి తీసుకోవాలి.
తాజా సమాచారం ప్రకారం, ఇలాంటి ఒక్క వాచీ తయారీకి దాదాపు 7 నెలల సమయం పడుతుందంట. అందుకే ఇప్పటివరకు 55 మాత్రమే తయారుచేయగలిగారు. అందుకే ఈ గడియారాలకు అంత ధర.
పైగా ఇది పారదర్శకంగా ఉంటుంది. వాచీ లోపలి యంత్రం పనిచేసే తీరును బయట నుంచి కూడా స్పష్టంగా చూడొచ్చు.
ఈ డ్రాగన్ శరీరం మధ్యలో ఒక ఎర్రటి రూబీ బాల్ ఉండి. వాచీ కేస్ అత్యంత బలమైన, తేలికపాటి కార్బన్ మెటీరియల్ తో తయారైంది. దానికి తోడు బంగారం, రత్నాల కూర్పు ఉండటం వల్ల ఈ వాచీకి అంత భారీ ధర.
స్విట్జర్లాండ్ దేశానికి చెందిన నిపుణులు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ మోడల్ వాచీలు ఒక్క అంబానీ కుటుంబం దగ్గరే 5 ఉన్నట్టు చెబుతారు. వాటిలో ఒక వాచీని అనంత్ అంబానీ ధరించి తాజాగా ఫొటోలకు పోజులిచ్చాడు.

సిరిగలవానికి చెల్లును