ఒక నిర్మాతపై మరో నిర్మాత నెగెటివ్ ప్రచారం

బాధిత నిర్మాత సీరియస్ అవుతున్నాడు. రేపోమాపో యాక్షన్ లోకి దిగేలా ఉన్నాడు. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో మరో పెద్ద వివాదం రేగడం ఖాయం.

ఒక హీరోపై మరో హీరో ట్రోల్ చేయించడం చూశాం. ఒక సినిమాపై మరో సినిమా నిర్మాత నెగెటివ్ కామెంట్స్ వేయించడం చూశాం. చివరికి ఒక హీరోయిన్ పై మరో హీరోయిన్ బురదజల్లించే కార్యక్రమం కూడా చూశాం. కానీ ఇది నిర్మాత-నిర్మాతకు మధ్య జరుగుతున్న వ్యవహారం.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉండే ఓ నిర్మాతపై ఈమధ్య వరుసగా కథనాలు వస్తున్నాయి. కొన్నాళ్ల కిందట ఓ టీవీ నటితో ముడిపెడుతూ కథనాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఓ హీరోయితో ఎఫైర్ అంటూ స్టోరీలు కనిపిస్తున్నాయి.

ఆ నిర్మాత ఎలాంటి వాడన్నది ఇక్కడ మేటర్ కాదు. ఆ పోస్టులు ఎలా ప్రత్యక్షమౌతున్నాయనేది చర్చ. అవును.. ఓ నిర్మాణ సంస్థకు చెందిన సోషల్ మీడియా ఆఫీస్ నుంచి ఈ తరహా పోస్టులు, కథనాలు కనిపిస్తున్నాయి.

ఈ ఇద్దరు నిర్మాతల మధ్య చాన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కేవలం సినిమా వ్యాపారానికే ఓ పోటీ పరిమితం కాలేదు. ఏకంగా టాలీవుడ్ లో తామే గొప్ప అని చూపించుకునేంతవరకు వెళ్లింది వ్యవహారం.

ఈ క్రమంలో సదరు నిర్మాత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, అతడ్ని బ్యాడ్ గా చూపిస్తూ ఓ సోషల్ మీడియా కంపెనీ చురుగ్గా వ్యవహరిస్తోంది. అందుకే ఈమధ్య రిలీజైన ఓ పెద్ద సినిమా ప్రచారానికి కూడా సదరు బాధిత నిర్మాత దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారం, పోస్టులన్నీ బాధిత నిర్మాత వద్దకు చేరాయి. ప్రారంభంలో వీటిని అతడు లైట్ తీసుకున్నాడు. ఇది కూడా ఓ ప్రచారమే అని భావించాడు.

కానీ ఈమధ్య వ్యవహారం శృతి మించింది. సిస్టర్ గా భావించిన హీరోయిన్ తో సైతం ముడిపెడుతూ కథనాలు వస్తున్నాయి.

దీంతో బాధిత నిర్మాత సీరియస్ అవుతున్నాడు. రేపోమాపో యాక్షన్ లోకి దిగేలా ఉన్నాడు. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో మరో పెద్ద వివాదం రేగడం ఖాయం.

అతడికి సంబంధించిన పెద్దలు మాత్రం పంచాయితీ పెట్టి మేటర్ సెటిల్ చేద్దాం అంటున్నారు.

6 Replies to “ఒక నిర్మాతపై మరో నిర్మాత నెగెటివ్ ప్రచారం”

Comments are closed.