ప్రేమించలేదని యువతిపై దాడులు.. తిరస్కరించిందని హత్యలు.. ఇప్పుడు రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో, పదో తరగతి వయసులో ఉన్న బాలికపై చైన్సాతో దాడి!
హాలీవుడ్ డార్క్ క్రైమ్ సినిమాల్లో కనిపించే భయానక దృశ్యం నిజ జీవితంలో మన పాఠశాలలోనే చోటుచేసుకుంది. ఒక బాలికపై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తి క్రూరత్వానికి నిదర్శనం మాత్రమే కాదు. పిల్లలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థల పనితీరుపై నిలదీయాల్సిన సందర్భం కూడా!
ఇది ఎంత తీవ్రమైన భద్రతా లోపం? పాఠశాలలోకి ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? వారి వద్ద ప్రమాదకరమైన పరికరాలు ఉన్నాయా? అన్నది పరిశీలించే వ్యవస్థ లేదా? పిల్లలు తరగతి గదుల్లో చదువుకుంటున్న సమయంలో ఇలాంటి నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?
పాఠశాల అంటే పిల్లలకు భద్రత కల్పించాల్సిన ప్రదేశం. అక్కడే ప్రాణభయం ఎదురైతే తల్లిదండ్రులు ఎవరిని నమ్మాలి? పాఠశాలల భద్రతపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలున్నాయా? వాటి అమలును తనిఖీ చేస్తున్నారా? భద్రతా సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపాలు, మరమ్మతుల సమయంలో అనుసరించాల్సిన నిబంధనలపై సమీక్ష జరుగుతోందా? ఇవన్నీ సమాధానం కోరుతున్న ప్రశ్నలు.
ఒక ప్రైవేట్ స్కూల్లోకి వెళ్లాలంటే సరే.. గేటు దగ్గరే పదిసార్లు ప్రశ్నిస్తారు. అనుమతి లేకుండా లోపలికి అడుగుపెట్టడం అంత సులభం కాదు. మరి ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఇంతటి దుర్మార్గుడు అంత తేలిగ్గా ఎలా ప్రవేశించగలిగాడు?
పిల్లలు చదువుకునే బడినే తన క్రూరత్వానికి వేదికగా ఎంచుకునేంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ఘటన నిందితుడి దుర్మార్గాన్ని మాత్రమే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా పర్యవేక్షణ ఎంత డొల్లగా ఉందో కూడా బయటపెడుతోంది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల ప్రాణాలకు భద్రత కల్పించలేని వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?
నిందితుడిని అరెస్టు చేయడం, కఠిన శిక్ష పడేలా చూడటం అవసరమే. కానీ నేరం జరిగిన తర్వాత నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మాత్రమే పాలన కాదు. ప్రమాదాన్ని ముందుగానే నివారించే వ్యవస్థలను నిర్మించడమే నిజమైన బాధ్యత.
అంతేకాదు, తిరస్కారాన్ని భరించలేక హింసకు దిగే మనస్తత్వాన్ని కూడా సమాజం ప్రశ్నించాలి. పిల్లలకు పాఠ్యపుస్తకాలతో పాటు పరస్పర గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, భావోద్వేగ నియంత్రణ వంటి విలువలను నేర్పాలి.
టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఒక బాలిక తన తరగతి గదిలోనే సురక్షితంగా ఉండలేకపోతే ఆ అభివృద్ధికి అర్థమేమిటి?
చైన్సా పట్టిన వ్యక్తి నేరం చేశాడు. కానీ ఆ ప్రమాదకరమైన వ్యక్తి తరగతి గది వరకు చేరకుండా అడ్డుకోవాల్సిన వ్యవస్థ ఎక్కడ విఫలమైందో తేల్చడం కూడా అంతే ముఖ్యం.
ఎందుకంటే నిందితుడికి శిక్ష పడితే ఒక నేరానికి న్యాయం జరిగినట్లవుతుంది. వ్యవస్థలోని లోపాలు సరిదిద్దితేనే మరెందరో పిల్లలకు భద్రత లభిస్తుంది.
రాప్తాడు ఘటన ఒక్కరోజులో పుట్టిన దారుణం కాదు. సమాజంలో హింస పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని, చట్టం అమలులో జవాబుదారీతనం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తున్న ఘటన.
ఊరూరా బెల్ట్ షాపులు, గంజాయి సమస్య, రాజకీయ కక్షలు.. వీటన్నింటిపై ప్రభుత్వానికి స్పష్టమైన నియంత్రణ ఉండాలి. కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజలకు రక్షణ ఎక్కడ?
మొన్నటి స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో ఏం జరిగింది? రాష్ట్రవ్యాప్తంగా దాడులు, ఘర్షణలు, నామినేషన్ పత్రాలు చించివేత వంటి ఘటనలు నమోదయ్యాయి.
నేటి సోషల్ మీడియా యుగంలో ఇలాంటి ఘటనలు కూడా హింసను ప్రేరేపించే అనేక అంశాల్లో భాగమవుతున్నాయి. హింసాత్మక దృశ్యాలు, బెదిరింపులు, దాడులను గొప్పగా చూపించే వీడియోలు, నేరాలకు పాల్పడినవారిని హీరోలుగా చిత్రీకరించే ధోరణులు కొందరిలో హింస పట్ల భయాన్ని తగ్గిస్తున్నాయి.
చేసిన తప్పుకు శిక్ష పడకపోతే, చట్టం ఏమీ చేయలేకపోతే.. “ఇంతే కదా.. మనల్ని ఎవరు ఏం చేస్తారు?” అనే ధైర్యం పెరుగుతోంది. హింసను సాధారణ విషయంగా భావించే ఈ మనస్తత్వం చివరకు పాఠశాలల గడప దాటి తరగతి గదుల్లోకి చేరితే.. దాని మూల్యం అమాయక పిల్లలు చెల్లించాల్సి వస్తుంది.

Package star cheppadu ga bike race cheyamani
జగనన్న చేసాడు కదా tyre puncture..
యువత ఉత్సాహాన్ని ఆపుకోకూడదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా
Public gaa uri తీయండి ఇలాటి వెధవల్ని.
భద్రత కి దీనికి ఎటువంటి సంబంధం లేదు…. పాఠశాల లు ఏమి అందర్నీ చెక్ చేసి పంపరు..
గంజాయి మద్యం అలవాటు వున్న వాడు ఎక్కడ నుంచి అయినా తెచ్చుకుంటాడు.. ఎలాగ అయినా సంపాదించు కుంటాడు
ఇంక హింస ని ప్రొచ్చాహిచడం. హీరోలు గా చూడడం అంటే డెడ్ బాడీ ని డోర్ డెలివరీ చేసిన వాడిని హీరో లాగ ఊరేగింపు తో తీసుకుని వెళ్లడం.. జగన్ ఒళ్ళో కూర్చో బెట్టుకోవడం… నువ్వు సుద్దులు చెప్పడం