క్లారిటీ ఇస్తారా లేక పుకార్లు కొనసాగిస్తారా?

ఈ సినిమా కోసం రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌ లోకి మారుతున్నాడు. దీనికి సంబంధించి మేకోవర్ కూడా స్టార్ట్ అయింది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌ లో రాబోతున్న కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఇది ప్రారంభం కానుంది. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇది.

రామ్ చరణ్ కెరీర్‌లో 17వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి. ‘రంగస్థలం’ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అటు పుష్ప ఫ్రాంచైజీ తర్వాత సుక్కూ నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌ లోకి మారుతున్నాడు. దీనికి సంబంధించి మేకోవర్ కూడా స్టార్ట్ అయింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించి వస్తున్న పుకార్లకు రేపు చెక్ పెడతారా లేదా అనేది పెద్ద ప్రశ్న.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. మొన్నటివరకు సారా అర్జున్ అన్నారు. ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపించింది. తాజాగా సాత్విక వీరవల్లి పేరు వినిపిస్తోంది. దీనిపై రేపు క్లారిటీ వస్తుందేమో చూడాలి.

అటు మ్యూజిక్ డైరక్టర్ పై కూడా చిన్నపాటి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడనేది పక్కా. ఈ విషయాన్ని మైత్రీ రవి చెప్పేశారు. మరి ఆ స్థానంలోకి ఎవరు రాబోతున్నారు? అనిరుధ్ వస్తున్నాడనే ప్రచారంలో నిజం ఎంత? రేపు క్లారిటీ వస్తుందేమో చూడాలి.