త్రివిక్రమ్ నిజంగా ఓ ఇతిహాసాన్ని తీయగలడా?

నేరుగా ఓ ఇతిహాసాన్ని తెరపైకి తీసుకురావొచ్చా..? సరిగ్గా ఇక్కడే త్రివిక్రమ్ పై అనుమానాలు రేకెత్తుకున్నాయి.

త్రివిక్రమ్.. టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లో ఒకడు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. మిగతా దర్శకులతో పోలిస్తే, ఈయన దగ్గరున్న ఎక్స్ ట్రా టాలెంట్, పురాణాలపై పట్టు. పురాణాలు, ఇతిహాసాలపై ఇంత పట్టున్న దర్శకుడు ప్రస్తుతం మరొకరు కనిపించరు.

అయితే ఈ పట్టు ఉంటే సరిపోతుందా.. నేరుగా ఓ ఇతిహాసాన్ని తెరపైకి తీసుకురావొచ్చా..? సరిగ్గా ఇక్కడే త్రివిక్రమ్ పై అనుమానాలు రేకెత్తుకున్నాయి.

గ్రాఫిక్స్ తో గేమ్స్ ఆడుకుంటున్న రాజమౌళి లాంటి దర్శకుడే తనకింకా మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాల్ని తెరకెక్కించే అర్హత రాలేదంటున్నాడు. అలాంటప్పుడు త్రివిక్రమ్ ఆ పని చేసి చూపించగలరా?

ప్రస్తుతం చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. కావాలంటే ఏఐలో కూడా పని కానిచ్చేయొచ్చు. కానీ సమస్య ఇక్కడ టెక్నాలజీతో పాటు.

ఓ ఇతిహాసాన్ని ఎక్కడ మొదలుపెట్టి, ఎక్కడ ముగిస్తామనేది ముఖ్యం. ఇంకా చెప్పాలంటే, ఇప్పటి తరానికి నచ్చే స్క్రీన్ ప్లేతో ఇతిహాసాన్ని తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటిది.

రామాయణ, మహాభారతాల్లో మనకు నచ్చిన భాగాన్ని తీసుకొని సినిమా తీయడం ఒకెత్తు. నచ్చిన భాగాలు తీసుకొని, మొత్తంగా సినిమాగా మలచడం మరో ఎత్తు. ఈ క్రమంలో పార్ట్-1, పార్ట్-2 కూడా తీయొచ్చు. కానీ తెలిసిన కథను కట్టిపడేసేలా చెప్పడమే ఇక్కడ సమస్య.

ప్రసుతానికైతే త్రివిక్రమ్ అడుగులు మెల్లగా మైథాలజీ వైపు పడుతున్నాయి. ఎన్టీఆర్ తో ఆయన గాడ్ ఆఫ్ వార్ సినిమాకు రెడీ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. నిజానికి ఇది పూర్తిస్థాయి పురాణం కాదు. ఇందులో కొంత ఫిక్షన్ కూడా జోడిస్తున్నారు.

దీన్ని జనరంజకంగా తెరకెక్కిస్తే, అప్పుడు రామాయణం లేదా మహాభారతం గురించి త్రివిక్రమ్ ఆలోచించొచ్చు. ఈలోగా తమన్ లాంటి వ్యక్తులు ఈ కోణంలో ఎక్కువగా ఎలివేషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది.

8 Replies to “త్రివిక్రమ్ నిజంగా ఓ ఇతిహాసాన్ని తీయగలడా?”

  1. లైబ్రరీ కి వెళ్లి స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ వార పత్రికల జోకులు ఒక ఏడాది చదివిన వాడు కూడా చెపుతాడు, నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావు, నువ్వే నువ్వే లో కామెడీ వాటిని వరసగా పేర్చి కూర్చినవి అని. వాటిని కూర్చడం కళ అయితే he mastered it. పురాణాల పట్టు, గిట్టు అని ఎలివేషన్ వద్దు, బాలజ్యోతి, బాలమిత్ర, చందమామ లో ఇలాటివి చాలా చదివి పెద్దల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకొనేవాళ్ళం మేము. అవి కూడా చదవని వాడు అదే పట్టు అనుకుంటే welcome కూపస్థ మండూకం….

  2. పుష్ప 2 , కల్కి తరువాత నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన ఒక మూవీ ఉంటే చూపించండి. 

Comments are closed.