ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు వాళ్ల దృష్టి అంతా పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై వుంది. తెల్లారితే అక్కడ పోలింగ్. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకుంది.
పులివెందులలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. పులివెందులలో వైసీపీకి షాక్ ఇచ్చే పరిణామాలు శరవేగంగా సాగుతున్నాయి.
పులివెందులలో 40 వార్డులున్నాయి. వీటిలో సగం వార్డులకే వైసీపీ అభ్యర్థుల్ని నామినేషన్ వేయించారు. మిగిలిన అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా ఎవరు అడ్డుకున్నారో లోకమంతా చూసింది. పులివెందుల చైర్మన్ బరిలో వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ ఉన్నారు.
ఓటుకు వెయ్యి చొప్పున వైసీపీ పంపిణీ చేసింది. వైసీపీ పంపకాలు చేశాక, టీడీపీ రంగంలో దిగింది. ఒక్కో ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేస్తూ, దయచేసి ఎవరూ ఓట్లు వేయడానికి రావద్దని టీడీపీ నేతలు హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
“మీ ఓటు మేమే వేస్తాం. దయచేసి సహకరించండి” అని ఓటర్లతో టీడీపీ నేతలు తేల్చి చెప్పడం గమనార్హం.
మరోవైపు పులివెందులను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ఒక పథకం ప్రకారమే వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వారిలో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఏజెంట్లు కూర్చోడానికి కూడా వీల్లేకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
మరోవైపు పులివెందుల లాడ్జీల్లోనూ, ఊరు వెలుపల ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వారంతా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మలమడుగు, కమలాపురం, తాడిపత్రి, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి పులివెందులకు రెండు వేల మంది పురుషులు, అలాగే అంతే సంఖ్యలో మహిళలు కూడా వెళ్లినట్టు స్పష్టమవుతోంది.
పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏ రకంగా అయితే రిగ్గింగ్‌కు పాల్పడ్డారో, రేపు అదే పునరావృతం చేయడానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

రేపటి పౌరులు
పోలింగ్ జరక్కముందే ఓటమికి సాకులు రెడీ చేసుకుంటున్న గ్యాస్ ఏంకటి.. ఏరా నిజమే కదా?
పోలింగ్ జరక్కముందే ఓటమికి సాకులు రెడీ చేసుకుంటున్న గ్యాస్ ఏంకటి
నాయకులు అందరూ ఏలేక్షన్స్ మీద busy గా ఉంటే
మా లంగామోహన మాత్రం ఎన్నికల కంటే తల్లీ చెల్లీ ని మోసం చేసి వాళ్ళ ఆస్తులు కొట్టేయాలో ఆలోచిస్తున్నాడు.
నువ్వు చూసావా రా 🪓
same అప్పుడు కుప్పం లో నిజాయితీగా గెలిచుంటే ఇప్పుడు పులివెందులలో కూటమి గెలుపు నిజాయితీ.