రిగ్గింగ్‌ను ఆపాల‌ని ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో ప్లెక్సీలు

ప‌ర‌మ ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లపై తీవ్ర ఆందోళ‌న నెల‌కుంది

ప‌ర‌మ ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లపై తీవ్ర ఆందోళ‌న నెల‌కుంది. నామినేష‌న్ల సంద‌ర్భంగా పెద్ద ఎత్తున వైసీపీతో పాటు ఇత‌ర ప్ర‌తిప‌క్ష‌, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌పై టీడీపీ రౌడీమూక‌లు విచ్చ‌ల‌విడిగా దాడికి పాల్ప‌డ్డాయి.

చివ‌రికి వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి వాసుయాద‌వ్ కూడా నామినేష‌న్ వేయ‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో దొంగ‌చాటుగా, అల్ల‌రి మూక‌ల క‌ళ్లుగ‌ప్పి వాసుయాద‌వ్ నామినేష‌న్ వేయాల్సి వ‌చ్చింది.

ఈ అరాచ‌కాల‌పై పోలీస్‌, ఎన్నిక‌ల అధికారుల‌కు వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. అనంత‌రం సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు, మిగిలిపోయిన 18 డివిజ‌న్ల‌లో వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌గ‌లిగారు.

ఈ త‌తంగం అంతా, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌హ‌జంగానే ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తి ప్ర‌జానీకంలో తీవ్ర భ‌యాందోళ‌న రేకెత్తిస్తోంది.

దీంతో తిరుప‌తి న‌గ‌రంలో ఎస్పీ సుబ్బరాయుడికి విన్న‌విస్తూ ప్ర‌జ‌లు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఎస్పీ సార్ తిరుప‌తిలో రిగ్గింగ్‌ను అరిక‌ట్టండి అని కోరుతూ తిరుప‌తి ప్ర‌జ‌ల పేరుతో భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే తిరుప‌తి ప‌విత్ర‌త‌ను కాపాడుకుందామ‌ని వేడుకోవ‌డం విశేషం. ఇంగ్లీష్‌లో కూడా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తిరుప‌తిలో ఎంత భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కుందో ఈ ప్లెక్సీల ఏర్పాటుతో అర్థం చేసుకోవ‌చ్చు. తిరుప‌తి న‌గ‌ర ప్ర‌జ‌ల మనోభావాల్ని గుర్తెరిగి, గౌర‌వించి, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేలా పోలీస్ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

13 Replies to “రిగ్గింగ్‌ను ఆపాల‌ని ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో ప్లెక్సీలు”

  1. పవన్ తోడు లేకపోతే చంద్రబాబుకి గెలవనని తెలుసు…

    పవన్ ఉన్నన్నాళ్ళు జగన్ కి గెలవనని జగన్ కి తెలుసు…

    పవన్ లేకపోతే తెలుగు రాజకీయాలు లేవని మోడీకి తెలుసు…

    ఈ సోది ఎక్కువ కనపడుతుంది…SM లో…

    The Fact Is…

    జగన్ & చంద్రబాబు ఉన్నన్నాళ్ళు పవన్ కళ్యాణ్ చెల్లని పావలా అని కూడా తెలుసుకోవాలి…

    The Bitter Truth Is…

    Future లో దేవామ్ష్ CM అవుతాడేమో కానీ…పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి….జీవితంలో CM అవ్వడు….

      1. జగన్ బెయిల్ రద్దు అనేది ఉండదు కోర్ట్ లో కేసు వాదనలు జరిగితే ఇక్కటినుంచి 6 సంవత్సరాలు తరువాత  తప్పు చేసి ఉంటే గరిష్టం గా 3 సంవత్సరాలు కానిష్టం గా ఒక సంవత్సరం పడుతుంది 

      2. బెయిల్ రద్దు ఐతే కాదు ఇంకా బీజేపీ ఐనా కాంగ్రెస్ అయినా ఆలా ఉంటే ఈ పాటికి చంద్రబాబు చూపించే వాడు 

Comments are closed.