మధుబాల.. భారతీయ చలనచిత్ర రంగంలో చెరగని అధ్యాయం. 50వ దశకంలో మధుబాల ఓ ప్రభంజనం. అతి చిన్న వయసులో అంటే, కేవలం 36 ఏళ్లకే ఆమె కన్నుమూశారు.
ఆమె మరణాన్ని తండ్రి అతావుల్లా ఖాన్ తట్టుకోలేకపోయారు. కూతురు మరణించిన ఆరేళ్లకే ఆయన కూడా ప్రాణం విడిచారు. అయితే ఆ ఆరేళ్లు, మధుబాలపై ఆ తండ్రి చూపించిన ప్రేమ అపారం.
తను బతికినంత కాలం క్రమం తప్పకుండా మధుబాల సమాధి వద్దకు వెళ్లేవారు అతావుల్లా ఖాన్. కూతురి ఖననం రోజున మధుబాల మృతదేహంపై ఆయన ఎక్కువ మొత్తంలో అత్తరు పోశారు. ఎంతలా అంటే నెలల పాటు ఆ స్మశాన వాటికలో సువాసనలు వచ్చాయి.
ఆ తర్వాత కూతురు సమాధిపై ఆయన పాలరాతి కట్టడం నిర్మించారు. వాళ్ల ఆచారం ప్రకారం, కొంత భాగం వదిలేసి కట్టాలి. కానీ ఆయన మాత్రం పూర్తిగా పాలరాతి కట్టడం చేపట్టారు. దాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారు. కుర్చీ వేసుకొని గంటల తరపడి అక్కడే కూర్చొని ఏడ్చేవారు.
అయితే, ఆ తండ్రి మరణానంతరం, మధుబాల సమాధిపై ఉన్న మార్బుల్ నిర్మాణాన్ని ఎవరో ధ్వంసం చేశారు. ఆ తర్వాత “మధుబాల” అని రాసిన పేరుతో చిన్న సమాధి మాత్రమే కనిపించేది. ఆ తర్వాత అది కూడా కనిపించలేదు. ఇదే శ్మశానవాటికలోనే దిలీప్ కుమార్, పర్వీన్ బాబీ, మహమ్మద్ రఫీ, నౌషాద్ వంటి ఇతర ప్రముఖుల సమాధులు కూడా ఉన్నాయి.
2010లో ముంబైలోని జుహు ముస్లిం కబరిస్థాన్లో స్థలం కొరత కారణంగా వివాదం చెలరేగింది. కొత్త ఖననాల కోసం స్థలం సర్దుబాటు చేయడానికి మధుబాల, మహమ్మద్ రఫీ, నౌషాద్ వంటి ప్రముఖుల స్మారక నిర్మాణాలను తొలగించి, 3 అడుగుల మేర మట్టి పోసి చదువు చేశారు.
ప్రస్తుతం మధుబాల సమాధి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. ఆమె కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఉందని, సమాధిని దర్శించే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధుబాల సోదరి.

వాళ్ళందరూ చాలా గొప్పవాళ్లే వాళ్ల వాళ్ల రంగాల్లో. వాళ్ళు ఉండవసింది ప్రజల మనసుల్లో సమాధుల్లో కాదు అన్న సత్యం ఇప్పుడైనా తెలిస్తే కనీసం ఇండియా మొత్తంలో వేల ఎకరాలు సమకూరుతాయి పేదలకు..
Enduku, Amabani Adaniki kattabattadam kosemega mee salaha.