బెదరని రెబెల్స్…ఏం చేయబోతున్నారు ?

రెబెల్స్ ఎపుడూ డేంజరే. ఫలితాలను వారు తారు మారు చేస్తూంటారు.

రెబెల్స్ ఎపుడూ డేంజరే. ఫలితాలను వారు తారు మారు చేస్తూంటారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే రెబెల్స్ ప్రభావం అపారంగా ఉంటుంది. అక్కడ వార్డులలో తక్కువ ఓట్లు ఉంటాయి.

మెజారిటీలు కూడా స్వల్పంగా ఉంటాయి. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని మారుస్తుంది. దాంతో రెబెల్స్ ఏ మాత్రం ఓటు చీల్చినా ప్రధాన అభ్యర్ధుల విజయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి వారి గెలుపునకు గండి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.

జీవీఎంసీ ఎన్నికల్లో చూస్తే రెబెల్స్ చాలా చోట్ల పోటీ చేస్తున్నారు. చివరి నిముషం వరకూ అభ్యర్ధుల వ్యవహారం తేలకపోవడంతో పాటు తమకు సీటు ఇస్తామని అని మొండి చేయి చూపించారని ఆగ్రహించి రెబెల్స్ పోటీకి దిగారు. ఇందులో మాజీ కార్పోరేటర్లు, బలమైన వర్గానికి చెందిన వారు ఉన్నారు.

ఇండిపెండెంట్లు ఎపుడూ జీవీఎంసీలో గెలుస్తూ ఉంటారు. అలా ఈసారి కూడా గెలుపు జెండా ఎగరేయాలని రెబెల్స్ పోటీకి దిగారు. కూటమి పార్టీల నుంచి ఎక్కువగా రెబెల్స్ ఉన్నారు. వైసీపీకి కూడా ఆ బెడద తప్పడం లేదు. జనసేన నుంచి కూడా రెబెల్స్ ఉన్నారు.

రెబెల్స్ విషయంలో కూటమి పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. వారిని దారిలోకి తేవడానికి సస్పెన్షన్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నాయి. ఇదే లాస్ట్ వార్నింగ్ సైలెంట్ గా ఉండకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీడీపీ హెచ్చరిస్తోంది. ఇక్కడితో పార్టీతో మీకు విడాకులే అని స్పష్టం చేస్తోంది.

అయితే ఇప్పటికే పది రోజులుగా జనంలో ఉంటూ తిరిగిన రెబెల్స్ అయితే తగ్గడం లేదు, చావో రేవో జనంలోనే తేల్చుకుంటామని అంటున్నారు. దాంతో ప్రధాన పార్టీలకు ఏమి చేయాలో అర్ధం కావడం లేదని అంటున్నారు.

వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో రెబెల్స్ చీల్చే ఓటు ప్రాణప్రదమైనదే అని అంటున్నారు. జీవీఎంసీలో అన్ని అంశాలతో పాటు రెబెల్స్ ప్రభావం కూడా ఫలితాల మీద గణనీయంగా ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి.

2 Replies to “బెదరని రెబెల్స్…ఏం చేయబోతున్నారు ?”

  1. పనిలో పని వైసీపీ కి కూడా రెబల్స్ ఉన్నారని  వదిలావ్..ఇద్దరి ముగ్గురు పేర్లు చెప్పు..ఎక్కడ వైసీపీ కి రెబల్స్ ఉన్నారో?

  2. పెద్దాయన కన్నెర్ర చేసినా, ఆగ్రహం వ్యక్తంచేసినా ఈ రెబల్ “ఒకటోసుకుని” దారికొస్తారు. ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలుగా, ఎంతమందిని చూడలేదు? ఆయన కోపం అంత పవర్ఫుల్. వేరే పార్టీవాళ్ళుకూడా అప్పుడప్పుడు భయపడతారు.

Comments are closed.