ప్రస్తుతం అమ్మతనానాన్ని ఆస్వాదిస్తోంది సమంత. దేవ్ కు జన్మనిచ్చిన తర్వాత, పూర్తిగా పిల్లాడికే టైమ్ కేటాయిస్తోంది. ఇప్పట్లో ఆమె సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు.
కానీ మార్కెట్లో మాత్రం సమంత పేరు మారుమోగిపోతోంది. ఆమె తదుపరి చిత్రం ఇదేనంటూ ఒకటే ప్రచారం. ఆ సినిమానే అభిమన్యుడు.
విశాల్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. విశాల్ కెరీర్ లో మంచి హిట్స్ లో ఇది కూడా ఒకటి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇప్పటికే పార్ట్-2 పనిమీద ఉన్నాడు. దర్శకుడు ఓకే అంటే హీరో విశాల్ కూడా ఓకే. ఎటొచ్చి సమస్యతోనే చిక్కొచ్చి పడింది.
తాజా సమాచారం ప్రకారం, అభిమన్యుడు-2 కోసం దర్శకుడు ఇప్పటికే సమంతను సంప్రదించాడు. ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడే సినిమా చేస్తామని ఆమెకు చెప్పి వచ్చాడట. సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రను సమంతానే తిరిగి పోషించాలని దర్శకుడు భావిస్తున్నాడట.
చూస్తుంటే.. సమంత రీఎంట్రీ మూవీ ఇదే అయ్యేలా ఉంది. కాకపోతే అటు రాజ్ నిడిమోరు ఏం ప్లాన్ చేస్తున్నాడనేది చూడాలి. అతడు సమంతతో మరో సినిమా లేదా వెబ్ సిరీస్ ఏదైనా ప్లాన్ చేస్తే, తొలి ప్రయారిటీ అటే ఉంటుంది మరి.
