Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాని మనసులో పాత కక్షలు!

నాని మనసులో పాత కక్షలు!

హీరో నానికి వైకాపా సోషల్ మీడియా జనాలకు ఎప్పుడూ చుక్క ఎదురే. ఏనాడో థియేటర్ పక్క కొట్టు కామెంట్ దగ్గర మొదలైన రగడ, ప్రతి సినిమా టైమ్ లో ఏదో విధంగా రగులుతూనే వుంది. మొత్తం మీద నాని కి వైకాపా జనాలకు పడదు అనే ఓ అభిప్రాయం సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ లోకి బలంగా వెళ్లిపోయింది. అయితే దీన్ని మరింత ప్లేరప్ చేయాలని హీరో నాని ఏనాడూ ప్రయత్నించలేదు. వీలయినంత వరకు తగ్గే వున్నట్లు కనిపించేవారు.

కానీ ఇప్పుడు వున్నట్లుండి పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికిన తొలి నాన్ మెగా హీరోగా రంగంలోకి దిగారు. నానికి కొంత మంచి ఫ్యాన్ బేస్ వుంది. యూత్ లో ఫాలోయింగ్ వుంది. అందువల్ల ఏదో మెగా జూనియర్ హీరోలు రంగంలోకి దిగినట్లు వుండదు. కొంత మంది అయినా నాని చెప్పాడని ఓటు వేసేవారు వుండొచ్చు.

అయితే తను పిలుపు ఇస్తే ఓట్లు జలజలా రాలిపోతాయని అనుకుని నాని పిలుపు ఇచ్చి వుండకపోవచ్చు. జనాలు అంతా ఎవరి రాజకీయ ఎజెండా వారు ఫిక్స్ చేసుకుని వున్నారని తెలియనంత అమాయకుడు కాదు నాని. కానీ ఎందుకు ఇప్పుడు ఓపెన్ అయ్యారు అంటే గతంలో వైకాపాతో వచ్చిన రగడ. అది ఇప్పటికి మనసులో బలంగా వుండి వుండాలి. మీ టైమ్ లో మీరు చూపిస్తే, నా టైమ్ లో నేను చూపిస్తా అనే ఆలోచన చేసి వుండొచ్చు.

సినిమా రంగంలో ఒకప్పుడు కమ్మ హీరోలది గట్టి పట్టుగా వుండేది. సీనియర్ హీరోల సీన్ తగ్గింది. ఎన్టీఆర్ బ్రదర్స్ తీరు వేరు. దాంతో కమ్మ హీరోల హవా ఇప్పుడు రాను రాను సన్నగిల్లుతోంది. మహేష్ బాబు సూపర్ స్టార్ హోదాలో వుంటే నాని తన రేంజ్ లో తను వున్నారు.  ఆ విధంగా చూసినా ఓ రేంజ్ వున్న కమ్మ హీరో ముందుకు వచ్చి, మెగా హీరోకి మద్దతుగా నిలవడం కాస్త వ్యూహాత్మకం అనుకోవాలి లేదా, ఇండైరెక్ట్ గా కూటమికి అండగా నాని నిలిచారు అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?