Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్- జనాలు సిద్దంగానే వున్నారు

టాలీవుడ్- జనాలు సిద్దంగానే వున్నారు

ఎన్నికల కారణంగా ఈ ఏడాది సమ్మర్ లో కీలకమైన రెండు నెలలు దాదాపు ఆవిరైపోయాయి. థియేటర్లకు చాలా నష్టం వాటిల్లింది. అటు ఐపిఎల్, ఇటు ఎన్నికలు, జనాలకు అస్సలు సినిమాల మీద ఆసక్తి వుంటుందా? అన్న అనుమానాలతో విడుదలలు అన్నీ దూరం పెట్టారు. ఏదో విడుదల చేయాల్సిందే అనుకున్న చిన్న సినిమాలు అన్నీ ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాయి. ఎన్నికల తరువాత నుంచి సినిమాల విడుదలలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో చిన్న ఆశ ఏమిటంటే ఈవారం విడుదలైన ఆ ఒక్కటీ అడక్కు, ప్రసన్నవదనం, బాక్ సినిమాల కలెక్షన్లు స్టడీగా వుండడం. కలెక్షన్లు కుమ్మేయకపోయినా, వాటి రేంజ్ కు బాగానే వున్నాయి. పైగా శుక్రవారం విడుదలైన తరువాత శని, ఆది స్టడీగా వున్నాయి.

నిజానికి ఆ ఒక్కటీ అడక్కు సినిమాకు మంచి టాక్ రాలేదు. కానీ సినిమా జనాలు ఏదైతే నమ్ముతారో, ఆ కారణాలు అయిన సమ్మర్, ఫ్యామిలీ, ఫన్ అనే రీజన్లను జనం పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే ప్రసన్న వదనం సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి కనుక వాటికి అనుగుణంగా జనం స్పందిస్తున్నారు. ఏ ప్రచారం కూడా పెద్దగా లేకున్నా, హర్రర్ మూవీలు ఇష్టపడే బ్యాచ్ ‘బాక్’ సినిమా లైన్ లోకి వెళ్లింది.

అంటే, ఇప్పుడు అర్థం అవుతోంది ఏమిటి అంటే, ఎన్నికలు, ఐపిఎల్ వున్నా, సమ్మర్ సీజన్ లో సినిమాల కోసం చూసే బ్యాచ్ అనేది వుంది. సరైన సినిమా అందిస్తే టిల్లు స్క్వేర్ మాదిరిగా కలెక్షన్లు కుమ్మేస్తాయి. కానీ అలాంటి సరైన సినిమా అందించాల్సిన బాధ్యత టాలీవుడ్ మీద వుంది.

ఎన్నికల తరువాత కాస్త బజ్ తో వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా నుంచి రెండు పాటలు బాగా వైరల్ అయ్యాయి. మంచి ఓపెనింగ్ అందుకునే అవకాశం క్లారిటీగా కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?