Advertisement

Advertisement


Home > Movies - Movie News

భర్తీ చేసే సమయం వెంటనే వచ్చింది?

భర్తీ చేసే సమయం వెంటనే వచ్చింది?

ఫ్యామిలీ స్టార్... ఈ సినిమా గురించి ఇక పోస్టుమార్టం అనవసరం. చివరికి ఓటీటీ రిలీజ్ టైమ్ లో కూడా ఏకేశారు జనం ఈ సినిమాని. ఇది ఏ స్థాయిలో నష్టాల్ని తెచ్చిపెట్టిందో దిల్ రాజు ఒక్కరికే తెలుసు. కానీ దాని గురించి ఆయన మాట్లాడరు. కనీసం ఇప్పట్లో బయటపడరని అనుకోవాలి. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఫ్యామిలీ స్టార్ కాంబినేషన్ వెంటనే కలిసింది కాబట్టి.

అవును.. దిల్ రాజు, విజయ్ దేవరకొండ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. విజయ్ తో చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ సినిమా రాజు వద్ద చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇది ఆ సినిమా కాదు. వేరే మూవీ.

దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ రవికిరణ్ కోలా చాన్నాళ్లుగా ఓ స్టోరీపై వర్క్ చేస్తున్నాడు. అది దిల్ రాజు దగ్గరే ఉంది. ఆ కథపై హీరోగా విజయ్ దేవరకొండను నిలబెట్టారు. అధికారికంగా ప్రకటన కూడా చేశారు.

దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ డ్రామా ఇది. ప్రస్తుతానికైతే సినిమాకు సంబంధించిన వివరాలు ఇవే.

ఈనెల 9వ తేదీన ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని విశేషాలు వెల్లడిస్తామంటున్నారు. మొత్తానికి దిల్ రాజు, విజయ్ దేవరకొండ తొందరగానే కలిశారు. నష్టాల్ని భర్తీ చేసే పని మొదలుపెట్టబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టుపైకొస్తాడు దేవరకొండ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?