మూవీ రివ్యూ: ది ప్యారడైజ్

ప్రేక్షకుల అంచనాలకి ఎక్కడా పొంతన కుదరక ఈ “ప్యారడైజ్” నరమేధాన్ని తెరకెక్కించి “హెల్” ని తలపించింది.

సినిమా: ది ప్యారడైజ్
రేటింగ్: 2/5
నటీనటులు: నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు ఎం., కాయదు లోహర్, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయాల్, తదితరులు
డైలాగ్స్: తోట శ్రీనివాస్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: చి. సాయి
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఫైట్స్: రామ్–లక్ష్మణ్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
విడుదల తేదీ: సెప్టెంబర్ 24, 2026

ఎప్పుడో షూటింగ్ మొదలై, ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూసేలా చేసి, నేడు విదుదలైన చిత్రం “ది ప్యారడైజ్”. నాని గతంలో కనపడని లుక్ తో, చాలా రగెడ్ గా ఉన్న కేరెక్టర్ ఇది. రెండు పాటలు ఆల్రెడీ పాపులర్ కావడంతో ట్రైలర్ లేకపోయినా జనాన్ని థియేటర్స్ కి రప్పించిన చిత్రమిది. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళ్తే…1970-80ల నేపథ్య్మలో, నేటి తెలంగాణా ప్రాంతంలో ప్రభుత్వ గుర్తింపే లేని ‘సవారి’ అనే తెగ… ఆ తెగ ఉన్న ప్యారడైజ్ అనే ప్రాంతాన్ని షికంజా మాలిక్ (మోహన్ బాబు) తన గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తుంటాడు. ఒకరోజు సమ్మక్క (సోనాలి కులకర్ణి) కొడుకు జడలు (నాని) చిన్నప్పుడు బిర్యానీ దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. అది తెలుసుకున్న మాలిక్, జడలు చేతిపై “ల***కొడుకు” అని పచ్చబొట్టు వేయిస్తాడు.

పద్నాలుగేళ్ల తర్వాత జడలు (నాని) జైలు నుంచి బయటికి వస్తాడు. మాలిక్ మీద పగ తీర్చుకోవాలనే కసితో ఉంటాడు. తన తల్లి సమ్మక్కను మాత్రం జడలు మనస్ఫూర్తిగా ద్వేషిస్తుంటాడు. ఆమె ఒక వేశ్య అని నమ్ముతూ పెరిగిన జడలు, తన తల్లి మీద కోపంతో ఉంటాడు. ఇదే సమయంలో యాక్టర్ అవ్వాలనే కలతో ఉన్న సుబ్బు (కాయదు లోహర్)తో జడలుకు ప్రేమ మొదలవుతుంది.

అయితే సమ్మక్క స్నేహితురాలు (ఈశ్వరీ రావు) అసలు నిజం జడలుకు చెబుతుంది. తన తల్లిని వేశ్యగా ఎందుకు ముద్ర వేశారో తెలుసుకున్న జడలు, ఇంతకాలం తన తల్లిని అపార్థం చేసుకున్నానని గ్రహిస్తాడు. ఆ తర్వాత మాలిక్ కొడుకును జడలు చంపేస్తాడు. దీంతో షికంజా మాలిక్, జడలు మధ్య నేరుగా పోరు మొదలవుతుంది.

ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగే పగ, పోరాటం, ప్రతీకారం, ఆ తెగకి ప్రభుత్వ గుర్తింపు అనే అంశాలతో సినిమా మొత్తం నడుస్తుంది.

డైలాగ్స్ లో సహజమైన తెలంగాణా సొగసు వినపడదు. తెలుగులోనే మధ్య మధ్యలో హిందీ పదాలు జొప్పిస్తే తెలంగాణా అయిపోతుంది అన్నట్టుగా కొన్ని డయలాగ్స్ రాసుకున్నారనిపిస్తుంది. నాని డైలాగ్ డెలివరీ కూడా కృతకంగా ఉంది. ఎమోషన్ పండాల్సిన చోట అస్సలు పండలేదు.

అట్టడుగు వర్గాలకి, అధికార వర్గానికి మధ్యన ఉన్న పోరుని తెర మీద పలు కాలాల్లో పలువురు దర్శకులు రకరకాలుగా చూపించారు. వాటిల్లో ఇదొక రకం. కథాంశంగా తీసుకుంటే కొత్తదనమేమీ లేదు. అయితే కథనంలో కొత్తదనం ట్రై చేసారు. అది చాలా ఫోర్స్డ్ గా ఉంది.

డార్క్ మోడ్ లో, బురదలో, దయనీయ స్థితిలో సవారీలుండే చోటుని చూపించారు. మళ్లీ అక్కడే హీరోయిన్ ఉన్నప్పుడు ఆ హోటల్, సినిమా హాల్ ఉంటాయి..బురద కనపడదు, ఆమె లేనప్పుడు మాత్రం బురద..ఆ కాంట్రాస్ట్ ఒక కంఫ్యూజన్.

అయినా అంతలా టార్చర్ పెట్టే ఊరిపెద్ద షికంజా మాలిక్ ఉన్నప్పుడు, బతుకంతా నార్త్ కొరియాలా ఉన్నప్పుడు ఆ జనం అక్కడే ఎందుకుంటారో అర్ధం కాదు. దేశమంతా షికంజా మాలిక్ లే ఉండరు కదా! కథలో డ్రామా రక్తికట్టనప్పుడు ఇలాంటి డౌట్లే వస్తుంటాయి.

సాంకేతికంగా చూస్తే…సినిమా రిలీజ్‌కు ముందే వైరల్ అయిన “ఆయా షేర్”, “యేష నాగుల” పాటలు థియేటర్‌లో కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే పాటల కంటే అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో బీజీఎం చాలా సీన్స్‌ను ఎలివేట్ చేసింది. కానీ సెకండాఫ్‌లో మాత్రం బీజీఎం ఇంపాక్ట్ ఉండదు.

ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్‌లో ఒకటి. అవినాష్ కొల్లా వేసిన స్లమ్ సెట్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీ తీసుకొచ్చాయి. కొన్ని సీన్స్ చూస్తే “సలార్” గుర్తొచ్చినా, ఓవరాల్‌గా ప్రొడక్షన్ డిజైన్ మాత్రం బాగానే వర్క్ అయింది.

ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌ వీక్‌గా అనిపిస్తుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఏం జరగబోతుందో ఈజీగా అర్థమయ్యేలా, సాగదీసినట్టుగా మారుతుంది.

సినిమాలో ఉన్న రెండు మెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌లు బాగానే తెరకెక్కించారు. కానీ వాటిలో హింసను మరీ ఎక్కువగా చూపించడం వల్ల ఉండాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. రక్తపాతం, మితిమీరిన హింస చాలా ఎక్కువగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చూడటానికి కూడా చాలా కష్టంగా, జుగుప్సగా అనిపిస్తాయి. ఈ స్థాయిలో హింస ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు సినిమా దూరమయ్యే అవకాశం ఉంది.

నటీనటుల గురించి చెప్పుకోవాలంటే.. ఈ మధ్య నాని మాస్, యాక్షన్ రోల్స్ చేయడానికి వరుసగా ప్రయత్నిస్తున్నాడు. ‘ది ప్యారడైజ్’లో మాత్రం ఇంతకుముందెప్పుడూ చేయని డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌లో కనిపించాడు. జడలు వేసుకుని, ఒంటినిండా టాటూలతో, ఒక గిరిజన కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా నాని కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ కోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై నాని బాగానే వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే నాని పెర్ఫార్మెన్స్ మాత్రం అంత గొప్పగా అనిపించదు. తనకు తానుగా చేసుకుంటూ పోయినా ఆడియన్స్ మనసుని లాక్ చేసే పర్ఫామెన్స్ ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకో ఇంత రేంజ్ ఉన్న పాత్రని నాని కేరీ చేయలేకపోయాడనిపించింది. తన ఇమేజ్ కి తగ్గట్టుగా కాస్త టోన్ డౌన్ చేసుకుని ఉంటే కాస్తైనా కన్విన్సింగ్ గా ఉండేదేమో.

సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి మాత్రం బాగా చేసింది. సీనియర్ బాలీవుడ్ నటి కావడంతో క్యారెక్టర్‌కు ఒక గౌరవం, మంచి ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చింది. చాలా సీన్స్‌లో ఆమెనే షో మొత్తం తనవైపు తిప్పుకుంది.

కాయదు లోహర్ పాత్ర ఒక సినిమా నటి కావాలనే ప్రయత్నం చేసే అమ్మాయి. అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల…అవకాశాల కోసం బి-గ్రేడ్ సినిమాల్లో కూడా నటించే క్యారెక్టర్ ఇది. అయితే ఆమె ట్రాక్ ని, మెయిన్ కథలో తల్లి పాత్రతో కలపడం వల్ల పర్పస్ సర్వ్ అయ్యింది.

సోనాలి కులకర్ణి ఫ్రెండ్‌గా ఈశ్వరీ రావు చాలా బాగా చేసింది. సమ్మక్క గతం గురించి ఆమె చెప్పే సీన్స్ సినిమాలోని మంచి ఎమోషనల్ పార్ట్స్‌లో ఒకటిగా నిలుస్తాయి.

షికంజా మాలిక్‌గా మోహన్ బాబు మొదట్లో మంచి ఇంప్రెషన్ ఇచ్చాడు. సినిమా కూడా ఆయన క్యారెక్టర్‌తోనే ఓపెన్ అవ్వడంతో, చాలా పవర్‌ఫుల్ విలన్‌ను చూడబోతున్నామనే ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇక క్లైమాక్స్‌లో ఆయన క్యారెక్టర్‌కు ఇచ్చిన ట్రీట్‌మెంట్ కూడా పేలవంగా ఉంది.

సంపూర్ణేష్ బాబుది చాలా చిన్న పాత్ర. ఆ పాత్రను ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు అనిపిస్తుంది.

రాఘవ్ జుయాల్ విలన్ గా లుక్ ఓకే కానీ..రైటింగ్ వీక్ గా ఉండడంతో..పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నున్నగా బట్టతల ఉండే రాం జగన్ కి విగ్ పెట్టారు; నిండుగా జుట్టుండే రాజ రవీంద్రకి బట్టతల పెట్టారు…ఆ రకంగా కూడా దర్శకుడు వేరియేషన్స్ చూపించాడు.

కేసీఆర్‌ను పోలిన క్యారెక్టర్‌లో ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి ఒక డీసెంట్ క్యామియో చేశాడు. “లక్ష్మీస్ ఎన్.టి.ఆర్” ఫేం పి. విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో చిన్న గ్లింప్స్ లో కనిపించాడు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నా నీట్‌గా సాగి, ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ వల్ల బాగానే వర్క్ అవుతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా పూర్తిగా గాడి తప్పుతుంది. శ్రీకాంత్ ఓడెలకు కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో క్లారిటీ మిస్సైనట్టు అనిపిస్తుంది. ఒకవైపు షికంజా–జడలు మధ్య నేరుగా గొడవ, మరోవైపు జడలును సవారి తెగకు లీడర్‌గా చూపించి ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాడే ట్రాక్‌ను నడిపిస్తాడు. ఈ రెండు కథలు సహజంగా కలవవు.

కథకు కావాల్సిన ఎమోషనల్ వెయిట్, డ్రామాటిక్ పేఆఫ్ లేకపోవడంతో యాక్షన్, హింస, భారీ స్కేల్ ఉన్నా సీన్స్ నిజమైన ఎలివేషన్ ఇవ్వవు. అప్పుడే పుట్టిన పిల్లవాడిని కాపాడే లాంగ్ ఫైట్ విజువల్‌గా బాగున్నా, లాజిక్ లేక, ఎమోషన్ పండక సాగదీసినట్టుగా అనిపిస్తుంది. చివరికి ఇది సుదీర్ఘంగా, ప్రెడిక్టబుల్‌గా, అలసట తెప్పించే గందరగోళ చిత్రంగా మిగులుతుంది. ఓపెనింగ్ లో ఉన్న ఫీల్ చివరి వరకు ఉండదు.

కొన్ని సన్నివేశాలు చాలా అతిగా, అసమంజసంగా ఉన్నాయి. తీసినవాళ్లు కొన్ని చోట్ల గొప్ప అనుభూతినిస్తున్నామని అనుకుని ఉండొచ్చు కానీ, నిజానికి అవి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాయి. ఉదాహరణకి హీరో ఫైటింగులో వీరంగం చేస్తుంటే బందీగా ఉన్న అతని తల్లి నాట్యం చేస్తుంది. సెకండాఫులో ఎంతో ఎమోషనల్ గా పండించాల్సిన ఆ సీన్, ఆడియన్స్ ని మండించింది.

ఇక కలెక్టర్ సీనైతే పరాకాష్ట. గుర్తింపు కార్డ్ కోసం సంతకాలు పెడతారా పెట్టరా అంటూ పిక్కలోతున్న నీళ్లల్లో కూర్చుని గొడవ చేస్తాడు.

ఒక దశలో హీరో సొంత దేశం ప్రకటిస్తాడు. అవును..సొంత పార్టీ కాదు..ఏకంగా దేశమే. డాక్టర్ ని, టీచర్ ని కిడ్నాప్ చేసి ఆ దేశంలో పని చేయించుకుంటారు. అది మరీ సిల్లీగా, చైల్డిష్ గా అనిపిస్తుంది.

మోహన్ బాబుకి, నానికి మధ్యన ఒక ఫైట్ ఉంటుంది. అందులో మోహన్ బాబు “భారతీయుడు” కమల్ హాసన్ టైపులో మర్మకళలాంటిదేదో ప్రయోగించి నానిని ఎగరేసి తన్నడం మరీ క్రింజ్ గా ఉంది. అప్పటి వరకు మహాబలశాలి అన్నట్టుగా నానిని ప్రొజెక్ట్ చేసి, అలా పెద్దాయన ఎత్తి కుదేస్తుంటే ప్రేక్షకులు దీర్ఘంగా నిట్టూర్చాల్సి వచ్చింది.

చివరిగా చెప్పేదేంటంటే ..ఇది పూర్తిస్థాయి హింసాసన్నివేశాలతో ప్యాక్ చేసిన హెల్-బిర్యాని. సినిమా చూస్తున్నంతసేపూ మటన్ షాపులోనో, కబేళాలోనో ఉన్నట్టుంటుంది…తెర మీద హీరో విలన్స్ ని నరుకుతుంటే ముక్కలు మన మీద పడతాయేమో అనిపిస్తుంటుంది.… టైటిల్ “ప్యారడైస్” అని ఉన్నా తెర మీద కనిపించేది మాత్రం హెల్లే. అన్నట్టు సత్యరాజ్ పాత్ర “ప్యారడైస్ ఈజ్ గోయింగ్ టు బి హెల్” అంటాడు. అంటే తీసినవాళ్లకి ముందే తెలుసన్నమాట. ఇచ్చిన బిల్డప్ కి, చెప్పిన విషయానికి, ప్రేక్షకుల అంచనాలకి ఎక్కడా పొంతన కుదరక ఈ “ప్యారడైజ్” నరమేధాన్ని తెరకెక్కించి “హెల్” ని తలపించింది.

బాటం లైన్: హెల్

51 Replies to “మూవీ రివ్యూ: ది ప్యారడైజ్”

    1. Not only natural star ..all star heroes who are  trying hard for Pan India star image should learn lessons..Pan India content is not xerox copy of kgf…it worked only till pushpa..Xerox copies scripts for them also it will not work out…need to learn from SSR..not from dark recognition oriented scripts…

  1. HIT series లో అంతకు ముందు వచ్చిన సినిమాలకి భిన్నంగా HIT 3 లో నాని చాలా వయోలెన్స్ చూపించాడు. ఇప్పుడు ప్యారడైజ్ లో ఇంకా ఎక్కువ రక్తపాతం, నరుక్కోవడం ఉంది. ఇలా చూపిస్తే Tier 1 హీరో అయిపోతానని నాని నమ్ముతున్నాడు 

  2. GA కి చిప్పు దొబ్బింది. చాలా నార్మల్ కామెంట్స్ కూడా మోడరేట్ చేసి డిలీట్ చేసేస్తున్నాడు 

  3. As per premiers talk..

    Pichhi Kukka rod movie

    Telangana vallaki tappa inka yevadiki nachaadu

    Better avoid this movie… Mainly familes & Children

    Aa slang ento, diagolues ardam kaavu, music heavily domination

    Expect TG, rest of all UNANIMOUS ULTRA PRO DIASTER

    DABBULU BOKKA

    #PARADISE

    Megay fans, PAWALA FANS,VD fans ki eeroju pandagey full enjoy chesthunaru night nundi movie dengindi ani

  4. నరకటం, చంపటం.. ఒక ఆర్టు, అది అందరికీ సెట్ అవ్వదు, అందరిని జనాలు యాక్సెప్ట్ చేయరు 

  5. విజయ్ దేవరకొండ నీ చూసి లిప్ లాకులు, అల్లు అర్జున్ ను చూసి మాస్ గెటప్ లు కాపీ కొట్టడం ఇంక ఆపితే బెటర్. 

Comments are closed.