జ‌న్మ‌భూమి క‌మిటీల పార్ట్ 2, అస‌లు క‌థ మొద‌లు!

ఇప్పుడు ప‌చ్చ‌చొక్కాల రాజ్యం న‌డుస్తోంది ఏపీలో. ఇది హింసాత్మ‌క ప‌రిస్థితుల‌కు కార‌ణం అవుతూ ఉంది కూడా!

తెలుగుదేశం, జ‌న‌సేన‌ల కూట‌మి పాల‌న రెండు నెల‌ల‌ను పూర్తి చేసుకుంది! మ‌రి ఈ రెండు నెల‌ల్లో జ‌రిగిన అద్బుతాలు ఏమీ లేవు కానీ, ప‌చ్చ‌చొక్కాలు వేసుకున్న వాళ్లు మురిసిపోతూ ఆదాయ మార్గాల‌ను వెదుక్కోవ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చూసుకుని జ‌న‌సైనికులు ఆనందభాష్పాలు రాల్చ‌డమే జ‌రుగుతూ ఉంది! ముందుగా జ‌న‌సైనికుల గురించి మాట్లాడుకుంటే.. వీళ్ల ఆనందం సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవ‌డం వ‌ర‌కే పాపం! ప‌వ‌న్ క‌ల్యాణ్ జెండా ఎగ‌రేశాడ‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పోలీసులు సెల్యూట్ చేశార‌ని.. వీరు మురిసిపోతూ ఉన్నారు.

సినిమాల్లో ఇలాంటి సీన్ల‌ను చూసి ఆనంద‌ప‌డిన వారికి, ఇప్పుడు ఇలాంటి స‌న్నివేశాలు బాగానే ఆనందాన్ని ఇవ్వొచ్చు! అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలాంటి వైభోగాల‌ను అనుభ‌విస్తున్నార‌నేది పాయింటే కాదు, ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో చూపిన వీరావేశం ఇప్పుడు ఏమైంది? అనేదే! ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ లో ఆ వేడి ఏదీ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ప్ర‌సంగాల్లో అరుపులు కేక‌లు లేవు! అప్పుడేమో త‌న‌కు అధికారం ద‌క్కాలి కానీ.. ఆ త‌ర్వాత అద్భుతాలే అనేంత స్థాయిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా ప్ర‌సంగాలు చేసే వారో వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు! ఆ వీరావేశం ఇప్పుడు ప‌వ‌న్ ఆచ‌ర‌ణ‌లో ఎక్క‌డా కనిపించ‌డం లేదు! చాలా తాపీగా క‌నిపిస్తూ ఉన్నారు.

అధికారం ద‌క్కిన వెంట‌నే సుగాలి ప్రీతి కేసులో చ‌ర్య‌లుంటాయ‌ని అప్ప‌ట్లో కొన్ని వంద‌ల సార్లు ప్ర‌క‌టించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌రి మంత్రిగా మారి రెండు నెల‌లు అయిపోయినా.. ఆ కేసులో సాధించిన ప్రగ‌తి ఏమిటో చెప్ప‌లేక‌పోతూ ఉన్నారు.

సుగాలి ప్రీతిపై జ‌రిగిన ఘాతుకం కూడా ఈ కూట‌మి ప్ర‌భుత్వంలోనే! 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తుతో చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళ్లి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత 2019 ఎన్నిక‌ల‌కు ముందే ఆ ఘాతుకం జ‌రిగింది. అయితే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో జ‌రిగిన ఘాతుకం అన్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరావేశాలు వేశారు, రంకెలు వేశారు! అధికారం కోసం కొన్ని వంద‌ల సార్లు ఆ అమ్మాయి పేరును వాడుకున్నారు. తీరా రెండు నెల‌లు గ‌డిచిపోయినా.. ఇప్ప‌టికీ అదిగో ఫ‌లానా అరెస్టు జ‌రిగింద‌నే ఊసు కూడా లేక‌పోవ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు తార్కాణంగా మిగులుతోంది!

అయితే గ‌ట్టున కూర్చుని మాట్లాడ‌టానికి, రంగంలోకి దిగ‌డానికి తేడా ఏమిటో ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా అర్థం అవుతూ ఉండ‌వ‌చ్చు! బాధ్య‌త‌లు లేకుండా ఏదో ఒక‌టి మాట్లాడితే, మాట్లాడుతూ ఉంటే అదే హీరోయిజం అన్నంత వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఫ్యాన్స్ చేత అయినా విజిల్స్ వేయించ‌గ‌లిగాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ పై ఉన్న‌ది బాధ్య‌త‌! ఏపీలో వ‌లంటీర్ల వ‌ల్ల కొన్ని వేల‌మంది అమ్మాయిల కిడ్నాప్ లు జ‌రిగాయ‌ని, అది కేంద్ర నిఘా వ‌ర్గాలు త‌న‌కుమాత్ర‌మే ఇచ్చిన స‌మాచారం అని కూడా అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర భ‌యాందోళ‌న‌లు రేపే ప్ర‌క‌ట‌న‌లు చేశారు!

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చింది పూర్తి అబద్ధ‌పు స్టేట్ మెంట్ అని, ఆయ‌న కేవ‌లం రాజ‌కీయం కోసం ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేశార‌ని, ఈ కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌మైన బీజేపీ కే చెందిన కేంద్ర‌మంత్రి పార్ల‌మెంట్ లో చేసిన ప్ర‌క‌ట‌న ద్వారా తేట‌తెల్లం అయ్యింది! అంటే అప్పుడు ప‌వ‌న్ చూపిన వీరావేశం, చేసిన ప్ర‌క‌ట‌న‌లు, ఇచ్చిన హామీలు, వేసిన రంకెలూ కేవ‌లం అధికారం అంద‌డం కోస‌మే త‌ప్ప ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల్లో అంత‌కు మించిన లోతులేమీ లేవ‌నే క్లారిటీ రెండు నెల‌ల్లో వ‌చ్చింది.

ఇక కూట‌మి హామీల సంగ‌తి స‌రేస‌రి! ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ఆ హామీల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా చాలా సార్లు చ‌దివి వినిపించారు! మ‌రి.. ఆ హామీల అమ‌లు ఏ మేర‌కు సాగుతోందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! అలా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ది ఫెయిల్యూర్ స్టోరీనే అవుతోంది.

ఇక ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాకా మారింది ఏమిట‌య్యా అంటే.. ప‌చ్చ‌చొక్కాలు వేసుకున్న వారి మురిపెం! ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒక భ‌యాంక‌ర‌మైన ప‌రిస్థితిని సృష్టించి ఈ ఎన్నిక‌ల విజ‌యంతో! రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ లోకేష్ గ‌త మూడేళ్లుగా చేసిన ప్ర‌చారం, త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే అది తెలుగు త‌మ్ముళ్ల కోస‌మే అన్న‌ట్టుగా ప‌రిస్థితిని క్రియేట్ చేశారు. దీని వ‌ల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. ప్ర‌తి ప‌చ్చ‌చొక్కా త‌నో సూప‌ర్ ప‌వ‌ర్ అనే స్థాయికి చేరాడు.

త‌ను ఏం చేసినా త‌న పార్టీ త‌న‌కు అండ‌గా ఉంటుంద‌నే ధీమా వారిలో పెరిగిపోయింది. ఇది చాలా చోట్ల విప‌రీత‌మైన ప‌రిస్థితుల‌కు దారి తీస్తూ ఉంది. బ‌య‌ట వాళ్ల‌కు ఇది తేలిక‌గా కనిపించ‌వ‌చ్చు కానీ, గ్రామాల్లోకి వెళ్లి చూస్తే.. ప‌చ్చ చొక్కాలు ఎలా ఫీల్ అవుతున్నాయో అర్థం అవుతుంది. తాము ఏం చేసినా అడిగే వాడు ఉండ‌ట‌ని, త‌మ‌కు అంటూ ఒక ప్ర‌త్యేక రాజ్యాంగం అని, తమ‌కు ఎదురుచెప్ప‌డం చేస్తే తాము ఏమైనా చేయ‌గ‌ల‌మ‌ని, తాము ఏం చేసినా త‌మ పార్టీ త‌మ‌కు అండ‌గా నిలుస్తుంద‌నే భావ‌న గ్రామాల్లోని ప‌చ్చ‌చొక్కాల్లో గ‌ట్టిగా క‌నిపిస్తూ ఉంది.

తాము తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రులం కాబ‌ట్టి, తాము తెలుగుదేశం పార్టీ విజ‌యం కోసం ప‌నిచేశాం కాబ‌ట్టి, తమ ద‌గ్గ‌ర లోకేష్ పాద‌యాత్ర ఫొటో ఉంది కాబ‌ట్టి, త‌మ ద‌గ్గ‌ర తెలుగుదేశం స‌భ్య‌త్వం కార్డు ఉంది కాబ‌ట్టి.. తాము అతీతుల‌మ‌నే భావ‌న అణువ‌ణువునా వారిలో క‌నిపిస్తూ ఉంది. దీని వ‌ల్ల విప‌రీత చ‌ర్య‌ల‌కు కూడా వారు వెనుకాడ‌టం లేదు! గ‌తంలో జ‌న్మ‌భూమి క‌మిటీలు అంటూ చంద్ర‌బాబు నాయుడు ఒక రాజ్యాంగేత‌ర వ్య‌వ‌స్థ‌కు ఊపిరిపోశారు. దీని వ‌ల్ల ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా క‌లుషితం అయ్యాయి.

జ‌న్మ‌భూమి క‌మిటీల రూపంలో తెలుగు త‌మ్ముళ్లు అన్నింటా వ‌సూళ్లు చేసుకున్నారు. ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం ల‌బ్ధిలోనూ త‌మ వాటాల‌ను పొందారు. అంటే ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి అండ‌గా ఉంటే.. అలా ఎడాపెడా సంపాదించుకోవ‌చ్చ‌నే సందేశం జ‌నాల్లోకి బాగా వెళ్లింది జ‌న్మ‌భూమి క‌మిటీల‌తో. అక్క‌డ అవ‌కాశం లేక‌పోతే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయ్యారు కొంద‌రు. అయితే జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు వారి ప‌ప్పులు ఉండ‌క‌లేదు. దీంతో త‌మ‌కు గిట్టుబాటు కాలేద‌నే త‌త్వం ఉన్న వాళ్లంతా ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకులు అయ్యారు.

తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉంటే.. తాము రాజ్యాంగేత‌ర శ‌క్తులు సంపాదించుకునే అవ‌కాశం ఉండాల‌న్న‌ట్టుగా ఏపీలో ఒక భావ‌న‌ను క్రియేట్ చేశారు చంద్ర‌బాబు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డంతో.. నాటి జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులే గాక‌, ఆ పార్టీ త‌ర‌ఫున తిరిగిన వారంతా ఇప్పుడు త‌మ‌కు తిరుగులేదు అనుకునే త‌త్వంతో క‌నిపిస్తూ ఉన్నారు. రేపోమాపో జ‌న్మ‌భూమి క‌మిటీలు-2 అంటూ చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ మొద‌ల‌పెడుతున్నార‌ట‌! ఈ క‌మిటీలు చేసిందే ఇక చ‌ట్టం, ఈ క‌మిటీలు చెప్పిందే వేదం అనే ప‌రిస్థితి మ‌రింత ముద‌ర‌బోతోంది.

రాజ‌కీయంగా ఒక‌రు న‌చ్చ‌వ‌చ్చు, రాజ‌కీయంగా ఒక పార్టీ త‌ర‌ఫున ప‌నిచేయ‌వ‌చ్చు, రాజ‌కీయంగా ఒక పార్టీని తీవ్రంగా వ్య‌తిరేకించ‌వ‌చ్చు.. అయితే దీనికంతా ప్ర‌తిఫ‌లం ద‌క్కే ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపిస్తూ ఉంది. అది కూడా ఒక రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా మారి, రాజ్యాంగేత‌ర వ్య‌వ‌స్థ‌గా మారి.. ప్ర‌భుత్వ ప‌నుల‌కూ, ప్రభుత్వ కార్య‌క్రమాల‌కు, ప్రజ‌ల సొమ్ముతో ప్ర‌జ‌ల‌కు ఇచ్చే సంక్షేమ ప‌థ‌కాల‌కు వీరు గేట్ కీప‌ర్లుగా మారుతూ ఉన్నారు.

త‌మ‌కు క‌ప్పం కట్టిన వారికి, త‌మకు లంచాలు ఇచ్చిన వారికి, తాము చెప్పిన వారికే ప‌థ‌కాలు అనే ప‌రిస్థితి మ‌ళ్లీ ఏర్ప‌డుతోంది. దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను ఏర్ప‌ర‌చ‌క‌పోవ‌డం జ‌గ‌న్ ప‌రాజ‌యానికి కార‌ణం అనే విశ్లేష‌ణ‌లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి ఇప్ప‌టికీ, ఇలాంటి వ్య‌వ‌స్థ‌లు చంద్ర‌బాబు విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌నే విశ్లేష‌ణా ఉంది.

కాబ‌ట్టి.. జ‌నాల‌కు ఏం చేసినా చేయ‌క‌పోయినా, ఇలాంటి రాజ్యాంగేత‌ర వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకుంటే.. ఎలాంటి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో అయినా పార్టీ ప‌టిష్టంగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు న‌మ్ముతున్నారు. అందుకు రుజువే జ‌న్మ‌భూమి క‌మిటీలు పార్ట్ టూ! అంటే ప్ర‌భుత్వ సొమ్ముతో పార్టీ స‌భ్యుల‌ను పోషించ‌డం అన‌మాట‌, ప్ర‌జ‌ల‌పైకి పార్టీ మ‌నుషుల‌ను వ‌ద‌లడం అన‌మాట‌! గ్రౌండ్ లెవ‌ల్లో వారు ఏం చెబితే అది జ‌రిగే ప‌రిస్థితిని ఏర్పాటు చేయ‌డం అన‌మాట‌! ఆల్రెడీ మంత్రులే ప్ర‌క‌టిస్తున్నారు.. ప‌చ్చ‌బిళ్ల‌ల ఆఫ‌ర్లు! ప‌చ్చ‌బిళ్ల‌తో వెళ్లిన ప‌చ్చ పార్టీ కార్య‌క‌ర్త‌లు చెప్పింది క‌లెక్ట‌ర్లు అయినా కాఫీ ఇచ్చి మ‌రీ చేయాల్సిందే అని ఓపెన్ గా ప్ర‌క‌టించారు. అలాంటి బాహాట‌మైన ప్ర‌క‌ట‌న‌లే వ‌స్తున్నాయంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరుతుందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు!

కార్య‌క‌ర్త‌ల‌కు ఏం చేయ‌లేదు కాబ‌ట్టి జ‌గ‌న్ చిత్త‌య్యాడు, చంద్ర‌బాబు ఇలాంటి జ‌న్మ‌భూమి క‌మిటీల‌తో వారికి సూప‌ర్ ప‌వ‌ర్ల‌ను ఇస్తున్నాడు కాబ‌ట్టి మ‌ళ్లీ మ‌ళ్లీ గెల‌వ‌గ‌లుతున్నాడు! ఇది ఏపీ రాజ‌కీయ సందేశంగా మారుతోంది. మ‌రి ఇలాంటి క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని, త‌మ కార్య‌కర్త‌ల‌కు ఉపాధి మార్గాల‌ను చూపి, వారు ఎడాపెడా దండుకోవ‌డానికి అవ‌కాశాల‌ను ఇచ్చి, ఇలాంటి రాజ్యాంగేత‌ర వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్యం కావొచ్చు! ఇలాంటి వ్య‌వ‌స్థ‌ల‌ను కాకుండా వ‌లంటీర్లు, స‌చివాలయం అంటూ అన‌డం జ‌గ‌న్ చేత‌గానిత‌న‌మూ కావొచ్చు! రాజ‌కీయ వ్యూహ లేమి కావొచ్చు. కానీ ఈ ప‌రిస్థితుల వ‌ల్ల ప్ర‌జ‌ల జీవితాలు ఎలా ప్ర‌భావితం అవుతాయ‌నేది కీల‌క‌మైన అంశం.

స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ అన్న జ‌గ‌న్ ను ప్ర‌జ‌లు తీవ్రంగా తిర‌స్క‌రించారు! జ‌న్మ‌భూమి క‌మిటీల‌తో దున్నేసిన చంద్ర‌బాబుకు ప‌ట్టం గ‌ట్టారు, కాబట్టి మ‌ళ్లీ జ‌న్మ‌భూమి క‌మిటీలు వ‌స్తున్నాయి దీని ప్ర‌తిఫ‌లాలు కూడా ప్ర‌జ‌లు అనుభ‌వించాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో ప‌చ్చ‌చొక్కాల అహంకారం ఇప్ప‌టికే ప‌తాక స్థాయికి చేరింది. తెలుగుదేశం పార్టీ అనిపించుకుంటే చాలు.. తాము హ‌త్య‌లు చేసినా పార్టీ అండ‌గా వ‌స్తుంద‌నే త‌త్వం ప‌చ్చ‌చొక్కాల్లో క‌నిపిస్తూ ఉంది.

ప‌దే ప‌దే కార్య‌క‌ర్త‌లు, కార్య‌క‌ర్త‌లు అంటూ చంద్ర‌బాబు, లోకేష్ లు ప్ర‌సంగాలు చేసి.. వారిని మ‌రింత వెర్రెక్కిస్తున్నారు కూడా! చైనాలో క‌మ్యూనిస్టు పార్టీ స‌భ్యుల గురించి చెబుతూ ఉంటారు. అలాంటి సభ్యులు చెప్పిందే గ్రౌండ్ లో జ‌రుగుతుంద‌ని అంటూ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్ లో గ‌తంలో క‌మ్యూనిస్టు పార్టీ కార్య‌క‌ర్త‌లు చెప్పిన రాజ్యం న‌డించింద‌ని అంటారు! అంత‌కుమించి ఇప్పుడు ప‌చ్చ‌చొక్కాల రాజ్యం న‌డుస్తోంది ఏపీలో. ఇది హింసాత్మ‌క ప‌రిస్థితుల‌కు కార‌ణం అవుతూ ఉంది కూడా! ప‌చ్చ‌పార్టీ సానుభూతి ప‌రులు ఏం చేసినా కేసుల్లేవ్, ఏమ్ లేవ్ అనే ప‌రిస్థితికి పోలీసు వ్య‌వ‌స్థ కూడా త‌మ స‌హకారం అందిస్తోంది. అలాంటి పోలీసుల‌కే పోస్టులు ఉంటాయి, లేక‌పోతే బ‌దిలీలే!

ఎమ్మెల్యేలు చెప్పింది పోలీసులు వినాలి, కార్య‌క‌ర్త‌లు ఏం చేసినా ఎమ్మెల్యే స‌మ‌ర్థించాలి! ఇది చాల‌దూ మొత్తం బ్యాలెన్స్ త‌ప్పి పోవ‌డానికి! అయితే ఇది ఇప్పుడే మొద‌లైంది. రేపు జ‌న్మ‌భూమి క‌మిటీలు- పార్ట్ టూ స‌భ్యుల ప్ర‌క‌ట‌న వ‌చ్చాకా, ప‌చ్చ చొక్కాల్లో ఎవ‌రి క్యాడ‌ర్ ఏమిటో తేలాకా.. ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మార‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు!

25 Replies to “జ‌న్మ‌భూమి క‌మిటీల పార్ట్ 2, అస‌లు క‌థ మొద‌లు!”

  1. జగ్గడు పాలనలో స్వేచ్ఛ అనేది కనిపించిందా?వాక్ స్వతంత్రము అనేది ఉండేదా?బానిసత్వం, భజన. మంత్రులు భాష, జగ్గడు నియంత పోకడలు చూసి జనాలు హడలెత్తి పోయారు.దాని ఫలితమే 11.

  2. జగ్గ పాలనలో స్వేచ్ఛ అనేది కనిపించిందా?వాక్ స్వతంత్రము అనేది ఉండేదా?బానిసత్వం, భజన. మంత్రులు భాష, జగ్గ నియంత పోకడలు చూసి జనాలు హడలెత్తి పోయారు.దాని ఫలితమే 11.

  3. జ..గ్గడు పాలనలో స్వేచ్ఛ అనేది కనిపించిందా?వాక్ స్వతంత్రము అనేది ఉండేదా?బాని..సత్వం, భజన. మంత్రులు భాష, జ..గ్గడు నియంత పోకడలు చూసి జనాలు హ..డలెత్తి పోయారు.దాని ఫలితమే 11.

    1. emi swechha ledu . pathakalu kaavalente sachivalyam , volunteers ni adigevallu . MLA / sarpannchula daggariki velli vallanu adukkunte adena swechha ..

      Jagan pathakala valla odipoledu . Jagan paripalana lo rajaraku pokadalu vunnaei . nenu prajalaku anni isthunnanu . emi chessina chelluthundi ani .

      Land surbey & LT act manchidi aeina prajalaku artham ayyetatlu cheyyadam lo jagan vipalamiyyadu

  4. దళిత డాక్టరు సుధాకర్ నీ వేటాడి చంపిన ప్యాలస్ పులకేశి గాడికి ఎర్రటి రాడ్ నీ దించడానికి అంబేద్కర్ అభిమానుల రెడీ గా వున్నారు. ఎప్పుడు ప్యాలస్ పులకేశి గాడు వస్తె అపుడే కసుక్కున దించడమే.

    జై భీం.

    1. అక్కని వేధిన వాళ్ళని ప్రశ్నించిన అమర్నాథ్ అనే అబ్బాయిని తగలబెట్టిన సై*కో ప్యాలస్ పులకేశి గాడికి సూలదండం వేయడానికి ఆ అక్క ఎదురు చూస్తూ వుంది.

      1. దళిత డ్రైవర్ నీ చంపి డోర్ డెలివరీ చేసిన వాడికి ప్యాలస్ లో తన మంచం లో చోటు ఇచ్చిన ప్యాలస్ పులకేశి గాడికి మా*డ సం*ఘం వాళ్ళు తమలో కలవమని డిమాండు చేస్తున్నారు.

  5. బాగా ఆయాస పడ్డావు మిత్రమా.. జనం కోరుకున్నది ఇదే.గత అయిదేళ్లాలో నా..నా అంటూ బాహాటంగా జరిగింది..అది నోరూ వాయి లేని అమాయకుల కోసం..మరి ఊళ్ళో హల్ చల్ చేసే వాళ్లకు “,మనం మన ఊరు” పేరుతో జనం సొమ్ము పంపిణీ ఇప్పుడు జరుగుతుంది..అంతే తేడా..ఈ హడావుడి,,హల్ చల్ చూసి ఎంత కాలమయ్యింది?..దీని కోసమే కదా కళ్ళు కాయలు కాచేలా “మనం “ఎదురు చూసింది.ఇక పండగే పండగ!ఏ విధంగా ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఈ తెలివి లేకుండా ఇంకా.. 30ఏళ్ళు అని ప్రగాల్బలు పలికితే ఏమైంది..అర్థం అయ్యిందా రాజా!

  6. వాస్తవం రాస్తే సమర్ధించవచ్చు..పాత పాటే వినిపిస్తుంటే చికాకు కలిగిస్తుంది.

  7. ఇద్దరు ముఖ్యులు. వాసుదేవ రావు. వెంకట రెడ్డి. ఒకరు గనుల శాఖ మత్యులు ఇంకొకరు. బెవేరేజే శాఖ .ఇద్దరు. ఎన్ని ఆకృతాట్లు చేశారో ఇద్దరు కనిపించడం లేదు

  8. In last 5 years what was wrong has become right now. Orders were issued to TTD EO silently for relasing of TTD funds to repair roads in Chandragiri. When TTD volunteered to repair roads in Tirupathi in last 5 years, Kootami and most importantly Pawan sir and BJP raised a huge objection about this and now why are they silent? How can funds from a Hindu temple be used for roads and what is tax money spent on?

  9. ఐదేళ్లలో అద్భుతాలు ఏమి లేవు కానీ .. రెండు నెలలో నీకు అద్భుతాలు కావాల్సి వొచ్చింది ..

  10. జన్మ భూమి కార్యక్రమం వేరు, జన్మ భూమి కమిటీ లు వేరు. బాబు మొదట విడత సీఎం గ వున్నప్పుడు ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ స్థాయి వాళ్ళు ప్రతి మండలానికి వెళ్లి, అక్కడ మ్మెల్యే లతో ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి, వాళ్ళ పెద్ద పెద్ద సమస్యలు అక్కడికక్కడే పరాశకరించేవారు. తరువాత ఈ సమస్యలు తీర్చడానికి కమిటీ లను ఏర్పాటు చేసినట్టు వున్నారు. దీన్నే వైస్సార్ కాపీ కొట్టి ప్రజలవద్దకు పాలనా అని పెట్టాడు. దాన్ని జగన్ స్పందన గ మార్పు చేసాడు, అది కూడా వాలంటీర్స్ ద్వారా జరిగేది. ఏది ఏమైనా దీనికి ఆద్యుడు చంద్ర బాబే. వాటిలో వున్నా లోపాలను తీసి, ప్రజలకు, అధికారులకు మధ్య పార్టీ కార్యకర్తల అజమాయిషీ తగ్గించి అమలు చెయ్యాలి. ఇది అవసరం కూడా. రోడ్లు, ఆసుపత్రి, రవాణా, స్కూల్స్, మంచినీరు, ఇరిగేషన్, శానిటేషన్ .. వీటి మీదే ఉంటాయి మోస్ట్ లీ, ఇప్పుడు ఇసుకు కూడా ఆడ్ అయ్యింది.

Comments are closed.