అమ‌రావ‌తికి రూ.15 వేల కోట్లు అప్పే…!

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అప్పు మాత్ర‌మే. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానాలు లేవ‌ని మ‌రోసారి నిర్ధార‌ణ అయింది. రూ.15 వేలు అప్పు ఇచ్చేందుకు ప్ర‌పంచ బ్యాంక్ ఎట్ట‌కేల‌కు ఓకే అని…

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అప్పు మాత్ర‌మే. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానాలు లేవ‌ని మ‌రోసారి నిర్ధార‌ణ అయింది. రూ.15 వేలు అప్పు ఇచ్చేందుకు ప్ర‌పంచ బ్యాంక్ ఎట్ట‌కేల‌కు ఓకే అని చెప్పింది. కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.15 వేలు వివిధ సంస్థ‌ల ద్వారా రుణం ఇప్పిస్తామ‌ని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న ఏపీలో తీవ్ర రాజ‌కీయ దుమారం రేపింది. అప్పు కాదు గ్రాంటు అని కూట‌మి పార్టీలు పేర్కొన్నాయి. అయితే అంత సీన్ లేద‌ని ప్ర‌తిప‌క్షాలు, వివిధ ప్రజా సంఘాలు చెప్పాయి. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తికి రూ.15 వేల కోట్ల రుణంపై ఎట్ట‌కేల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్ర‌పంచ బ్యాంక్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఆసియా డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌తో క‌లిసి ఈ భారీ మొత్తాన్ని అంద‌జేయ‌డానికి ప్ర‌పంచ బ్యాంక్ వెల్ల‌డించింది. అమ‌రావ‌తికి రుణం ఇవ్వాల‌ని అనుకుంటున్న ప్ర‌పంచ బ్యాంక్‌, అలాగే ఆసియా డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు ఈ నెల 27వ తేదీ వ‌ర‌కూ రాజ‌ధానిలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రుణాన్ని మంజూరు చేయ‌నున్నాయి.

చంద్ర‌బాబు స‌ర్కార్ మొద‌టి ప్రాధాన్యం అమ‌రావ‌తి నిర్మాణమే. సూప‌ర్ సిక్స్‌, ఇత‌ర‌త్రా ఎన్నిక‌ల హామీల్ని ప‌క్క‌న పెట్టైనా స‌రే, త‌క్ష‌ణం అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్నారు. బాబు ఎందుకంత ఆత్రంగా ఉన్నారో అంద‌రికీ తెలుసు.

27 Replies to “అమ‌రావ‌తికి రూ.15 వేల కోట్లు అప్పే…!”

        1. నీకు బుర్ర ఉందో లేదో నాకు అర్ధం కావటం లేదు. పైన నేను ఎటువంటి విమర్శ చేయలేదు, కేవలం అయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. నీకు జగన్ ఫోబియా బాగా ఉన్నట్టు ఉంది, ఒకసారి డాక్టర్ కి చూపించుకో.

  1. ఏపీకి ఏ మాత్రం మంచి జరిగినా వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా నాకేయడమే కాకుండా ఇబ్బడిమబ్బడిగా అప్పులు చేసి పోయింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబునాయుడు మెల్లగా వ్యవస్థలను దారిలో పెడుతూ వస్తున్నారు. వీలైనంత వరకూ ప్రభుత్వంపై భారం పడకుండా చాలా వరకూ విరాళాలతో కొన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది వైసీపీకి నొప్పిగా అనిపిస్తోంది. అన్న క్యాంటీన్ల భారం ప్రభుత్వంపై పడకుండా పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలతో వైసీపీకి నిద్రపట్టడం లేదు. విరాళాలు తీసుకుని పథకం అమలు చేస్తున్నారని కొత్తగా విమర్శలు చేస్తున్నారు. ఒక్క అన్న క్యాంటీన్లకే కాదు ప్రభుత్వం ప్రతి పనిలోనూ సహకరించే వారి నుంచి విరాళాలు తీసుకునేందుకు రెడీ అయింది. అందు కోసం జన్మభూమి 2 ను కూడా ప్రారంభించబోతున్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. ఇలా చంద్రబాబు అడగడమే ఆలస్యం చాలా మంది కోట్ల రూపాయల విరాళాలివ్వడం.. వైసీపీకి నచ్చడం లేదు. ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందో అని వారు కంగారు పడిపోతున్నారు. కొత్త కొత్త ఆరోపణలతో తెరపైకి వస్తున్నారు. కానీ గతంలోలా వైసీపీని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కూడా వైసీపీ కుట్రలను అర్తం చేసుకుంటున్నారు.

  2. న్యూఢిల్లీలో కూర్చున్న మహానుభావుడు, మన రాష్ట్రానికి ఎంగిలి మెతుకులు కూడా విధిల్చడు, ఇది అందరికీ తెలిసిన సత్యం.

  3. ఎదో నోటికొచ్చినట్లు రాస్తే ఎలా ఎలా బ్రో. వరల్డ్ బ్యాంకు రాష్ట్రానికి ఇచ్చే అప్పు అయితే వేటి మీద తనఖా పెట్టి ఇస్తుంది, తాడేపల్లి, రిషికొండ పాలస్ న? లేక అమరావతి లో కట్టిన హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్ నా, వెయిట్, అవి ఆల్రెడీ జగన్ తనఖా పెట్టేసాడు కదా. ఈ 15000 కోట్లకి కేంద్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు కాబోతుంది. దీనిలో కేంద్ర గ్రాంట్ ఎంతో ఇంకా తెలియదు, ౩౦ ఇయర్స్ వరకు మనకు కట్టే వెసులుబాటు వుంది. దీనివల్ల ఆంధ్ర జనాభా మీద వడ్డీ భారం ఉండబోదు. అలానే ఇది ఇంతకూ ముందు వరల్డ్ బ్యాంకు కమిట్ అయ్యిన ౩౦౦ మిలియన్ డాలర్ల లోన్ కి ఇది సంబంధం లేదు. నువ్వు ప్రజలని మభ్యపెట్టే రాతలు మానేసి, ఫాక్ట్స్ రాయడం నేర్చుకో ముందు.

Comments are closed.