లోకేశ్ ఇప్పుడేమంటావ్‌?

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క వ‌ర్గంలోని హోసూరు గ్రామ టీడీపీ నాయ‌కుడు వాకిటి శ్రీ‌నివాసులు హ‌త్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ రౌడీ మూక‌లు హ‌త్య‌కు పాల్ప‌డ్డాయ‌ని, అంతు తేలుస్తామ‌ని మంత్రి నారా…

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క వ‌ర్గంలోని హోసూరు గ్రామ టీడీపీ నాయ‌కుడు వాకిటి శ్రీ‌నివాసులు హ‌త్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ రౌడీ మూక‌లు హ‌త్య‌కు పాల్ప‌డ్డాయ‌ని, అంతు తేలుస్తామ‌ని మంత్రి నారా లోకేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. హోంమంత్రి అనిత కూడా త‌మ వాళ్ల‌నే వైసీపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్య చేస్తున్నారంటూ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ నేప‌థ్యంలో హోసూరు టీడీపీ నాయ‌కుడి హ‌త్య మిస్ట‌రీ వీడింది. సొంత పార్టీ నాయ‌కుడే అత‌ని హ‌త్య‌కు ప‌థ‌క ర‌చ‌న చేశార‌ని పోలీసుల విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయ్యింది. అదే గ్రామంలో టీడీపీ ఆధిప‌త్య పోరులో భాగంగానే హ‌త్య జ‌రిగిన‌ట్టు పోలీసులు గుర్తించారు. సీఆర్పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తూ వీఆర్ఎస్ తీసుకుని, హోసూరులో టీడీపీ నాయ‌కుడిగా ఎదుగుతున్న గుడిసె నర్సింహుల‌తో విభేదాలే హ‌త్య‌కు దారి తీసింది.

గ‌తంలో ఒక సంద‌ర్భంలో న‌ర్సింహుల‌ను వాకిటి శ్రీ‌నివాసులు చెప్పుతో కొట్ట‌డంతో అత‌ను అవ‌మానంగా భావించారు. మ‌రోవైపు వ్య‌వ‌సాయ స‌హ‌కార ప‌ర‌ప‌తి సంఘం చైర్మ‌న్ శ్రీ‌నివాసులుకు ద‌క్కుతుంద‌నే ప్ర‌చారాన్ని న‌ర్సింహులు జీర్ణించుకోలేక‌పోయాడు. ఇప్పుడు అంత‌మొందించ‌క‌పోతే త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల ఆగిపోతుంద‌ని భావించిన న‌ర్సింహులు కొంత మందితో క‌లిసి ఇటీవ‌ల హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో త‌మ‌పై నింద‌లు వేసిన లోకేశ్ ఏం స‌మాధానం చెబుతార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కూట‌మి పాల‌న‌లో తాము బాధితులమ‌ని, హ‌త్య చేసే ప‌రిస్థితి వుందా? అని వైసీపీ నాయ‌కులు నిల‌దీస్తున్నారు. అందుకే పూర్తిగా తెలుసుకున్న త‌ర్వాతే ఏదైనా మాట్లాడాల‌ని హిత‌వు చెబుతున్నారు.

23 Replies to “లోకేశ్ ఇప్పుడేమంటావ్‌?”

  1. కూటమి ప్రభుత్వం కాబట్టి, దమ్మున్న ప్రభుత్వం కాబట్టి

    నిజం బయట పెట్టారు, భయం లేకుండా.

    ఇలాగే చిన్నాన్న నీ వేసేసింది తానే అని ప్యాలస్ పులకేశి గాడు వొప్పుకుంటాడ ?

    కోడి కత్తి డ్రామా ప్లాన్ చేసింది తానే అని వప్పుకుంటాడ ?

    మీసాలయన వుంటే తనకి అవకాశం రాదు అని ప్లాన్ చేసి పైకి పంపింది తానే అని వప్పుకుంటాడ ?

  2. 36 mandhi ycp karyakarthalani champesaru ani delhi vellaru…. andhulo entha percentage nijam…. vinukonda ghatanaki kaaranam tdp naa… veetini ykaapa emi samadhanam chebuthundhi?

  3. Jagan still has people inside the government and they are changing the investigation reports. Kootami should act quickly and take action on those insiders.

  4. ఏపీకి ఏ మాత్రం మంచి జరిగినా వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా నాకేయడమే కాకుండా ఇబ్బడిమబ్బడిగా అప్పులు చేసి పోయింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబునాయుడు మెల్లగా వ్యవస్థలను దారిలో పెడుతూ వస్తున్నారు. వీలైనంత వరకూ ప్రభుత్వంపై భారం పడకుండా చాలా వరకూ విరాళాలతో కొన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది వైసీపీకి నొప్పిగా అనిపిస్తోంది. అన్న క్యాంటీన్ల భారం ప్రభుత్వంపై పడకుండా పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలతో వైసీపీకి నిద్రపట్టడం లేదు. విరాళాలు తీసుకుని పథకం అమలు చేస్తున్నారని కొత్తగా విమర్శలు చేస్తున్నారు. ఒక్క అన్న క్యాంటీన్లకే కాదు ప్రభుత్వం ప్రతి పనిలోనూ సహకరించే వారి నుంచి విరాళాలు తీసుకునేందుకు రెడీ అయింది. అందు కోసం జన్మభూమి 2 ను కూడా ప్రారంభించబోతున్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. ఇలా చంద్రబాబు అడగడమే ఆలస్యం చాలా మంది కోట్ల రూపాయల విరాళాలివ్వడం.. వైసీపీకి నచ్చడం లేదు. ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందో అని వారు కంగారు పడిపోతున్నారు. కొత్త కొత్త ఆరోపణలతో తెరపైకి వస్తున్నారు. కానీ గతంలోలా వైసీపీని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కూడా వైసీపీ కుట్రలను అర్తం చేసుకుంటున్నారు.

Comments are closed.