Advertisement

Advertisement


Home > Politics - Analysis

రాయలసీమ డిక్లరేషన్ ను కేంద్రానికి గుర్తు చేసిన జగన్ ...?

రాయలసీమ డిక్లరేషన్ ను కేంద్రానికి గుర్తు చేసిన జగన్ ...?

రాయలసీమ డిక్లరేషన్ ఏమిటి? దాన్ని ఏపీ సీఎం కేంద్రానికి గుర్తు చేయడమేమిటి? ఈ విషయం చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. కానీ జగన్ మర్చిపోలేదు. కారణం జగన్ తన మూడు రాజధానుల ప్లాన్ ను ఇంకా పక్కకు పెట్టకపోవడమే. 

ఇంతకూ రాయలసీమ డిక్లరేషన్ ఏటంటే ...2019 ఎన్నికల ప్రచారంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది బీజేపీ. రాయలసీమలో హైకోర్టు పెడతామన్నది అందులో ప్రధానమైంది. ఈ విషయాన్ని గుర్తు చేసి మరీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడానికి  జగన్ కేంద్రంతో  ఓకే చేయించుకున్నారే టాక్ వస్తోంది. 

హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే కేంద్ర న్యాయశాఖ నుంచే జరగాలి. ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియంతా ఈ సెషన్ లో జరుగుతుందని, ఈ మేరకు వైసీపీకి కేంద్రం నుంచి పూర్తి హామీ వచ్చిందని చెబుతున్నారు. పార్లమెంట్ లో ప్రాసెస్ పూర్తైన తర్వాత రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దానికి ఆమోదముద్ర వేస్తారని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే దీనికి ఒక కారణం ఉంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అయితే ఏపీకి సంబంధించిన పెండింగ్ సమస్యల సాధనకు రాష్ట్రపతి ఎన్నికలు మంచి అవకాశంగా ఉన్నా జగన్ సర్కార్ వినియోగించుకోలేదని..బీజేపీ అడగగానే మద్దతు ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్.. ఇంత మంచి అవకాశం వచ్చినా ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదనే టాక్ సామాన్య జనాల నుంచి వస్తోంది.

ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి.. తన సొంత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసనే వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం వెనుక మూడు రాజధానుల ప్లాన్ ఉందని తెలుస్తోంది. 

గత ఎన్నికల సమయంలో బీజేపీ రాయలసీమలో హై కోర్టు పెడతామని చెప్పింది కాబట్టి తానూ ఆ పనే చేస్తున్నాను కాబట్టి ఇందుకు ఒప్పుకోవాలని జగన్ కేంద్రానికి చెప్పినట్లు తెలుస్తోంది. కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తరలిపోతుందని వైసీపీ మంత్రులు, నాయకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఆ పని ఆగస్టులోనే జరుగుతుందట. 

ఏపీ హైకోర్టును కర్నూల్ కు తరలించాలని వైసీపీ షరతు పెట్టిందని.. అందుకు కేంద్రం పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించిందని అంటున్నారు. 

ఏపీ హైకోర్టు కర్నూల్ కు తరలింపు ఖాయమనే ప్రచారం సాగుతుండగానే  విశాఖ జిల్లాకు చెందిన ఏపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మరో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును  త్వరలోనే  శాసనసభలో పెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరన్నారు అమర్ నాథ్. 

తాజాగా జరుగుతున్న పరిణామాలతో మూడు రాజధానులపై జగన్ సర్కార్ మళ్లీ దూకుడు పెంచిందని తెలుస్తోంది. ముందుగా హైకోర్టుని కర్నూలుకు తరలించి.. తర్వాత మిగతా తతంగం పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం ఆగస్ట్ తరువాత ఏపీకి సంబంధించి సంచలన విషయాలు జరగబోతున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

వైసీపీ మద్దతుతో కొత్త రాష్ట్రపతి కాబోతున్న ద్రౌపది ముర్ము తొలి సంతకం కర్నూల్ కి హైకోర్టు తరలింపు మీద పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?