Advertisement

Advertisement


Home > Politics - Analysis

ముఖం చాటేసిన జనం... అయోమయంలో టీడీపీ కేడర్!

ముఖం చాటేసిన జనం... అయోమయంలో టీడీపీ కేడర్!

విశాఖ పశ్చిమ నియోజక వర్గం పొలిటికల్ సీన్.

పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్ది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పవనాలు పెరుగుతూ వస్తున్నాయి వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన గణబాబు ఈసారి ఎదు రీదుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి ఏమీ సాధించింది లేకపోగా ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో కాలయాపన చేయడం తో జనం ఈసారి ముఖం చాటేసే పరిస్థితి ఎదురవుతుంది.

గత ఎన్నికలలో జగన్ హవా నడిచినప్పటికీ విశాఖపట్నం నియోజకవర్గ నుంచి గణబాబు 30000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రభుత్వం తమది కాదని చెప్పుకుంటూ ప్రజల మధ్య తిరగకుండా ఇంటికి పరిమితమయ్యారు.

కేవలం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప మిగిలిన ఏ కార్యక్రమాలకు హాజరవ్వకుండా రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేశారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర కాలంలో ప్రజలకు చేదోడువాదోడుగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇంటికి తాళాలు వేసుకుని లోపలే గడిపిన వైనం ప్రజలు ఇప్పటికీ మరిచిపోవడం లేదు. కనీసం ఆత్మఫర్యాన్ని కలిగించడం చేతనైనంత సహాయం చేయడం లాంటివి చేయకుండా తలుపులకు గుళ్లో వేసుకొని ఇంటిపొట్టునే ఉండిపోవడం పట్ల సామాన్య పేద తరగతి వర్గాలన్నీ కూడా తీవ్రంగా అక్షేపిస్తున్నాయి.

సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతాం అని ఎదురుచూసిన ప్రజానీకం ఇప్పుడు ఎన్నికల రావడంతో గణబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు ఇంతవరకు రెండేళ్లుగా పంచ గ్రామాల సమస్యను ఎటు పరిష్కారం కానివ్వకుండా తెలుగుదేశం పార్టీ వర్గాలే కావాలనే దాన్ని అడ్డుకుంటూ కాలయాపన చేస్తున్నాయి అన్నది ప్రజలు కూడా గ్రహించిన పరిస్థితి అలాగే రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఏం సాధించారు అని చెప్పుకుంటే ఏమీ లేదనే సమాధానమే ఆ నియోజకవర్గంలో చాలా చోట్ల నుంచి వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పవనాలు ఉంటాయని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించింది.

విశాఖ డైరీ చైర్మన్ గా లక్షలాది మంది రైతాంగానికి మేలు చేసిన స్వర్గీయ ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్ కుమార్ కు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టితో ఆనంద్ కు మూడేళ్ల‌ క్రితం నియోజకవర్గం బాధితులను అప్పగించారు. అప్పటినుంచి సుడిగాలిలా నియోజవర్గం అంతా కూడా కలియతిరిగిన ఆనంద్ ప్రజల మనసులను గెలుచుకున్నారు సొంత నిధులు కొంత ప్రభుత్వం నిధులు మరికొంత ఇలా ఖర్చు పెడుతూ చాలా సమస్యల పరిష్కారానికి అతి తక్కువ సమయంలోనే దారి చూపించారు ఆనంద్ కుమార్.

పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని మంచితనాన్ని బెలూజి వేసుకుంటున్న ప్రజానీకం ఓటర్లు అటు టిడిపి అభ్యర్థి గణబాబు బెటరా లేదంటే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మంచివాడ అన్న దానిపై ఒక అంచనాకైతే వచ్చినట్లు కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో వైసిపి గణనీయంగా హవా సాధించడానికి చాలా కారణాలే కారణమని భావిస్తున్నారు మెజారిటీ వార్డుల్లో వైసిపి గెలుచుకోవడం అతి తక్కువ వార్డులకే తెలుగుదేశం పార్టీ పరిమితం కావడం లాంటి సంకేతాలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతానడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది పరిస్థితులు రోజురోజుకు మరింతగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు పడిపోతున్నాయి కేవలం ఎన్నికల కమిషన్ అధికారులకు రకరకాల ఫిర్యాదులు చేస్తూ కాలయాపన చేసుకునే పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం కేడర్ కు అభ్యర్థి గణబాబు కూడా ప్రెస్టేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది ఇంతవరకు తన వెనక ఉండి పార్టీలో ఉన్న చాలామంది గణబాబును విడి తాజాగా ఆడారి ఆనంద్ కుమార్ తో పయనించాలని చూడటంతో గణబాబు ప్రెస్టేషన్ పీక్స్ కి వెళ్ళింది.

రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబు నియోజవర్గానికి అభివృద్ధి ఏమీ చేయలేదని భావించిన మెజారిటీ ప్రజానీకం ఇక కొత్త వ్యక్తికి అవకాశం కల్పిద్దామన్న ఆలోచన కూడా గణబాబుకు పెద్ద మైనస్ గా తయారయింది గణబాబు సొంత సామాజి వర్గమే అయిన ఆడారి ఆనంద్ కుమార్ కూడా చాలా చురుకుగా ప్రజల్లో ఉంటూ ప్రజలు చెప్పిన సమస్యల పైన వెనివెంటనే పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తుండటం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఆనంద్ కుమార్ పట్ల ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపు కాసిన మెజారిటీ వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఆ పార్టీకి దూరమై వైసీపీకి దగ్గరైన పరిస్థితి కనిపిస్తోంది సామాన్య ప్రజానీకం పేద ప్రజనికం ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలు గాని లేదంటే గోపాలపట్నం ఎన్ఏడి కొత్త రోడ్డు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజానీకం గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణబాబుకు పూర్తి సహాయ సహకారాలు అందించాయి కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది ఆ వర్గాలన్నీ కూడా జెండా మార్చేసి వైసీపీ జెండాను తమ ఇళ్లపైన ధైర్యంగా కట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.

రోజురోజుకు పడిపోతున్న గ్రాఫ్ తో తెలుగుదేశం పార్టీ వర్గాలు మరింత డీలపడుతున్నాయి చాలామంది ఇళ్లకే పరిమితం కాగా .. సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత టిడిపి అభ్యర్థి గణబాబు అయోమయంలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. పెద్ద ప్రచార ఆర్భాటం ఏమీ లేకుండా కేవలం తనకున్న పరిచయాలను వినియోగించుకుంటూ చాలామందిని మరోసారి అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిన్న మొన్నటివరకు టిడిపికి కంచుకోట లాంటి విశాఖపట్నం నియోజవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం అన్న ధ్యామాలో వైసిపి వర్గాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ తమకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అన్నది అంచనా వేసుకొని వైసిపి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?