రాజ‌ధాని రైతుల గోడు వ‌ర్ణ‌నాతీతం

త‌మ స‌మ‌స్య‌ల్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌క‌పోవ‌డంపై వారంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు, ఇత‌ర ప్ర‌జానీకం గోడు వ‌ర్ణ‌నాతీతం. త‌మ‌దే అనుకునే ప్ర‌భుత్వ‌మే స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంపై వాళ్లంతా తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కూట‌మిని అధికారంలోకి తెచ్చుకుంటే, క‌ష్టాల‌న్నీ తీరుతాయ‌ని 29 గ్రామాల రాజ‌ధాని ప్ర‌జానీకం భావించింది. కోరుకున్న‌ట్టుగానే కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. కానీ రాజ‌ధాని రైతుల క‌ష్టాలు మాత్రం ఎక్క‌డ‌వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది.

ఇవాళ 29 గ్రామాల రైతులు సీఆర్‌డీఏ కార్యాల‌యానికి వెళ్లారు. త‌మ స‌మ‌స్య‌ల్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌క‌పోవ‌డంపై వారంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌ధానంగా నివాస స్థ‌లాల‌ను వ్య‌వ‌సాయ భూములుగా చూపిస్తున్నార‌ని అధికారుల‌పై మండిప‌డ్డారు. త‌ద్వారా గ్రామ కంఠాల పరిధిలోని త‌మ ఇళ్ల‌కు ప్ర‌మాదం పొంచి వుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అధికారుల‌కు చెప్పినా త‌మ స‌మ‌స్య‌ల‌ను పెడ‌చెవిన పెడుతున్నార‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌ట్ ఆఫ్ డేట్ ప్ర‌క‌టించామంటూ అధికారులు నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతున్నా, త‌మ స‌మ‌స్య‌ల‌పై క‌నీస శ్ర‌ద్ధ కూడా చూప‌డం లేదంటున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌పై చంద్ర‌బాబు శ్ర‌ద్ధాస‌క్తులు చూపుతున్నార‌ని, అందులో కొంతైనా చూప‌క‌పోవ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదే సంద‌ర్భంలో తాము ఏ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకం కాద‌ని వారు అన‌డం గ‌మ‌నార్హం. సీఆర్‌డీఏ కార్యాల‌యానికి వ‌చ్చినా క‌మిష‌న‌ర్ క‌ల‌వ‌డం లేద‌ని వాపోయారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు.

8 Replies to “రాజ‌ధాని రైతుల గోడు వ‌ర్ణ‌నాతీతం”

  1. అమరావతి లో రైతులు ఇప్పుడు కనిపించారు .. మరి ౧౯-౨౪ వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు .. నీకు కనపడలేదు

  2. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళు రైతులు అయ్యారా?

    ఐ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనడం మంచి పరిణామం

  3. మోసపోవడానికి కూడా ఒక వరుస క్రమం ఉంది. మీ తరుణం త్వరలోనే వస్తుంది. ఇప్పుడు వచ్చింది కేవలం “ట్రైలర్” మాత్రమే!

Comments are closed.