విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు రాజ్ భవన్ లో ప్రవేశించే యోగం సమీపంలో ఉందని అంటున్నారు. రాజుగా మహారాజుగా మంత్రిగా కేంద్ర మంత్రిగా విభిన్నమైన బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఇపుడు రాజ్యపాల్ గా రాజ్యాంగ పరిరక్షకుడుగా కొత్త బాధ్యతలు కోరి మరీ వరించడానికి వస్తున్నాయని అంటున్నారు.
ఆయన రాజకీయాల్లో చూడని ఎత్తులు లేవు, అధిరోహించని శిఖరాలు లేవు. అన్ని కీలక శాఖలనూ మంత్రిగా చూశారు. అర్ధ శతాబ్దం పాటు క్రియా శీల రాజకీయాలను చూశారు. ఆయన ఇపుడు హుందా అయిన రాజకీయ ముగింపుని కోరుకుంటున్నారు.
గవర్నర్ గా అయితేనే తనకు తగిన స్థానం అని భావిస్తున్నారు. ఆయనకు టీడీపీ అధినాయకత్వం ఆశీస్సులు నిండుగా ఉండడంతో తొందరలోనే గవర్నర్ గా ఆయన నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు అని అంటున్నారు.
మే నెల మొదటి వారంలో కొత్త గవర్నర్లని వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని అంటున్నారు. అందులో ఏపీ నుంచి మిత్రపక్షం టీడీపీ కోటాలో అశోక్ కి గవర్నర్ పదవి దాదాపుగా ఖాయం అయింది అని అంటున్నారు.
అశోక్ గజపతిరాజుని కీలక రాష్ట్రంగా ఉన్న తమిళనాడుకు నియమిస్తారు అని ప్రచారం సాగుతోంది. అక్కడ డీఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రాజ్యాంగంతో పాటు రాజకీయాలూ పూర్తిగా తెలిసిన అశోక్ గజపతిరాజు సేవలను ఆ విధంగా ఉపయోగించుకోవాలని కేంద్రంలోని ఎండీయే ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సింహాచల వరహా లక్ష్మీ నరసిం హస్వామి వారి చందనోత్సవం వేళకు ధర్మకర్తగా వ్యవహరించనున్న అశోక్ ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన వారం తరువాత రాజ్యపాల్ గా రాజ్ భవన్ లోకి ప్రవేశిస్తారని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
He deserves
Hope he will make a difference among other bjp governors
So nice
All the best Raju garu.. Govener ga manchi peru thechukovali ani oorukuntunna.