పాడుతా..తీయగా.. నరకంగా..!

అడుగడుగునా వివక్ష, పక్షపాతం, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపిన ప్రవస్తి

తెలుగు టీవీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమానికి ఉన్న గుర్తింపు వేరు. మరీ ముఖ్యంగా లెజెండ్ బాలసుబ్రమణ్యం దానికో పవిత్రత తీసుకొచ్చారు. అలాంటి కార్యక్రమంలో కూడా చీప్ ట్రిక్స్, మోసాలు, బాడీ షేమింగ్ లాంటివి జరుగుతున్నాయి. ఈ విషయాల్ని స్వయంగా ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్ బయటపెట్టారు.

ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’లో జడ్జీల పక్షపాత ధోరణిని ఆమె పేరుపేరునా ఎండగట్టారు. ఒక్కొక్కరి పేరు ప్రస్తావించి మరీ వాళ్లు చూపించిన పక్షపాతాన్ని బయటపెట్టారు.

గాయని సునీతకు ఎందుకో తనంటే మొదట్నుంచి పడదని, తనలో లోపాలు ఎత్తిచూపడానికి చాలా ప్రయత్నించారని అన్నారు ప్రసక్తి. ఎలిమినేషన్ రౌండ్ లో తను ఓడిపోతే, ప్రశ్నించిన తన తల్లిపై సునీత కసురుకున్నారని ఆరోపించారు ప్రవస్తి. చంద్రబోస్ అయితే తను పాడిన పాటలో సాహిత్యంలో తప్పులు వెతకడానికి చాలా ప్రయత్నించారని ఆరోపించారు.

ఇక కీరవాణి విషయానికొస్తే.. ఇంకాస్త ఘాటుగానే స్పందించారు ప్రవస్తి. తను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు లాంటి ఫంక్షన్లలో పాటలు పాడితే, దాన్ని ఆయన చాలా నీచంగా చూశారని, తనను చీడపురుగు కంటే హీనెగా చూశారని ఆరోపించింది ప్రవస్తి.

ఇవన్నీ ఒకెత్తయితే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్లందరికీ డ్రెస్ కోడ్ ఉందన్న విషయం తెలిసిందే. అలా ప్రవస్తికి కూడా చీర ఇచ్చిన నిర్వహకులు.. దాన్ని బొడ్డు కిందకు కట్టుకోవాలని సూచించారట. దీంతో తను షాక్ కు గురయ్యాయనని తెలిపింది ప్రవస్తి.

ఇలా అడుగడుగునా వివక్ష, పక్షపాతం, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపిన ప్రవస్తి.. ఇన్ని విషయాలు బయటపెట్టిన తర్వాత తనకు ఎవ్వరూ పాటలు పాడే అవకాశం ఇవ్వరని, అందుకే తను ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించారు.

33 Replies to “పాడుతా..తీయగా.. నరకంగా..!”

  1. Once again proved that people who talk about ethical values are no good and resemble Jujube fruit that has rotted at the core. They are only good to preach ethics to others and will use their name, fame and skills to cheat and ruin poor people and benefit their families and rich friends. Such people need to be banned from society and their work must be disregarded.

  2. Nalla.pandiki samskaram ledani chala saarlu prove chesukunnadu.. oka event lo direct ga chuddam. 5 gantalu prkeshakulu wait chesaru veedi kosam. Kanisam samskaram kuda ledhu. Sorry kuda cheppaledhu. SPB AA stage meeda every half hour ki vachhi sorry ani padhe padhe vinamratha tho cheppanu. Nalla pandiki AA samskaram ledhu 

  3. ఇలా ఓడిపోయిన వాళ్ళు , రాళ్ళు వేస్తే చాలు. 

    టాలెంట్ ఉంటే సొంతగా యూట్యూబ్ లో సాంగ్స్ పాడి పాపులర్ అయితే, వేరే భాషల్లో పాడే అవకాశం వస్తది. 

    అప్పు పాదఏ హ హ హ..  అనే ఇంటర్నెట్ సెన్సేషన్ పాట పాడింది, అప్పటి దాకా క్లబ్ లో, రోడ్డు మీద షో లు ఇచ్చే ఆవిడ నే కదా, ఇప్పుడు ఆమె పాడిన పాట వలన పెపచం లో నే పెద్ద పేరు వచ్చింది..

    సత్తా వింటే ఎప్పటికో అయినా షైన్ అవుతారు.

    లేకపోతే ఫోన్ క్వాలిటీ బాగా లేదు, అందుకే పాట సరిగా రాలేదు అని కుంటి సాకులు చెప్పవచ్.

      1. అలా పాడే వాళ్ళు వందల్లో ఉన్నారు. పోటీ అన్నాక, వున్న వాళ్లలో కాస్త బెటర్ గా ఉన్న వాళ్ళని గెలిచారు అంటారు. అలా అని మిగతా  వాళ్ళు ఓడిపోయారు అని కాదు కదా.  

        పోటీ లో గెలవని వాళ్ళు  ఇలా ఆరోపణలు చేస్తూ పోతే, పోటీ కి అర్థం ఏమిటి?

         

      2. అలా అని , ఆమె ఆ భాషల్లో పాడే అందరి కంటే గొప్పగా పాడారు అని అర్థం కాదు కదా. 

        ఆమె చిత్ర గారి కంటే గొప్పగా పాడారు నా ? 

  4. ఈమె గొంతుక పెద్దగా ఏమి బాగాలేదు. కానీ ఆ ముగ్గురు జడ్జి లు పెద్ద ముదురు లు. ఆ కర్రి చంద్రబోస్ కి ఏం వచ్చు.

    1. ఆ మాట అతన్ని జడ్జి గా పెట్టిన వాళ్ళని అడగాలి. అతన్ని కాదు.

      అతనికి సాహిత్య పరంగా చాలా అవార్డు లో వున్నాయి.

  5. I am a great singer, but they are not giving opportunities to me.

    I lost in the qualification round, they said my voice is not great, it is harassment.

    If they give a chance in movie, I can prove that I am a great singer!!!

    Oh also, I am a great actor too,

    but they are saying I cant act,

    I feel offended, harassed and degraded, they have done some terrible remarks and comments on me.

    if i dont get one more chance, I will quit movie industry !!!!

  6. సత్తా ఉంటే, ఈ కాంపిటీషన్స్ కాకపోతే వేరే దాంట్లో గెలుచు కొనే అవకాశం ఉంది. 

    ఈ రోజుల్లో ప్రతి చానెల్ వాళ్ళు ఇలాంటి పోటీ లు పెడుతున్నారు.

    వాటిలో పాల్గొని, గెలుచు కొని , అప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే , ఆ ఆరోపణ కి విలువ వుంటది.

    అలా కాకుండా , పోటీ లో గెలవని వాళ్ళు అందరూ ఇలా రాళ్ళు వేస్తూ పోతే, ఇంకా పోటీ కి అర్థం ఏమి వుంటది.

    బొడ్డు కిందకి చీర కట్టమని చంద్రబోస్,  కీరవాణి , సునీత చెప్పలేదు కదా, 

    ఆ కాస్ట్యూమ్ ఇచిన అతని అభిప్రాయం అయి వుండొచ్చు. అతని మీద ఆ ఆరోపణ చేయాలి.

  7. సత్తా ఉంటే, సొంతగా పాటలు పాడి, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో లోడ్ చేస్తే , జనాలకి నచ్చితే ,

    ఈ పోటీ కంటే ఎక్కవ పేరు, డబ్బు వస్తది.

    గతం లో లాగ, 

    ఈ రోజుల్లో సొంత ప్రతిభ ఉన్న వాళ్ళని తొక్కేసారు అని చెప్పే అవకాశం లేదు.

     

    ఒక వేళ ఒక అవకాశం తప్పిన కూడా, 

    ప్రతిభే నీ ప్రపంచం కి చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

  8. ఎన్నికలో గెలిచిన అప్పుడు ఏమో సొంత విలువ వలన గెలిచి నట్లు

    ఓడిపోతే , ఈవీఎంలు వలన ఓడిపోయినట్లు 

    ఆరోపణ లాగ వింది.

    ఆ అమ్మాయి గొంతు, ఆ పోటీ లో పాల్గొన్న మిగతా వాళ్ళ గొంతు కంటే గొప్పగా ఏమి లేదు. 

  9. నేషనల్ పాటల పోటీ లు చాలా ఉన్నాయి.

    వాటిలో మన తెలుగు సింగెర్స్ చాలా మంది వెళ్ళి మంచి పోటీ ఇచ్చారు. అలా వెళ్ళి అక్కడ గెలిచి ,

    అప్పుడు ఈ జడ్జి ల మీద ఆరోపణ చేస్తే, అప్పుడు ఆ ఆరోపణ కి విలువ వుంటది.

  10. ఈ కీరవాణి సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర తాగేసిన టీ కప్పులు తీసేపని, ఆయనకి భోజనం అరేంజ్మెంట్ చేయడం, బయటికి వెళ్తుంటే కారు బయట పెట్టడం ఇలాంటి పనులు చేసేవాడు. సడెన్ గా చక్రవర్తి చనిపోతే ఆయన కట్టుకున్న ట్యూన్స్ కొట్టేసి రామోజీరావు చలవతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి కీచుగొంతుకతో పాటలు పాడి జనాల్ని చంపుతుంటాడు.

Comments are closed.