హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అనేక రకాల చర్చకు దారి తీస్తోంది. తన సినిమా ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లడం, తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో తాజాగా బన్నీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ మాదిరిగా, గతంలో జగన్ ప్రభుత్వం ఆలోచించి వుంటే చంద్రబాబునాయుడిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసి వుండాలో అనే చర్చకు తెరలేచింది.
2015, జూలై 14న రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు ప్రచార యావతోనే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. పుష్కరిణిలో ఆ సమయంలో చంద్రబాబు ఉండడం, ఆయన్ను చిత్రీకరిస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నాడు చంద్రబాబే సీఎంగా వుండడంతో చట్టపరమైన చర్యలేవీ తీసుకోలేదని సమాచారం.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, ఎన్నికలను పురస్కరించుకుని ఇదేం ఖర్మరా బాబు మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఇక 2022 చివరాఖరు, అలాగే 2023 జనవరిలో నెల్లూరు జిల్లా కందుకూరులో, అలాగే గుంటూరు జిల్లా ఉయ్యూరులో చారిటబుల్ ట్రస్ట్ సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరు తొక్కిసలాటలో 8 మంది, ఉయ్యూరులో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు టీడీపీ నష్టపరిహారం చెల్లించింది. ఇంత వరకూ అభినందించాల్సిందే.
అయితే చంద్రబాబును అరెస్ట్ చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచించలేదు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ మాదిరిగా జగన్ ఆలోచించి వుంటే, చంద్రబాబును అరెస్ట్ చేయాల్సి వుండేది. కానీ ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇది తప్పా? ఒప్పా? అనే చర్చ వేరే విషయం. కానీ బన్నీ అరెస్ట్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల్లోనూ, ఆ తర్వాత బాబు సభల్లో తొక్కిసలాటలో మృతుల గురించి మాట్లాడుకుంటున్నారు.
రామాయణం లో పిడకల వేట
ఒరేయ్ గూట్లే…ఇక్కడ సమాచారం ఇవ్వకుండా వెళ్లి తొక్కిసలాతు కారణం అని అరెస్ట్.అక్కడ సమాచారం ఇచ్చినా సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఉన్నది అధికారులే. ప్రధాని సభలో నే భద్రతా వైఫల్యం కింద నలుగురు అధికారుల మీద చర్యలు గుర్తులేవా
అదే అనుకుంటున్నా ఇంకా బాబుని లాగలేదేంటా అని.
Expected article. No comments.
అవునా అయితే మన తుగ్లక్ అన్న లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి
Test
అవినీతి కేసుల్లో చాలామంది అరెస్ట్ అయినప్పుడు అన్నయ్య పన్నెండేళ్ళు బెయిల్ పైన వున్నాడే అని అడగలేదు. నువ్వు నిజంగానే ఈ మాట అడుగుతున్నావా రాధికా ?
ఎందులో అయినా సరే ఆయన ను లాగాల్సిందే
చంద్రబాబుకు..దేవుడే..పెద్ద..శిక్షవేశాడు, అసహజ..అనారోగ్యపు..లైఫ్..స్టైల్ , అసమర్ధపు..పుత్రుడు..ఇంతకు..మించి..శిక్ష..ఏది..ఉండదు.
Nuvvu enta egaresi danchinaa ade 5rs Paytm kooli kadaa ayyaa