ప‌వ‌న్ వ‌ర‌కూ వ‌స్తే… ఆ రెండూ ఉండ‌వు!

మంత్రి ప‌ద‌వి ఇచ్చేట‌ప్పుడు ఎవ‌రు, ఏమిటి చూసుకోకుండానే ప‌వ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటారంటే జ‌నం అమాయ‌కంగా న‌మ్మాలి మ‌రి!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు అర్థాలే వేరు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మొద‌ట్లో వార‌స‌త్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాలే ద‌శాబ్దాలుగా పాలిస్తున్నాయంటూ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, నారా చంద్ర‌బాబునాయుడు కుటుంబాల‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ఎన్టీఆర్ వార‌సుడిగా చంద్ర‌బాబు, ఆ త‌ర్వాత త‌రం నాయకుడిగా లోకేశ్‌ను, అలాగే వైఎస్సార్‌, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం అంద‌రికీ తెలుసు. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వార‌స‌త్వ రాజ‌కీయాల్ని ఏకిపారేస్తూ, అందుకే తాను మోదీకి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ అన్నారు. అలాగే రెడ్లు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల నాయ‌కులే పాలించాలా? అని కూడా ఆయ‌న అడిగిన సంద‌ర్భాలు అనేకం.

మ‌రి సినిమా రంగంలో మీ వార‌స‌త్వం మాటేంటి? అని ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్న ప‌వ‌న్‌ను టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నేత‌లు నిల‌దీశారు. ఆ ఒక్క‌టి అడ‌క్కు అన్న‌ట్టుగా, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు వుంటూ వ‌స్తోంది. ఇప్పుడాయ‌న చంద్ర‌బాబు కేబినెట్‌లో ఉప ముఖ్య‌మంత్రి. ఇంత‌కాలం ఆయ‌న నీతి వాక్యాల‌కు, ఆచ‌ర‌ణ‌ను పోల్చి చూసుకుంటున్నారు జ‌నం.

త‌న అన్న, జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్న‌ట్టు… రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ప‌వ‌న్‌పై ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లోనే కాదు, రాజ‌కీయాల్లో మీ వార‌స‌త్వం మాటేంటి? అలాగే జ‌న‌సేన త‌ర‌పున న‌లుగురికి ప‌ద‌వులైతే, వాళ్ల‌లో సొంత సామాజిక వ‌ర్గానికే మూడు ప‌ద‌వులా? ఇదేం సామాజిక న్యాయం? అని ప‌వ‌న్‌ను ప్ర‌శ్న‌ల‌తో రాజ‌కీయంగా చిత‌క్కొడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో మీడియా ప్ర‌తినిధుల‌తో సోమ‌వారం ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో కీల‌క కామెంట్స్ చేశారు. త‌న‌కు అన్న అనే కార‌ణంతో నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం లేద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. త‌న‌తో స‌మానంగా పార్టీ అభివృద్ధి కోసం నాగ‌బాబు ప‌ని చేసిన‌ట్టు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. త‌న సోద‌రుడు, అలాగే కాపు సామాజిక వ‌ర్గం కాక‌పోయినా, నాగ‌బాబు స్థానంలో ఎవ‌రున్నా మంత్రిగా అవ‌కాశం ఇచ్చేవాడిని అని ఆయ‌న అన్నారు. దీన్ని వార‌స‌త్వంగా చూడ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. మార్చిలో ఎమ్మెల్సీగా నాగ‌బాబు ఎన్నిక‌వుతార‌ని, ఆ త‌ర్వాతే కేబినెట్‌లోకి వ‌స్తార‌ని ఆయ‌న వివ‌రించారు.

కందుల దుర్గేష్‌ది ఏ కుల‌మో తెలియ‌ద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన‌డం గ‌మ‌నార్హం. ఈ మాట మాత్రం జంధ్యాల కామెడీ డైలాగ్‌కు మించిపోయింద‌నే నెటిజ‌న్ల సెటైర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మంత్రి ప‌ద‌వి ఇచ్చేట‌ప్పుడు ఎవ‌రు, ఏమిటి చూసుకోకుండానే ప‌వ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటారంటే జ‌నం అమాయ‌కంగా న‌మ్మాలి మ‌రి!

23 Replies to “ప‌వ‌న్ వ‌ర‌కూ వ‌స్తే… ఆ రెండూ ఉండ‌వు!”

  1. పాలిటిక్స్ లో nepotism నచ్చని, ప్రోత్సహించని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా సింగల్ సింహమే తెలుసా?? కావాలంటే తను కుర్చీ ఎక్కడానికి కారణమైన షర్మి చెల్లినే తొక్కేసాడు.. అవునా కాదా??

  2. కులం అంటే అర్ధం తెలియని బ్లడ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిది.

    కందుల దుర్గేష్ , కొణిదల నాగబాబు లకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా మరోసారి నిరూపితం అయ్యింది.

  3. ప వ న్ కళ్యా ణ్ ఏ మి. జ ల గ న్న లా రా జ కీ యా లా. కో సం. బా బా యి. పై కి

    పా పిం చ లే దు. &. అ స్తి. కో సం. త ల్లి పై. &. చె ల్లె లు పై. అ క్ర మ కే సు లు

    పె ట్ట. లే దు. రా

    1. Sri PK is working exceptionally hard and is deeply committed to achieving the goals at hand. His dedication and seriousness towards his responsibilities are evident in his consistent efforts and determination to succeed.

Comments are closed.