ప్రభాస్ ను నన్ను ఈ సృష్టి కలిపింది

ఎట్టకేలకు మారుతి నుంచి కాల్ రావడంతో, రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నటించానని, అలా గట్టిగా కోరుకోవడంతో ప్రభాస్ ను, తనను ఈ యూనివర్స్ కలిపిందని అంటోంది మాళవిక.

సందర్భం దొరికిన ప్రతిసారి ప్రభాస్ ను పొగడ్తల్లో ముంచెత్తడానికి ఏమాత్రం మొహమాటపడట్లేదు హీరోయిన్ మాళవిక మోహనన్. పాన్ ఇండియా హీరోతో కలిసి ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ, ఆ సినిమాను, ప్రభాస్ క్రేజ్ ను తన పాపులారిటీ కోసం వాడుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే ప్రభాస్ ను పలుమార్లు ఆకాశానికెత్తేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరింత భారీ స్టేట్ మెంట్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ ను, మాళవిక మోహనన్ ను ఈ సృష్టి కలిపిందంట. దాని వెనక లాజిక్ ను కూడా ఆమె బయటపెట్టింది.

కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలు సక్సెస్ అయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మాళవిక మోహనన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించాడట. అందుకే ప్రభాస్ హీరోగా సలార్ సినిమాలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడంట.

అప్పటికే ప్రభాస్ పై మాళవిక మోహనన్ కు క్రష్ ఉంది. బాహుబలి, బాహుబలి-2 సినిమాలు చూసి ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయింది. సలార్ లో హీరోయిన్ ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసింది.

అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సలార్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది మాళవిక. అప్పట్నుంచి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఎట్టకేలకు మారుతి నుంచి కాల్ రావడంతో, రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నటించానని, అలా గట్టిగా కోరుకోవడంతో ప్రభాస్ ను, తనను ఈ యూనివర్స్ కలిపిందని అంటోంది మాళవిక.

5 Replies to “ప్రభాస్ ను నన్ను ఈ సృష్టి కలిపింది”

Comments are closed.