వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
మున్సిపాల్టీలో ఓటు కోసం కోర్టుకెళ్లి, ఆ తర్వాత చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించేలా చేసుకోవడంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తమ్ముడు రాఘవరెడ్డి సక్సెస్ అయ్యారు. చివరి నిమిషంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రొద్దుటూరు మండల పరిధిలోని కామనూరులో వరదరాజులరెడ్డి కుటుంబ సభ్యులకు ఓట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డికి కూడా అక్కడే ఓటు వుంది.
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్కు కేటాయించడంతో ఆయన మనసు అటు వైపు మళ్లింది. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి కావాలనే తన కోరికను అన్న వరదరాజులరెడ్డి ముందు పెట్టారు.
అయితే మున్సిపల్ చైర్మన్ కావాలంటే, ముందుగా ఆ పరిధిలో ఓటు ఉండాలి కదా? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో యుద్ధప్రాతిపదికన మున్సిపాల్టీ పరిధిలో ఓటు కోసం రాఘవరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి, అక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లేలా చూసుకున్నారు. అయితే చైర్మన్ పదవికి పోటీ ఎక్కువ వుండడంతో ఉత్కంఠకు తెరలేచింది.
అయితే వరదరాజులరెడ్డి పట్టుపట్టి, తన తమ్ముడికి ఆ పదవిని ఇప్పించుకోగలిగారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో ఓటు నమోదు మొదలు, చైర్మన్ అభ్యర్థిగా ప్రకటన వచ్చే వరకూ సాగిన రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించే పరిస్థితి.
వడ్డించే వాళ్లు మనోళ్లైతే… సామెతను గుర్తు చేసుకుంటూ, ఏమైతేనేం వరదరాజులరెడ్డి తమ్ముడు చైర్మన్ అభ్యర్థి అయ్యాడని జనం అంటున్నారు. అయితే ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే రాఘవరెడ్డి గెలుస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది.

అదేంది…నిన్ననే గా కడప జిల్లా లో వైసీపీ హవా అన్నావ్..
మారి రాఘవ రెడ్డి గెలుస్తాడో లేదో అంటావ్