మహేష్ చేతికి వారణాసి ప్రమోషన్ ప్లాన్

జనవరి నుంచి ప్రతినెల 3 రోజుల పాటు మహేష్ ప్రచారానికి అందుబాటులో ఉండాలని అనుకుంటున్నారు.

తన హీరోల్ని రాజమౌళి ఎలా వాడతాడో అందరికీ తెలిసిందే. ది బెస్ట్ ఔట్‌పుట్ వచ్చేంతవరకు వాళ్లకు విశ్రాంతినివ్వడు. హమ్మయ్య షూటింగ్ అయిపోయింది అనుకునేలోపే, ప్రచార పర్వం మొదలవుతుంది. మళ్లీ అదో ప్రహసనం.

ప్రచారంలో రాజమౌళి వాడకం ఎలా ఉంటుందో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకు తెలుసు. ఇప్పుడు మహేష్ వంతు.

వారణాసి సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తిచేసిన మహేష్, ఇప్పుడు ప్రచారానికి కాల్షీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఏఏ నెలల్లో, ఏఏ తేదీలు అందుబాటులో ఉండాలో తెలుపుతూ మహేష్‌కు ఓ లిస్ట్ చేరింది.

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కొన్ని తేదీల్ని లాక్ చేస్తూ, మహేష్‌కు లిస్ట్ పంపించారు. ఆ తేదీల్లో కాకుండా, మిగతా తేదీల్లో మహేష్ తన విదేశీ పర్యటనలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇదంతా తాత్కాలిక జాబితా మాత్రమే. ప్రమోషనల్ మెటీరియల్ ఏ మేరకు సిద్ధమౌతుందో చూసుకొని దాన్ని బట్టి మళ్లీ తేదీలు మారుస్తారు. అయితే అంతకంటే పెద్ద సమస్య ఇప్పుడు ఇంకోటి తయారైంది.

అన్ని పెద్ద సినిమాల్లానే వారణాసి కూడా వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. అదే కనుక జరిగితే ప్రమోషనల్ ప్లాన్ మొత్తం మారిపోతుంది. సో.. ప్రస్తుతానికైతే కొన్ని తేదీలు అనుకుంటున్నారు.

జనవరి నుంచి ప్రతినెల 3 రోజుల పాటు మహేష్ ప్రచారానికి అందుబాటులో ఉండాలని అనుకుంటున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏ స్థాయిలో జరుగుతోంది.. విడుదల తేదీకి అనుకున్నట్టుగా కంటెంట్ రెడీ అవుతుందా లేదా అనే విషయాల ఆధారంగా.. మహేష్‌తో నిర్వహించబోయే గ్రౌండ్ ఈవెంట్ల తేదీలు నిర్ణయిస్తారు.

2 Replies to “మహేష్ చేతికి వారణాసి ప్రమోషన్ ప్లాన్”

Comments are closed.