వైసీపీ కళ్యాణి వర్సెస్ టీడీపీ శ్రావణి

వైసీపీ బీసీ కార్డుతో బరిలోకి దిగడంతో టీడీపీ కూడా బీసీలకే విశాఖ మేయర్ టికెట్ ఇచ్చింది.

వైసీపీ బీసీ కార్డుతో బరిలోకి దిగడంతో టీడీపీ కూడా బీసీలకే విశాఖ మేయర్ టికెట్ ఇచ్చింది.

కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వరుదు కళ్యాణిని అభ్యర్థిగా ఎంపిక చేసి బీసీల వైపే తాము అని స్పష్టం చేసింది.

టీడీపీ నుంచి ఓసీలు అనేక మంది పోటీలో ఉన్నారు. బీసీ వైసీపీ కార్డుతో ముందుకు రావడంతో టీడీపీ సైతం తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ, మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణికి టికెట్ ఇచ్చింది. దాంతో బీసీ వర్సెస్ బీసీ అన్నట్లుగా జీవీఎంసీ పోరు సాగనుంది.

ఇద్దరిలో వరుదు కళ్యాణి రాజకీయంగా అనుభవం ఉన్న మహిళగా ఉన్నారు. ఆమె గతంలో ఎంపీగా పోటీ చేశారు. జీవీఎంసీ నుంచే ఆమె స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. దాంతో జీవీఎంసీ సమస్యలు తనకు తెలుసు అని అంటున్నారు.

విశాఖ అభివృద్ధి అంతా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగింది అని చెబుతున్నారు.

వైసీపీ మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. కూటమి ఏలుబడిలో విశాఖకు తాగునీటి కష్టాలు కూడా తీసుకువచ్చారని ఆమె మండిపడ్డారు.

ఒకసారి కార్పొరేటర్‌గా చేసిన ముక్కా శ్రావణి మేయర్ సీటుకు ఈసారి పోటీ పడుతున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నా వైసీపీ అభ్యర్థితో పోలిస్తే అనుభవం తక్కువే. అయితే కూటమిలో మూడు పార్టీలు ఉంటాయి కాబట్టి ఆ బలంతో గెలుపు సాధ్యపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి విశాఖ మేయర్‌ను కూడా గెలిపించుకుంటే ప్రగతి సాధ్యమని ఆమె చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది తమను గెలిపిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

జీవీఎంసీ మేయర్ ఎన్నికలు ఏకపక్షం కావాలని కూటమి మొదట్లో భావించినా, ధీటైన అభ్యర్థిని పోటీగా వైసీపీ పెట్టడంతో ఇప్పుడు హోరాహోరీ పోరు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో జీవీఎంసీ కొత్త మేయర్ ఎవరు అన్న చర్చ సాగుతోంది.

9 Replies to “వైసీపీ కళ్యాణి వర్సెస్ టీడీపీ శ్రావణి”

  1. ఇదేం గూగుల్ CEO జాబ్ కాదు. అనుభవం తక్కువ అయినా ఎక్కువ అయినా వాళ్ళ ప్రవర్తన పార్టీ ని బట్టే ఉంటుంది. మనకి వైసీపీ, టీడీపీ రెండు తెలిసినవే.

  2. స్థానిక సంస్థలు MLC అయిన కళ్యాణి… స్థానికురాలు కాదు… శ్రీకాకుళం నుండి దిగుమతి

Comments are closed.