సీట్లే కాదు అభ్యర్ధులనూ జనసేనకు ఇవ్వాలా?

జనసేన ఏపీలో సంస్థాగతంగా ఇంకా బలం పుంజుకోలేదని అంటున్నారు. ఆ పార్టీకి సీట్లు పొత్తులో భాగంగా పట్టుబట్టి తీసుకున్నారు.

జనసేన ఏపీలో సంస్థాగతంగా ఇంకా బలం పుంజుకోలేదని అంటున్నారు. ఆ పార్టీకి సీట్లు పొత్తులో భాగంగా పట్టుబట్టి తీసుకున్నారు.

ఉత్తరాంధ్రలో జనసేన అనేక చోట్ల పెద్దగా ఓటు బ్యాంక్ ని కలిగి లేదు. దాంతో జనసేనకు సీట్లను కేటాయించడమే కాదు అభ్యర్ధులను టీడీపీ నుంచే ఇవ్వాల్సి వస్తోంది అని అంటున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మునిసిపాలిటీ జనసేనకు కేటాయించారు. అయితే అక్కడ జనసేనకు పెద్దగా బలం లేదు, దాంతో దీని మీద టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహనరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పొత్తులో సీటు జనసేనకు వెళ్ళిందని ఆయన పార్టీ కార్యకర్తలకు చెబుతూ జనసేనకు అభ్యర్ధుల కొరత ఉందని టీడీపీ నుంచే అవసరమైతే నాయకులు వెళ్ళి పోటీ చేయాల్సి ఉంటుందేమో అని కామెంట్స్ చేశారు. ఇపుడు అవి వైరల్ అవుతున్నాయి.

అదే విధంగా సాలూరులో జనసేనకు మునిసిపాలిటీని కేటాయించారు. అక్కడ ఆ పార్టీకి రెండు శాతం కూడా ఓటు షేర్ లేదని ఎలా ఇస్తారని తమ్ముళ్ళు నిలదీస్తున్నారు.

బలం ఎక్కువగా ఉన్న టీడీపీని కాదని పొత్తు అని ఇచ్చారని మండిపడుతున్నారు. మంత్రి సాలూరు ఎమ్మెల్యే అయిన గుమ్మడి సంధ్యారాణి ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.

పార్టీ కోసం ఎంతో మంది కష్టపడిన వారు ఉన్నారని వారికి అవకాశం దక్కలేదని ఆవేదన చెందారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉంటే జనసేనకు రెండు ఇవ్వడం పట్ల అయితే తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీకి బలం లేదని అంటున్నారు.

అయితే పొత్తు పేరుతో సీట్లు కేటాయించినా టీడీపీ నుంచి ఆశావహులు ఆ పార్టీలో చేరి ఆ కండువా కప్పుకుని పోటీ చేయడం ద్వారా తమ ఆశలు నెరవేర్చుకునే మార్గం ఉందని అంటున్నారు. సీట్ల తకరారు అయితే టీడీపీలో పెద్ద రచ్చనే రాజేస్తున్నాయి.

5 Replies to “సీట్లే కాదు అభ్యర్ధులనూ జనసేనకు ఇవ్వాలా?”

Comments are closed.