మరో కొత్త లాజిక్ తీసిన నాగవంశీ

డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకున్నారు నాగవంశీ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే మీడియాపై ఫైర్ అయ్యారు.

డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకున్నారు నాగవంశీ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే మీడియాపై ఫైర్ అయ్యారు. మీడియానే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తోందంటూ ఆరోపించారు.

“ఈ టికెట్ రేట్ల ఫాంటసీ ఎందుకు? మేమేదో రేట్లు పెంచి జనాలను ఇబ్బంది పెడుతున్నామని రుద్దడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు. అదే నెగెటివిటీని రుద్దడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టికెట్ రేట్లపై కొన్ని పరిమితులున్నాయి. జీవోతో ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తున్నామంతే.”

ఇదీ నాగవంశీ కొత్త వెర్షన్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్యాపింగ్‌ను సవరించేందుకు ప్రత్యేక జీవో తెచ్చి, టికెట్ రేట్లు పెంచుతున్నామని చెబుతున్న నాగవంశీ, అదే టైమ్‌లో పెద్ద సిటీల్లో మల్టీప్లెక్సుల్లో కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా. మరి దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు.

కాకినాడ, రాజమండ్రి లాంటి పట్టణాల్లో రేట్లు తక్కువగానే ఉంచామంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కౌంటర్‌గా చాలామంది సోషల్ మీడియాలో బుక్ మై షో స్క్రీన్ షాట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపుపై మరో కవరింగ్ కూడా చేశారాయన. కోయంబత్తూరు లాంటి పట్టణాల్లో జైలర్-2కు టికెట్ రేట్లు ఎక్కువే ఉన్నాయంట. బెంగళూరులో కొన్ని స్క్రీన్స్‌లో 1600, 1800 రేట్లు ఉన్నాయంట.

హైదరాబాద్‌లోనే పీవీఆర్ చైన్ తీసుకుంటే, ఒక చోటు ఒక రేటు, మరో చోట ఇంకో రేటు ఉన్నాయనేది నాగవంశీ వాదన.

ఫ్యాన్సీ రేటుకు సినిమాను కొనడం ఎందుకు, పెట్టిన డబ్బు రాబట్టుకోవడానికి ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టడం ఎందుకు? జైలర్-2 సినిమాను భారీ రేటుకు కొనమని ఏ ప్రేక్షకుడు నాగవంశీకి చెప్పాడు?

3 Replies to “మరో కొత్త లాజిక్ తీసిన నాగవంశీ”

  1. ప్రేక్షకులు జేబులు ఖాళీ చేసుకుని హడావిడిగా తొలి వారం రోజుల్లోనే సినిమాని చూడమని ఎవరూ బలవంతం చెయ్యటం లేదుగా?. భారీ రేటుకి కొనమని ఎవ్వరూ ఎలా చెప్పరో అలానే ఇక్కడ భారీ రేటు పెట్టి సినిమా చూడమని కూడా ఎవ్వరూ చెప్పరుగా!బొమ్మ హిట్ గాబట్టి మనం ఇలా రాస్తున్నాం ఫట్ అయితే మరోలా రాస్తాం! అయినా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వమేగా!మేము రేట్లు పెంచం అన్న భారీ మూవీకి కలెక్షన్స్ లేవుగా మరి!

Comments are closed.