జనసేన గతిలేని తనం ఇంకా కొనసాగుతోందా..?

‘ఆశలావు పీక సన్నం’ అంటే ఇదే. తమ బలం విపరీతంగా పెరిగిపోయింది.

‘ఆశలావు పీక సన్నం’ అంటే ఇదే. తమ బలం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రమంతా తాము పోటీచేసేయాలని.. తమకు ఎన్ని సీట్లు ఇచ్చినా చాలవు.. ఇంకా సీట్లు కావాలి అని అంటూ ఉంటారు.

తీరా ఇచ్చిన సీట్లలో పోటీచేయడానికి మాత్రం వారికి అభ్యర్థులు ఉండరు. సీట్లు కేటాయింపబడిన తర్వాత.. అప్పుడు అభ్యర్థుల కోసం దేవులాడుతూ ఉంటారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలసలు వస్తారా? వారికి టికెటు కేటాయించి మమ అనిపించుకుందామా? అని ఎదురుచూస్తుంటారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ బలహీనత మరోసారి బయటపడుతోంది. నామినేషన్ల పర్వం ఒకవైపు ముగుస్తుండగా.. ఇప్పటికీ తమ పార్టీ తరఫున బరిలోకి దిగేది ఎవరో తెలియక, ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తూ ఆ పార్టీ నిరీక్షిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం.

ప్రధానంగా విజయవాడ మేయర్ స్థానాన్ని పరిశీలిస్తే… వంగవీటి రాధాను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మొన్నమొన్నటిదాకా ఆయన జనసేన పార్టీలో లేరు. కేవలం కొన్ని నెలల కిందట వచ్చి పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. అప్పట్లోనే మేయర్ సీటుకు సంబంధించి బేరం మాట్లాడుకున్నారేమో తెలియదు. ఆ తర్వాత కొన్నాళ్లకు వచ్చి పార్టీ కండువా కప్పించుకుని జనసేనలో చేరారు.

తీరా ఇప్పుడు ఆయనకే మేయర్ సీటును ప్రకటించారు. ఇన్నాళ్లుగా జనసేన పార్టీ తరఫున రాజకీయాల్లో కష్టపడుతున్న ఒక్క వ్యక్తి కూడా విజయవాడ నగరంలో ఆ పార్టీకి లేకుండా పోవడం సిగ్గుచేటు కదా.. అని పలువురు చర్చించుకుంటున్నారు.

తమాషా ఏంటంటే.. జనసేన పార్టీకి చాలా చోట్ల అభ్యర్థులకు గతిలేదు. విధిలేని పరిస్థితుల్లో తెలుగుదేశానికి చెందిన వారినే తమ పార్టీలో చేర్చుకుని పోటీచేయించే ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కూడా ఇలా కొన్నిచోట్ల జరిగింది. అప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీ ఏం బలపడిందో తెలియదు గానీ.. వారి గతిలేని తనం మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

ఇప్పటికీ తెలుగుదేశం నాయకులను పిలిచి టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరం జిల్లా పాలకొండలో తెలుగుదేశం నేత పల్లా కొండబాబు భార్య విజయనిర్మలకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది.

సాలూరులో బీసీ మహిళ పోటీచేయాల్సి ఉండగా.. ఎన్నికలకోసమే పెళ్లి చేసుకున్న తెదేపా నేత భార్య మంజీరకు టికెట్ ఇవ్వవచ్చునని అనుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ వారు కూడా జనసేనలో చేరి బరిలోకి దిగాలనుకుంటున్నారు.

దర్శిలో కూడా తెలుగుదేశం నేతను తీసుకువచ్చి బరిలోకి దించాలని బాలినేని ప్రయత్నిస్తుండడం విశేషం. తునిలో కూడా తెలుగుదేశం నేత మళ్ల గణేష్ దంపతులు జనసేనలో చేరారు. గణేష్ భార్య మీనాక్షికి టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు.

ఈ రకంగా అనేక చోట్ల సీట్లనైతే జనసేన దక్కించుకున్నది గానీ.. వారికి అభ్యర్థులకు గతిలేని మాట వాస్తవం. ఆ సీట్లన్నీ కూడా తెలుగుదేశం వారితోనే నిండుతాయని జనం జోకులేసుకుంటున్నారు.

17 Replies to “జనసేన గతిలేని తనం ఇంకా కొనసాగుతోందా..?”

  1. అసలు ఏ పార్టీ లో అయినా అదే తంతు కదా? ఎక్కడ చూసినా అదే మొహాలు.. ఒకసారి ఇక్కడ… మరోసారి అక్కడ… ఏముంది తేడా? ఇక్కడ సీటు రానివారు అక్కడ తేలతారు… 

  2. అవంతి… మొదటినుండీ మనోడే…. 

    P v Ravindra… మొదటినుండీ మనోడే

    ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి… ఏమంటావ్ GA

  3. అసలు నీ పార్టినె కాంగెస్స్ నాయకుల వలసలతొ ఎర్పడిన పార్టి! మరి అప్పుడు నీకు గతి లెనితం అనిపించలెదా?

  4. With his sister YCP planned to get support from Ranga supporters, but JS sprinkled water on their plans by inducting Radha into the party. The pain and forthcoming defeat is understandable. 

  5. ఎప్పటినుంచో పార్టీలో ఉన్నారనే కారణంతోనే కాకుండా, వారి electability కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా?

  6. జెండా కూలీలు తప్ప, కాస్త చదువు, సంస్కారం, వివేకం, నాయకత్వ లక్షణాలున్న కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ పరిస్థితి అయినా ఇట్లాగే ఉంటది. అట్లాంటి వాళ్లు పార్టీలో ఉండి ఉంటే, అసలు సీట్ల కోసం అడుక్కోవాల్సిన ఇలాంటి దుస్థితి ఉండి ఉండేది కాదు. తమ కాళ్ల మీద తామే నిలబడేవారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లలో అభ్యర్థులను నిలిపి, ధైర్యంగా పోటీ చేసి, తమ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని నెలకొల్పగలదని, ఏ పార్టీకి గులాంగిరి చేయాల్సిన దౌర్భాగ్యం లేదని నిరూపించుకోగలిగలిగి ఉండేది.

Comments are closed.