కాళ్లు ప‌ట్టుకుని జై జ‌గ‌న్ అనమ‌నండి.. ఎంపీపీ భిక్ష వేస్తాం!

కాళ్లు ప‌ట్టుకుని, జై జ‌గ‌న్ అంటే ఎంపీపీ ప‌దవిని భిక్ష వేస్తామ‌ని శైల‌జానాథ్ గ‌ట్టిగా అరిచి చెప్పారు.

శింగ‌న‌మ‌ల ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ‌కు తెర‌లేచింది. ఈ మండ‌లంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో టీడీపీ, వైసీపీ ఆరేసి చొప్పున స‌మానంగా సీట్లు ద‌క్కాయి. దీంతో ఎంపీపీ ఎన్నిక స‌వాల్‌గా మారింది.

ఈ నేప‌థ్యంలో శింగ‌న‌మ‌ల ఎంపీపీని ఎన్నుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఎంపీపీ ఎన్నిక చేప‌ట్టిన కార్యాల‌యంలోకి కేవ‌లం టీడీపీ ఎంపీటీసీల్ని మాత్ర‌మే అనుమ‌తించారు.

వైసీపీ స‌భ్యుల్ని లోప‌లికి వెళ్ల‌కుండా కార్యాల‌యం వెలుప‌ల పోలీసులు అడ్డుకున్నారు. మ‌రోవైపు కార్యాల‌యం లోప‌ల శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి, మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే రాజు తిష్ట వేశారు.

ఇదే సంద‌ర్భంలో వైసీపీ ఎంపీటీసీ స‌భ్యుల‌తో క‌లిసి మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ అక్క‌డికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవ‌డంతో శైల‌జానాథ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాళ్లు ప‌ట్టుకుని, జై జ‌గ‌న్ అంటే ఎంపీపీ ప‌దవిని భిక్ష వేస్తామ‌ని శైల‌జానాథ్ గ‌ట్టిగా అరిచి చెప్పారు. ఎంపీపీ ఎన్నిక‌లో అప్ర‌జాస్వామ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైసీపీ నేత శైల‌జానాథ్ మండిప‌డ్డారు.

ఇరుపార్టీల‌కు స‌మాన సంఖ్య‌లో సీట్లు వ‌స్తే, టాస్ వేయాల్సి వుంటుంది. కానీ ఆ ప‌ద్ధ‌తులేవీ అధికారులు పాటించ‌కుండా, బ‌ల‌వంతాన ఎంపీపీ ప‌ద‌విని ద‌క్కించుకోడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు య‌త్నించ‌డంపై శైల‌జానాథ్ విరుచుకుప‌డ్డారు.

4 Replies to “కాళ్లు ప‌ట్టుకుని జై జ‌గ‌న్ అనమ‌నండి.. ఎంపీపీ భిక్ష వేస్తాం!”

  1. పాపం ఈయన గారు pcc అధ్యక్షుడిగా ఉండి…గతి లేక అలా కాళ్ళు పట్టుకొని…జై జగన్ అని శింగనమల ఇంచార్జి పదవి కొట్టేసినట్లు ఉన్నాడు

Comments are closed.