బాల‌య్య చిన్న‌ల్లుడికి సొంత పార్టీ శ్రేణుల షాక్‌!

హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, విశాఖ ఎంపీ భ‌ర‌త్‌కు సొంత పార్టీ శ్రేణులు గట్టి షాక్ ఇచ్చాయి.

హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, విశాఖ ఎంపీ భ‌ర‌త్‌కు సొంత పార్టీ శ్రేణులు గట్టి షాక్ ఇచ్చాయి. త‌మ గ్రామంలోకి ప్ర‌చారానికి రావ‌ద్ద‌ని ఆయ‌న్ను అడ్డుకున్నాయి. విశాఖ ఎంపీకి విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పుకోట మండ‌లం వెంక‌ట‌ర‌మ‌ణ‌పేట‌లో చుక్కెదురైంది.

వివ‌రాలిలా ఉన్నాయి. ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌లకు విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో శృంగ‌వ‌రం మండ‌లంలోని వెంక‌ర‌మ‌ణ‌పేట‌లో టీడీపీలోని ఇరువ‌ర్గాల‌కు చెందిన జుత్తాడ భ‌వానీ, క‌నిక‌శెట్టి స‌త్య‌వ‌తి పోటీ చేస్తున్నారు.

ఒకే పార్టీకి చెందిన వేర్వేరు వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళా అభ్య‌ర్థులు సర్పంచ్ అభ్య‌ర్థులుగా బ‌రిలో నిల‌బ‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో జుత్తాడ భ‌వానీకి మ‌ద్ద‌తుగా విశాఖ ఎంపీ ప్ర‌చారానికి ఇవాళ వెళ్లారు. భ‌ర‌త్ రావ‌డాన్ని టీడీపీలోని మ‌రో వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ గ్రామంలో ప్ర‌చారం చేయ‌డానికి వీల్లేదంటూ ఎంపీని సొంత పార్టీ శ్రేణులే అడ్డుకున్నాయి. దీంతో ఉద్రిక్త‌త నెల‌కుంది.

ప‌రిస్థితి అదుపు త‌ప్పింద‌ని భావించిన విశాఖ ఎంపీ… ప్ర‌చారం చేయ‌కుండానే వెనుదిర‌గాల్సి వ‌చ్చింది.

కూట‌మి ప్ర‌భుత్వంలో విశాఖ ఎంపీ భ‌ర‌త్ అత్యంత ముఖ్య‌మైన ప్ర‌జాప్ర‌తినిధి. ముఖ్య‌మైన మంత్రి నారా లోకేశ్‌కు భ‌ర‌త్ తోడ‌ల్లుడు. అలాంటి కీల‌క నాయ‌కుడిని టీడీపీ కార్య‌క‌ర్త‌లే అడ్డుకోవ‌సం స‌హ‌జంగానే తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

3 Replies to “బాల‌య్య చిన్న‌ల్లుడికి సొంత పార్టీ శ్రేణుల షాక్‌!”

  1. మన పార్టీ భవిష్యత్తు ఏంటో మనకే తెలియదు.. పక్క వాళ్ళ గురించి మనకి అవసరమా?

Comments are closed.