తిరుపతిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించేలా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీకే లేఅవుట్‌లో గత నెల 27న చోటుచేసుకున్న మహిళ మృతి వెనుక పెద్ద కథే ఉందని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ఆత్మహత్యగా చిత్రీకరించారా? హత్యను కప్పిపుచ్చారా?
ఒక మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందితే పోలీసులు ఇంత తేలిగ్గా ఆత్మహత్యగా ఎలా నిర్ధారించారని భూమన నిలదీశారు. సదరు మహిళకు ఒక రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడితో వివాహేతర సంబంధం ఉందని, ఆ వ్యవహారమే ఆమె మరణానికి కారణమై ఉండవచ్చని తీవ్ర ఆరోపణ చేశారు.
మహిళ మృతి చెందిన ఇల్లు, ప్రాంతం, అక్కడి పరిస్థితులపై అనేక అనుమానాలున్నాయని పేర్కొంటూ.. ఇంటి యజమానిని ఎందుకు సమగ్రంగా విచారించలేదని ప్రశ్నించారు.
పోలీసులకు అనుమానం రాకపోవడం ఏంటి?
ఒక గుర్తుతెలియని మహిళ మృతి చెందితే సాధారణంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరపాలి. కానీ ఈ కేసులో కీలకమైన వ్యక్తులను విచారించారా? సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారా? కాల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారా? పోస్టుమార్టం నివేదికలో ఏముంది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని భూమన డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వ రాజకీయ పలుకుబడితో సంబంధిత నాయకుడిని కాపాడుతున్నారంటూ పోలీసులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
రాజకీయ రక్షణ ఎంతకాలం?
ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని భూమన హెచ్చరించారు. ప్రస్తుతం తప్పించుకున్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధిత నాయకుడి వ్యవహారాన్ని బయటపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
తిరుపతి ప్రజల ముందున్న ప్రశ్న ఒక్కటే!
ఒక మహిళ మృతి వెనుక అసలు నిజం ఏమిటి? రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా? మహిళ మృతి కేసులో అన్ని ఆధారాలను బయటపెట్టి నిష్పక్షపాత విచారణ జరిపే ధైర్యం పోలీసులకు ఉందా?
రాజకీయ ఆరోపణలు ఎన్ని వచ్చినా.. నిజాలు మాత్రం దర్యాప్తులో బయటపడాలి. బాధిత మహిళకు న్యాయం జరగాలి. దోషులెవరైనా చట్టం ముందు నిలబడాలి. తిరుపతి మహిళ మృతి కేసు ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. కానీ అసలు మిస్టరీ వీడేది ఎప్పుడు?

అప్పట్లొ వీడు TTD లొ ఎ కల్తీ జరగలెదు అని గుడి దగ్గర ప్రమానం చెసాడు! వినే వాళ్ళు ఉండాలె కాని ఎన్ని కదలు అయినా చెపుతారు!
Bollodu kanna who will tell.stories
కొజ్జామోహన is telling award winning stories
గొడ్డలి పోటును గుండె పోటుగా మారిస్తే ఎందుకు నిలదీయలేదు ఈ భూమన గాడు?
పలుకుబడి వున్నవారికి ఒక న్యాయం, సామాన్యులకి ఒక న్యాయమా అని ప్రశ్నించలేదేం?
అప్పుడు అధికారం లో ఉన్నది నిప్పు నాగరాజు ప్రభుత్వమే కదా. వాళ్ళేమి చేసినట్టు మరి
అందుకే చదుకోవాలి…అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏలుబడి. అప్పటికి ఎంక్వైరీ వేస్తే…లాగెట్టుకెళ్లి గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు సింహం. అన్నయ్య
అసలు ఈయన్ని పార్టీ లో వాళ్ళే నమ్మడం లేదు…
Yemmo chepalemu
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు…for some reason, anything this guy says is not believable…