భోగి ట్రయిలర్ లాంచ్. సింపుల్ అండ్ స్వీట్‌గా జరిగింది. ఎలాంటి భేషజాలకు పోని శర్వానంద్, చివరికి తన షో-రీల్ (AV)ను కూడా ప్రసారం చేయడానికి అంగీకరించలేదు. అంతా సినిమా గురించి చక్కగా మాట్లాడారు.
అయితే ఈ కార్యక్రమంలో హీరోయిన్ డింపుల్ హయాతీ వ్యవహారశైలి ఎన్నో ఊహాగానాలకు తెరతీసింది. శర్వానంద్‌తో ఆమె చనువుగా ఉన్న ఓ క్లిప్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వస్తూనే శర్వానంద్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుంది డింపుల్. ఆ తర్వాత ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. ఓ టైమ్‌లో శర్వానంద్‌కు చాలా దగ్గరైన డింపుల్, అతడి భుజంపై తలవాల్చింది. ఆ తర్వాత శర్వానంద్, ఆమె వైపు నవ్వుతూ చూడడం, ఇద్దరూ సరదాగా నవ్వుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
ఈ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చేసిన ఒక్క సినిమాతోనే వీళ్లిద్దరూ ఇంతలా కలిసిపోవడం చాలామంది ఆశ్చర్యపరిచింది. శర్వానంద్ అంతే, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
శర్వానంద్‌కు ఆల్రెడీ పెళ్లయింది. ఓ పాప కూడా ఉంది. అటు డింపుల్‌కు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొంతమంది అతడితో డింపుల్‌కు వివాహమైందని కూడా చెబుతారు.

Dimple kada, intaki sarwa wife ki divorce ichada leda ?
endu ko dimple ni choosina, s.leela ni chusina buddi ga vunde vaalla la anipincharu
GA YOU ARE THE ONE DOING OOHA GANALU.
VERE PANI LEDA NEEKU.