ఒకే ఒక్క రోజు.. రూ.5 లక్షల కోట్లు నష్టం

ఒక దశలో సెన్సెక్స్ 1500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25350 పాయింట్లకు దిగువకు పడింది

గడిచిన కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్ ఈరోజు నేలచూపులు చూసింది. ప్రారంభం నుంచే నెగెటివ్‌లోకి వెళ్లిన సూచీలు, ఎక్కడా కోలుకోలేదు. ఫలితంగా ఫలితంగా 5 లక్షల కోట్ల రూపాయల సంపద ఒక్క రోజులో ఆవిరైంది.

ఒక దశలో సెన్సెక్స్ 1500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25350 పాయింట్లకు దిగువకు పడింది. కొన్ని రోజులుగా లాభాల్లో నడిచిన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలింది? ఏయే రంగాలు భారీగా దెబ్బతిన్నాయి?

2-3 రోజులుగా అంతర్జాతీ మార్కెట్లు ఒడిదుడుగులకు లోనైనప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్లు చెక్కుచెదరలేదు. కానీ ఈరోజు మాత్రం అకస్మాత్తుగా కుప్పకూలాయి. పడుతుందని కొంతమంది ఊహించారు, కానీ ఈ స్థాయిలో డౌన్ అవుతుందని చాలామంది ఊహించలేదు.

మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలకు చెందిన షేర్లు ఇవాళ మార్కెట్‌ను నిలువునా ముంచాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ సంస్థలో 26శాతానికి పైగా వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది టాటా స్టీల్. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ రెండు కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

అటు బ్యాంకింగ్ షేర్లు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఉన్నంతలో టెక్నాలజీ షేర్లు ఆదుకోవడంతో మార్కెట్ పతనం కొంతమేర ఆగింది.

ముడిచమురు ధరలు తగ్గి మార్కెట్లు లాభపడ్డంతో, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొన్ని రోజులుగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల స్వీకరణ మొదలుపెట్టారు. దీనికితోడు అమెరికా ఫెడ్, వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గురునానక్ జయంతి సందర్భంగా రేపు స్టాక్ మార్కెట్లకు శెలవు, దీంతో బుధవారం ట్రెండ్ ఎలా ఉంటుందనేది రేపు అంతర్జాతీయ మార్కెట్ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

One Reply to “ఒకే ఒక్క రోజు.. రూ.5 లక్షల కోట్లు నష్టం”

Comments are closed.