వరుసగా సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో కింగ్-100పై కూడా అనుమానాలు పెరిగాయి. చెప్పిన టైమ్‌కు సినిమా వస్తుందా రాదా అంటూ చాలామంది డౌట్స్ పెట్టుకున్నారు. ఈ పుకార్లకు తాజాగా చెక్ పెట్టారు నాగార్జున.
కింగ్ నాగార్జున నటిస్తున్న 100వ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ‘కింగ్ 100’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను మరోసారి ఎనౌన్స్ చేస్తూ, 30 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది టీమ్.
ఈ పోస్టర్‌లో నాగార్జున స్టైలిష్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. డార్క్ కలర్ సూట్, కళ్లకు సన్‌గ్లాసెస్ ధరించి, వింటేజ్ కారుతో కనిపించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది.
అనుకున్న టైమ్‌కు తన సినిమాను రెడీ చేస్తానని నాగ్ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. విడుదలకు ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంటే, మంచి క్వాలిటీ ఇవ్వొచ్చంటూ పరిశ్రమకు పిలుపునిచ్చారు. దాన్ని పాటిస్తూ, మరికొన్ని రోజుల్లోనే ఫస్ట్ కాపీని సిద్ధం చేయబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకుడు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Akkineni legendary