ఎమ్బీయస్‌: ఇలాటి మిత్రులుంటే శత్రువులెందుకు?

ఇంట్లోకి కాలు పెట్టే పరిస్థితి కలగకపోతే యింటితో పాటు లోపల బ్లాక్ మనీ వుంటే అదీ పోతుంది. వైట్ మనీ మాత్రమే బయటకు తెప్పించుకో గలదు.

గమనిక: ఈ ఆర్టికల్‌ను చదవడానికి టైము లేని వారు దీని వీడియో రూపాన్ని యీ కింది లింకులో చూడవచ్చు. తెలుగు అర్థం చేసుకోగలిగి, చదవడం రాని వారితో షేర్ చేసుకోవచ్చు కూడా! https://www.youtube.com/watch?v=M84z1mQwTPU

శర్మిల యలహంక ప్రాపర్టీలోకి వెళ్లడానికి ప్రయత్నించే క్రమంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి, చాలా సంగతులు జరిగాయి. అవన్నీ శర్మిలకు వ్యతిరేకమైనవే. పాలెస్‌కు వెళతానంటే పోలీసులు కుదరదంటూ వెనక్కి పంపించారు. దానికి కారణం – కోర్టు ఆదేశాలు. ఆ ఆదేశాలు వెలువడడానికి కారణం – ఆ ప్రాపర్టీ ప్రస్తుత లీజు హోల్డర్ రమేశ్‌బాబు, ‘శర్మిల ఆస్తి తనదంటోంది బాబోయ్, లోపలకి రానీయకండి’ అంటూ కోర్టుని ఆశ్రయించడం! కోర్టు అతని వాదన నమ్మడానికి కారణం ఆ ఆస్తి నాదే అంటూ శర్మిల స్వయంగా, పబ్లిగ్గా ట్వీట్ చేయడం! టెనెంట్ ఆస్తి నాదేనని ప్రకటనలిస్తూ వుంటే ఓనరు హక్కులు కాపాడడానికే కోర్టులు చూస్తాయి కదా! దెబ్బకి కోర్టు ఆదేశాలిచ్చింది, పోలీసులు శర్మిలను ఆపారు, పెళ్లికి కావలసిన నగలు, బట్టలు తెచ్చుకోవడానికి సొంతంగా వెళ్లేందుకు కుదరదన్నారు. మాకు చెప్పండి, మేం తెచ్చి యిస్తాం అన్నారు. ఎల్లుండే పెళ్లి. ఈ లోపున యీ తకరారు!

దీని కంతా కారణమేమిటి? ‘ఇల్లు నాదే’ అంటూ శర్మిల పబ్లిక్ స్టేటుమెంటు యివ్వడం! తనదే అయితే ప్రభుత్వ రికార్డుల్లో తన పేరిట వుండాలి కదా! అలా లేదని తనకు స్వయంగా తెలిసి కూడా ఆ స్టేటుమెంటు యిచ్చిందంటే ఏమనుకోవాలి? తెలుగు మీడియా ‘నీదే’ అని చెప్తే ఆ మాట నమ్మేసి ‘ఔను నాదే’ అనేసుకుని చెప్పేసిందనుకోవాలా? తెలుగు మీడియా వాళ్లు ‘ఇన్నాళ్లూ జగన్ యలహంక ప్యాలెస్ అంటూ హడావుడి చేస్తూ వచ్చాం. అక్రమాస్తులు, లక్ష కోట్లు, లోటస్ ప్యాండ్ పాలెస్, తాడేపల్లి ప్యాలెస్ సరసనే దీన్ని చేర్చి తిట్టి పోస్తూ వచ్చాం. ఇప్పుడు హఠాత్తుగా నీ మీద జాలి పుట్టి నీకు ధారాదత్తం చేశాం. అది శర్మిల ఆస్తే అని డప్పు కొట్టేస్తున్నాం. నీదేనని చెప్పేసుకో. ఏమైనా వస్తే మేం వున్నాంగా.’ అని శర్మిలకు చెప్తే ‘కావమ్మ మొగుడంటే కాబోసు అనుకున్నాను’ అనే సామెతలో మనిషిలా యీవిడ ‘ఓహో, అది నాదే’ అనేసుకుందా? వాస్తవాలు చెప్పి హెచ్చరించకుండా, యిలా ముగ్గులోకి దింపి, సమస్యను జటిలం చేసి, భ్రష్టు పట్టించే మిత్రులుండగా – యిక వేరే శత్రువులు కావాలా?

వ్యవహారం యిక్కడి దాకా వచ్చాక స్పష్టంగా అర్థమౌతున్నదేమిటి? పెళ్లికి వేదిక అన్నది సాకు మాత్రమే! అసలు లక్ష్యం ఆస్తి సంపాదన! కొన్ని సందర్భాల్లో వియ్యపురాలు మా అబ్బాయి పెళ్లి తిరుపతిలో చేస్తామని మొక్కుకున్నామండి అంటుంది. అలాటప్పుడు వెన్యూకి ఛాయిస్ వుండదు. శర్మిల వియ్యపురాలు యలహంక ప్యాలెస్ గురించి మొక్కుకుని వుండరు. వేదిక పేరు చెప్పి, ఆస్తిలో మార్పుచేర్పులు చేసేసి జండా పాతేద్దామని శర్మిల అనుకున్నారు. ‘కాగల కార్యం చేయగల గంధర్వులం మేమున్నాం కదా, నువ్వు నోరు విప్పనక్కర లేదు, మేమే చేస్తామ’ని తెలుగు మీడియా ముందుకు వచ్చి ‘జగన్ నిరాకరిస్తున్నాడు’ అని ప్రచారం ప్రారంభించేసింది. టిడిపి వారందరూ చ్చొచ్చొచ్చొ అనసాగారు.

కొంతకాలానికి జగన్ ఉత్తరం పబ్లిక్‌లోకి వచ్చేసింది. దానిలో ఆయన ‘నా యిల్లు’ అన్నాడు. కొన్ని రోజులకు సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు శర్మిల ట్వీట్ చేస్తూ ‘అది నా యిల్లు’ అంది. దానికి ముందే చంద్రబాబు గారు తల దూర్చి ‘మేనకోడలి పెళ్లి ఆపుతున్నాడు, కంసమామ’ అంటూనే ‘అక్కడి ఆస్తి వైయస్సార్ యిద్దరికీ సమానంగా యిచ్చారు’ అంటూ సర్వజ్ఞానిలా సెలవిచ్చారు. ఇప్పుడు కోర్టు ముందు వున్న డాక్యుమెంట్లు చూస్తే బాబు చెప్పినది ఎంత బూటకమో తెలుస్తోంది. ఇలాటి చిక్కులు వస్తాయనే శర్మిల అది తన యిల్లు అనడానికి ‘దేవుడే సాక్ష్యం’ అంది, ఆయన దిగి వచ్చి సాక్ష్యం చెప్పడు కదాన్న ధీమాతో!

ఇంకోటి – నేను గృహప్రవేశం చేసుకుంటూ వుంటే మా నాన్న వచ్చారు అంది. గృహప్రవేశం అంటే యింట్లోకి రావడమనే అర్థమేనా? లేక పురోహితుణ్ని పెట్టి వాస్తు పూజ అదీ జరిపించారనా? లేక సింపుల్‌గా పాలు పొంగించారనా? శర్మిల పూజలు చేసిన ఫోటోలు ఎక్కడా చూడలేదు. ఈ సదరు గృహప్రవేశం ఫోటోలు కూడా ఆవిడ ఎక్కడా పోస్టు చేయలేదు. ఇక పాలు పొంగించడ మంటారా, అద్దెకు దిగిన వాళ్లు కూడా చేసుకుంటారు. ఇంకోటి – మా అమ్మాయి చిన్నప్పణ్నుంచి యిక్కడే పెరిగింది అంది. నేనూ 21 ఏళ్ల దాకా ఒకే యింట్లో పెరిగాను. అది అద్దె యిల్లు. ఇంటాయన నాకిచ్చేశాడా? ఇంట్లో పెరిగినంత మాత్రాన సొంతం అయిపోదు. ఇలా ఎలా చూసినా శర్మిలకు క్లెయిమ్ చేయడానికి ఆస్కారం లేదు. ‘అసలిదంతా వైయస్ అక్రమంగా సంపాదించిన ఆస్తి, సుగుణమ్మను బినామీగా తీసుకుని, ఆవిడ పేరు పెట్టారు’ అంటారు కొందరు. అక్రమాస్తి అయితే అక్రమాస్తుల కేసులో దీన్నీ యిరికించేవారుగా! ఇప్పటికైనా కలపమని యిప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో వున్న ఎన్‌డిఏ ప్రభుత్వం చేత సిబిఐకు చెప్పించండి.

అవునూ, యిక్కడో అనుమానం. అక్రమాస్తికి వారసుడంటూ జగన్‌ను జైలుకి పంపారు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దానికే మరో వారసురాలని నేను అని శర్మిల అంటోంది. ఔనౌనని తెలుగు మీడియా అంటోంది. మరి అలాటప్పుడు ఆమెపై కూడా కేసులు పెట్టాలని, జైలుకి పంపాలని తెలుగు మీడియా ఎందుకు డిమాండు చేయదు? జైలైతే జగన్ – ఆస్తయితే శర్మిల అంటే కుదురుతుందా? లోటస్ పాండ్‌లో ఆస్తిని చక్కగా యిద్దరి మధ్య డివైడ్ చేసిన వైయస్సార్ యలహంక జోలికి పోలేదంటేనే అనుమానం వచ్చింది – రెండూ ఒకే ఫుటింగ్‌లో లేవేమోనని! ఇప్పుడు యీ కేసు ధర్మమాని పూర్తి క్లారిటీ వచ్చేసింది.

2006 నుంచి జగన్ అత్తగారి పేరు మీదే ఆ ఆస్తి వుంది. 2007 మార్చి నుంచి 2027 ఫిబ్రవరి వరకు భీమిశెట్టి రమేశ్ బాబుకి చెందిన సిలికాన్ బిల్డర్స్‌కి లీజు యిచ్చారు. వైయస్ పోయింది 2009లో! అంటే ఆయన ఆమోదంతోనే జరిగింది యీ కంపెనీకి లీజు యివ్వడం అదీ జరిగిందనుకోవాలి. అబ్బే శర్మిలకు యిద్దాం అనుకుని వుంటే అనిల్ తాలూకు కంపెనీ పేర లీజు యిప్పించమని చెప్పి వుండేవారు. ఈ ప్రాపర్టీ కరంటు బిల్లులు, ఆస్తుల మేన్‌టెనెన్స్ అదీ కంపెనీ వాళ్లే చూసుకుంటూ శర్మిలను గెస్ట్ హౌస్‌ వాడుకోనిచ్చారు. ఇప్పుడు ఆవిడ ఆస్తి నాదే అనడంతో కంగారు పడి కోర్టుకి పరిగెట్టారు.

ఆంధ్రజ్యోతిలో ఆస్తి అత్తగారి పేర వుందని రాశారు కానీ, యీ ఆగస్టులో గిఫ్ట్ డీడ్‌గా జగన్ భార్య, పిల్లల పేర ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి రాయలేదు. శర్మిల ఆక్రమించబోతోందని ఉప్పందిందేమో, వెంటనే చేయించారు. భార్యాబిడ్డలదే కన్న అన్న ధీమాతో జగన్ ‘నా యిల్లు’ అన్నాడు. ఈ గిఫ్ట్ డీడ్ తర్వాతనే శర్మిల ఎలర్టయి, యింటి ఓనర్‌షిప్ గురించి రచ్చ చేద్దామనుకున్నారు. పెళ్లి పేరుతో తన వాళ్లందరినీ, బౌన్సర్లతో సహా పిలిచి, స్క్వాట్ చేద్దామని ప్లాను వేసి వుండవచ్చు. ఒక్కోప్పుడు కోర్టు ఆర్డర్లున్నా, స్వాధీనం చేసుకోవడం పెద్ద తలకాయనొప్పి. ప్రిమైసెస్‌లో ఎవరుంటే వాళ్లకు ఎడ్వాంటేజి వుంటుంది.

శర్మిలకు ఆ ఎడ్వాంటేజి యివ్వకూడదనే జగన్ ఆ కంపెనీ ద్వారా పిటిషన్ వేయించాడు. వాళ్లు కోర్టుకి డాక్యుమెంట్లన్నీ చూపించారు. వాటితో పాటు ఆ యిల్లు నాదే అంటూ శర్మిల స్వయంగా యిచ్చిన స్టేటుమెంటు చూపించి, ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఆవిడ వుంది అని దేవనహళ్లి కోర్టును నమ్మించగలిగారు. కోర్టు శర్మిలను, ఆమెకు సంబంధించిన వ్యక్తులను ఆ జోలికి పోవద్దంది. ఆ ప్రాపర్టీలో అడుగు పెట్టవద్దంది. ఏవైనా చెప్పుకోవాలంటే పెళ్లి అయిపోయాక డిసెంబరు 19కి వచ్చి చెప్పుకోవచ్చు అంది. దీనిపై శర్మిల హైకోర్టుకి వెళ్లాలన్నా మధ్యలో సెలవులు వచ్చాయి.

కథ అడ్డం తిరిగిందని గ్రహించిన శర్మిల పెళ్లికి ముందు జరగాల్సిన ఫంక్షన్లు చేసుకుంటా అంటూ అక్కడకు బయలుదేరారు. పెళ్లి తర్వాతి ఫంక్షన్లు కూడా అంటూ అక్కడే స్క్వాట్ చేద్దామని ప్లాను వేసి వుండవచ్చు. తెలుగు మీడియా ఆవిణ్ని ఊదరగొట్టేసింది. వెళ్లబోతూంటే కోర్టు ఆదేశాలంటూ పోలీసులు అడ్డుకుంటే మీరూ, మీ అమ్మగారు ధర్నా చేయండి అంటూ. ధర్నా చేస్తారు కాస్కోండి, చూస్కోండి అని మనందరికీ చెప్పి శర్మిల మీద ప్రెషర్ తెచ్చారు – చేయకపోతే జనం ఏమైనా అనుకుంటారేమోనని బెంగపడేలా! శర్మిల ధర్నా గురించి ఏమీ మాట్లాడలేదు. ఫైనల్‌గా చేయనూ లేదు. నయ్యం, తెలుగు మీడియా కోసం చేసి వుంటే జైల్లో పెట్టేవారేమో! రెండు రోజుల్లో యింట్లో పెళ్లి, రమ్మనమని దేశాన్నంతటినీ పిలిచి, తనెళ్లి కృష్ణ జన్మస్థానంలో కూర్చుంటే.. అభాసు అయిపోదూ!

అక్కడికీ ఆవిడ పోలీసులతో రెండు, మూడు గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే వాదనలు చేసింది. వాళ్లు కుదరదని చెప్పినా ఊళ్లోకి వచ్చాక మళ్లీ అటు వెళదామని ప్రయత్నించింది. పోలీసులు ఆ ప్రాంతమంతా మోహరించి ఆవిణ్ని వెనక్కి పంపేశారు. పెళ్లికి కావలసిన నగలు, బట్టలూ అక్కడే వుండిపోయాయి, తెచ్చుకోవాలి అని యీవిడంటే ‘ఏమేం కావాలో చెప్పండి, మేం పట్టుకొచ్చి యిస్తాం కానీ మీరు అక్కడ అడుగు పెట్టడానికి లేదు’ అన్నారు. ఎందుకంటే ఒకసారి అక్కడకు వెళితే కదలదని భీష్మించిందంటే, చెయ్యేసి లేపడం పోలీసులకు తలకాయ నొప్పి. తెలుగు మీడియా కేముంది, లైవ్ కవరేజి యిచ్చి టిఆర్‌పి పెంచుకుంటుంది.

వినడానికి బాగానే వుంది కానీ, పోలీసుల చేత అన్నీ తెప్పించుకోవడం కష్టం. ఈ స్థాయి వాళ్లు యిళ్లల్లో ఎక్కవుంట్ చెప్పలేని క్యాష్ పెట్టుకుని వుంటారు. అందునా పెళ్లిలో చేయవలసిన కాష్ పేమెంట్స్ కోసం మరింత తెచ్చి పెట్టుకుని వుంటారు. వాటి గురించి పోలీసులకు చెప్తే వాళ్ల ద్వారా ఐటీ వాళ్లకు, ఈడీ వాళ్లకు తెలిసి వాళ్లు దిగవచ్చు. ఆ సెంట్రల్ ఏజన్సీలతో వేగాలంటే మోదీతో సఖ్యత వుండాలి. రాహుల్ గాంధీకి బాగా క్లోజ్ ఐన శర్మిలకు మోదీ ఫేవర్ చేస్తారా అన్నది డౌటు. కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ ఏ మేరకు ఆదుకోగలడో చెప్పలేం. అతను వైయస్ కుటుంబంలో అందరికీ సన్నిహితుడు. ఎటూ ఫేవర్ చేయకపోవచ్చు. పేరుకి ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షురాలైనా, శర్మిల తనను తాను అలా ఎప్పుడూ చూపుకోలేదు. పార్టీ కూడా అలా అనుకోదు.

ఇంట్లోకి కాలు పెట్టే పరిస్థితి కలగకపోతే యింటితో పాటు లోపల బ్లాక్ మనీ వుంటే అదీ పోతుంది. వైట్ మనీ మాత్రమే బయటకు తెప్పించుకో గలదు. అందువలన యీవిడ హైకోర్టుకి వెళ్లి యీ ఆర్డర్లు ఎత్తేయించుకో వలసినదే! దాని కోసం ఏ సిద్ధార్థ లూత్రానో తెచ్చి, హైకోర్టులో పడాల్సిన అగచాట్లన్నీ పడి, చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసి పర్మిషన్ తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఫంక్షనుంది కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు. కానీ యీ మార్గాన్నే ఆమె ఎంచుకుంటుంది. ఎంతైనా అవస్థే కదా! ఈ అవస్థ రావడానికి కారణం – ‘ఇల్లు నాదే’ అనే స్టేటుమెంటు. తెలుగు మీడియా, టిడిపి ఆమెను ఎగదోసి, ఎగదోసి.. గోతిలోకి దింపిందనుకోవాలి. కూతురి పెళ్లి టైములో యిలా జరగడం విచారకరం అనవచ్చు మనబోటి వాళ్లం. కానీ పరిస్థితిని చేతులారా చెడగొట్టుకున్నది ఎవర

తెలుగు మీడియా ‘తల్లికీ-చెల్లికీ ద్రోహం’ రికార్డు వేస్తూ వుంటే యీమె పరవశించి పోయింది. ‘మేరే పాస్ మా హైఁ’ అనుకుని మురిసి పోయింది. దానికి తోడు యివాళ తెలుగు మీడియా ‘తల్లి కంట కన్నీరు’, ‘నగలు తెచ్చుకోవడానికి కూడా వీలు లేదా? అని వాపోయిన వైనం’ అంటూ కాప్షన్లు పెట్టి కథనాలు వండి వార్చింది. అంతకంటె ‘ఇల్లు నాదేనంటూ స్టేటుమెంటు ఎందుకిచ్చావే, దాని వలననే కదా కొంప మునిగింది.., కాదు కాదు, కొంప ఎగిరింది’ అంటూ కూతుర్ని తిట్టిపోసింది – అనే కథనం యిస్తే సబబుగా వుండేది.

విజయలక్ష్మి నిజరూపం తేటతెల్లమౌతున్న కొద్దీ, ఆ మాతృ అస్త్రం పటిమ తగ్గుతోంది. ఆవిడ జగన్ తల్లి అన్నమాట ఎంత నిజమో, శత్రువు కూడా అనే మాట అంతే నిజం. కొడుకుని జైలుకి పంపడానికి కుట్ర చేసిన వ్యక్తి ఆమె. సోనియా పంపగలిగింది. ఈమె పంపలేక పోయింది. అంతే తేడా! కుపుత్రుడుంటాడు కానీ కుమాత – చెడ్డ తల్లి వుండదని అంటారు. అది సూక్తి మాత్రమే! ప్రియుడి కోసం పిల్లల్ని చంపేవాళ్ల గురించి రోజూ చదువుతూన్నాం. ఇక ఆ సూత్రాన్ని ఎలా నమ్మగలం? పిల్లల మధ్య పక్షపాతం చూపే తల్లిదండ్రులు కోకొల్లలు. కష్టపడి ఐశ్వర్యవంతుడైన కొడుకు కంటె వ్యసనాలకు బానిసై ఆస్తి పోగొట్టుకున్న కొడుకు పట్ల వాళ్లకు జాలి వుంటుంది. పెద్దాడికి బాగా వుందిగా, దాంట్లోంచి కాస్త రెండో వాడికి యిస్తే ఏం పోతుంది అనుకుంటారు.

అలాగే విజయమ్మ ‘శర్మిల తెలివితక్కువగా ఆస్తులు ఖర్చు పెట్టిందనుకో, జగన్ దగ్గర కుప్పలుతిప్పలుగా వుంది కదా యింకా యివ్వవచ్చు’ అనే అభిప్రాయంతోనే శర్మిలను వెనకేసుకుని వస్తోందని అనుకున్నాను చాలాకాలం. ‘అది వాళ్ల కష్టార్జితం కదా, కొడుకు కోడలు అహర్నిశలు కష్టపడితేనే పోగు పడింది, కూతుర్ని ఎవడు తగలేసుకోమన్నాడు’ అని తర్కబద్ధంగా ఆలోచించదు తల్లి మనసు. కానీ ఎప్పుడైతే బెయిలు షరతుల ఉల్లంఘనకు పాల్పడుతూ షేర్లు ట్రాన్స్‌ఫర్ చేయబోయిందో అప్పుడు ఆవిడ కారెక్టరు పూర్తిగా తెలిసిపోయింది. దాని వలన కొడుకు జైలుకి వెళ్లడమే ఆవిడకు కావలసినది అని అర్థమై పోయింది.

తల్లి, చెల్లి అనే యిద్దరు శత్రువులు జగన్ నుంచి ఆస్తి లాక్కుందామని చూస్తున్నారు. వాళ్లకు తెలుగు మీడియా మద్దతిస్తోంది, ఎగదోస్తోంది. వీళ్ల ప్రయోజనాలు వీళ్లవి. విజయమ్మ చేతిలో బైబిలు పట్టుకుని ప్రసంగాలెందుకు యిస్తుంది? అని విమర్శలు గుప్పించిన వారు వీరే. శర్మిల శీలంపై నిందలు మోపిన వారు వీరి వారే! రేపు జగన్ కుటుంబంలో సర్దుబాటు జరిగి, అందరూ ఒక్కటైతే మళ్లీ వీళ్లను దుయ్యబట్టేదీ వీరే! అది గ్రహించకుండా వీరంతా నా మిత్రులు, హితైషులు అనుకుని ఎగిరిపడితే చివరకు చతికిల పడడమే మిగులుతుంది (ఫోటో – పోలీసులతో శర్మిల వాగ్వివాదం, ఇన్‌సెట్ దేవనహళ్లి కోర్టు)

– ఎమ్బీయస్ ప్రసాద్

23 Replies to “ఎమ్బీయస్‌: ఇలాటి మిత్రులుంటే శత్రువులెందుకు?”

  1. MBS గారూ – మీరు ఈ అన్నా చెల్లెలి మధ్య విషయాలు పట్టించుకోకపోవడమే ఉత్తమం. అన్ని విషయాలు బయట పడలేదేమో. మీరేమేమో తొందరపడి ఏదేదో రాసేస్తుంటారు. ​మీ స్థాయికి తగ్గ ఆర్టికల్ కాదు. అయినా మీ వ్యక్తిగత వ్యాఖ్యానాలు బాలేవు.

  2. //విజయలక్ష్మి నిజరూపం తేటతెల్లమౌతున్న కొద్దీ//

    ముత్తాత ప్రసాద్ గారికి లాజన్న భార్య అన్నా, లాజన్న కూతురు అన్నా కొంచెం కూడా గౌరవం లేదు, పరలోకంలో ఉన్న లాజన్న ఎంత కుమిలిపోతాడో పాపం. ఆ రాజ్యసభ సీట్ ఏదో ఇచ్చిఉంటే అన్నాచెల్లెళ్లు ఎంచక్కా కలిసి ఉండేవాళ్లుగా దానికి ఎందుకు టీడీపీ మీదో ఇంకొకళ్ళ మీదో ఏడవటం

  3. Probably, 90% of AP media is rotten with party and political affiliation. Most of them are interested in this type of issues. In fact they are a curse to the society..They never show the grievances of the people. Sakshi media has openly declared that theirs is a party based media openly depicting YSR logo. What about the remaining media, who boasts themselves as neutral, daring journalist, dashing joirnalists…They should be shamed of.

  4. షర్మిల తో పాటు తన గుంపు ఇంత తెలివి తక్కువగా ఎత్తు వేసింది అంటే నమ్మటం కష్టం. ఇంతకు మించి ఏదో చేయాలని వాళ్ల ఉద్దేశం అయి వుంటుంది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక. 

  5. అదేంటి ఏం బీ ఎస్ గారు ..జగన్ కి కొంచెం నొప్పి కలగగానే వెంటనే వాలిపోతావు …మళ్ళా నేను న్యూట్రల్ అని ఈ మధ్య కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తున్నావు …ఒకసారి వై ఎస్ ఫ్యామిలీ బలపనూరు నుంచి వచ్చి పులివెందుల లో ఎలా సెటిల్ అయ్యారో రాయొచ్చు కదా …అలాగే ఒకరు మతం మారితే వాళ్ళకి రెడ్డి అనే తోక ఎందుకు అని రాయొచ్చు కదా …అలాగే ఏడుగురు సందింటి అనే పేరు రెడ్డి ల లో లేదని రాయొచ్చు కదా 

  6. దేంటి ఏం బీ ఎస్ గారు ..జగన్ కి కొంచెం నొప్పి కలగగానే వెంటనే వాలిపోతావు …మళ్ళా నేను న్యూట్రల్ అని ఈ మధ్య కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తున్నావు …ఒకసారి వై ఎస్ ఫ్యామిలీ బలపనూరు నుంచి వచ్చి పులివెందుల లో ఎలా సెటిల్ అయ్యారో రాయొచ్చు కదా …అలాగే ఒకరు మతం మారితే వాళ్ళకి రెడ్డి అనే తోక ఎందుకు అని రాయొచ్చు కదా …అలాగే ఏడుగురు సందింటి అనే పేరు రెడ్డి ల లో లేదని రాయొచ్చు కదా 

  7. తండ్రి అర్ధాంతరంగా పోయాడు. ఆస్తులు పంచారు కానీ అవి కాగితాల మీదకు ఎక్కలేదు. ఎందుకంటే అందులో కొన్ని ఆస్తులు అక్రమ ఆస్తుల జాబితాలో ఉన్నాయి.

    చెల్లిని కన్న కూతురిలా చూసుకుంటానని తండ్రికి చెప్పాడని తల్లే చెబుతోంది. అంటే షర్మిల తల్లి కాబట్టి ఆమె మాటను నమ్మడం తప్ప మనకు మరో మార్గం లేదు.

    భారతి తండ్రి 10 రూపాయల డాక్టర్ అని విన్నాం. మరి 10 రూపాయల వైద్యం చేసే వ్యక్తికి 25 ఎకరాల విలువైన భూమి ఉండటం, అందులో ప్యాలెస్ కట్టడం అంటే నమ్మడం కష్టమే. కాకపోతే మీరు పెద్దవారు, మహా మేధావి కాబట్టి మీరు చెబితే నమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

    ఒక యలహంక మాత్రమే కాదు, అదేదో పవర్ కంపెనీలో కూడా తల్లికి, చెల్లికి వాటా లేదని ఆ మధ్య కేసులు పెట్టుకున్నారు.

    ఈ లెక్కన చూస్తే, తన చెల్లి వైఎస్‌ఆర్‌కు పుట్టలేదని ఎన్నికల ముందు జగన్ మీడియా చేసిన ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తున్నాయి.

    కనీసం మీరు మీ జ్ఞానంతోనైనా అదేదో నిర్ధారించి చెబుతారని ఆశిస్తున్నాం.

  8. TLDR: తల్లి, చెల్లి అనే యిద్దరు శత్రువులు జగన్ నుంచి ఆస్తి లాక్కుందామని చూస్తున్నారు…

    Per article Jagan is great and Sharmila is evil..lol

  9. Two questions andi

    1.ఆ ప్రాపర్టీ జగన్ గారి అత్త గారిది ఐతే ఆమెకి ఎలా వచ్చిందో కూడా బాగుండేది, కట్నం కింద వచ్చిన ఆస్తినా లేకపోతే సొంతంగా సంపాదించిన ఆస్తినా 

    2.విజయమ్మ గారు జగన్ శత్రువు అనేది మీ అభిప్రాయమా నిజమా 🤔

  10. తెలుగు మీడియా తెలుగు మీడియా అంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు మరి మీది ఏ మీడియా, ఉర్దూ మీడియానా. మీరు ప్రస్తావిస్తున్న ఆ మీడియా ఎంత biased గా వార్తలు రాస్తున్నారో మీరు అంతకు మించి రాస్తున్నారని మీకు అర్ధం అవుతుందో లేదో ఒకసారి మీ ఆర్టికల్ ను మీరే చదువుకోండి అర్దం అవుతుంది.

  11. ఈ MBS వాళ్ళ ఇంట్లోకి బాగానే తొంగి చూస్తున్నాడు, మొత్తం చూసినట్టే రాస్తున్నాడు. మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది, ఫోటో ఒకటి పెట్టండి లేదా వెబ్సైట్ లింక్ పెట్టండి

  12. ఈ M/B/S వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో బాగానే తొంగి చూస్తున్నాడు detail గా రాస్తున్నాడు, కానీ జ/గ/న్ హల్ లో ఉండి ష/ర్మి/ల హల్ లో కి తొంగి చూసినట్టు రాశాడు, రివర్స్ లో కూడా ఉండి రాస్తే బాగుండేది. 

  13. ఈ M/B/S వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో బాగానే తొం/గి చూస్తున్నాడు detail గా రాస్తున్నాడు, కానీ జ/గ/న్ హల్ లో ఉండి ష/ర్మి/ల హల్ లో కి తొం/గి చూసినట్టు రాశాడు, రివర్స్ లో కూడా ఉండి రాస్తే బాగుండేది. 

  14. ఈ M/B/S వాళ్ళ ఇం/ట్లో ఏం జరిగిందో బాగానే తొం/గి చూస్తున్నాడు detail గా రాస్తున్నాడు, కానీ జ/గ/న్ హ/ల్ లో ఉండి ష/ర్మి/ల హ/ల్ లో కి తొం/గి చూసినట్టు రాశాడు, రి/వ/ర్స్ లో కూడా ఉండి రాస్తే బాగుండేది. 

  15. ఈ M/B/S వా/ళ్ళ ఇం/ట్లో ఏం జ/రి/గిం/దో బా/గా/నే తొం/గి చూ/స్తు/న్నడు de/ta/il గా రా/స్తు/న్నా/డు, కా/నీ జ/గ/న్ హ/ల్ లో ఉం/డి ష/ర్మి/ల హ/ల్ లో కి తొం/గి చూ/సి/న/ట్టు రా/శా/డు, రి/వ/ర్స్ లో కూ/డా ఉం/డి రా/స్తే బా/గుం/డే/ది. 

  16. ఎన్ టీ ఆర్ గారికి జరిగిన వెన్నుపోటు ను ఆధునిక రాజకీయ చరిత్ర లో మొదటి దానిగా చెప్పుకోవచ్చు. అప్పట్లో మామ లు అందరూ అల్లుళ్ళ వైపు అనుమానం గా చూసే పరిస్థితి. కానీ ఆ వెన్నుపోటు ఆల్లుడు గారికి ఉన్న వింత అలవాటు ఏమిటి అంటే చిన్న గీత – పెద్ద గీత సామెత ను అమలుపరచటం. తాను వేల కోట్లు తింటే, అవతలి వారు లక్ష కోట్లు తిన్నారు అని ప్రచారం చేయించటం. నా పైన మామ కు వెన్నుపోటు అనే నిజం ఉంది కదా, జగన్ మీద కుటుంబం కి వెన్నుపోటు అనే ముద్ర వేద్దాం అని చాలా తీవ్రం గా ప్రయత్నించారు. ఇక్కడ తన లాగే ఆ ఇంటి అల్లుడు గా ఉన్న వ్యక్తిని వెనుక పెట్టి, ఆ ఇంటి ఆడపడుచుని ముందుకు నిలబెట్టారు, తన అనుభవం తో నేర్చిన అతి తెలివితి తో. కానీ అక్కడ జగన్ మౌనం గా ఉంటూ ఈ సూత్రధారు లు మరియు పాత్ర ధారులు అందరిని బయట పెట్టాడు. కరెక్ట్ గా పెళ్ళి కి ముందు తన లాంటి ఆ కుటుంబ అల్లుడు కు చెందిన కంపెనీ కి గనుల లీజు ఇవ్వటం ద్వారా, తన పాత్ర ను బయట పెట్టుకున్నారు. కానీ, శర్మిల గారు యలహంక లో ధర్నా చేయకుండా, బాబోరి కి వెన్నుపోటు పొడిచారా!!!

  17. ///విజయలక్ష్మి నిజరూపం తేటతెల్లమౌతున్న కొద్దీ, ఆ మాతృ అస్త్రం పటిమ తగ్గుతోంది. ఆవిడ జగన్ తల్లి అన్నమాట ఎంత నిజమో, శత్రువు కూడా అనే మాట అంతే నిజం. కొడుకుని జైలుకి పంపడానికి కుట్ర చేసిన వ్యక్తి ఆమె. సోనియా పంపగలిగింది. ఈమె పంపలేక పోయింది. అంతే తేడా!///

    .

    ఒరా? ఎమి కట్టప రాతలు అయ్యా ఇవి! రెపు రజశెకర్ రెడ్డి వచ్చి చెప్పినా అయన్ని కూడా ఇలానె అంటారు. సిగ్గు వదిలెసారు ! బానిస బ్రతులు అంతె!

Comments are closed.