ఊహించని విధంగా తన పదవి కోల్పోయిన ఎన్విడియా సంస్థ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, తిరిగి తన స్థానంలోకి వచ్చారు. ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా ఆయన ఎన్విడియాలో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
కొన్ని రోజుల కిందట అనూహ్యంగా తన పదవులకు రాజీనామా చేశారు హువాంగ్. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు హువాంగ్.
సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ద్వారా ఆమె, ఎన్విడియాకు చెందిన అత్యాధునిక చిప్స్‌ను చైనాకు అందించారని అమెరికా ఇంటలిజెన్స్ అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో, ఎన్విడియా నుంచి తప్పుకున్నారు హువాంగ్. కంపెనీతో పాటు, తన కుటుంబానికి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే హువాంగ్ తప్పుకోవడంతో ఎన్విడియాలో నాయకత్వం సంక్షోభం తలెత్తడంతో పాటు,
అమెరికా స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి.
అక్టోబర్ ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరిన ఎన్విడియా షేరు విలువ, శుక్రవారానికి సగానికి సగం పడిపోయింది. మొత్తం మార్కెట్ పతనంలో సగం వాటా ఎన్విడియాదే. రోజురోజుకు పతనమౌతున్న ఎన్విడియాను తిరిగి గాడిలో పెట్టాలంటే హువాంగ్ రావాల్సిందేనని బోర్డు తీర్మానించింది.
హువాగ్ నిజాయితీ, నాయకత్వ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్న బోర్డు.. తమ నిర్ణయంతో అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నతాధికారులు కూడా ఏకీభవించినట్టు తెలిపింది.
హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండబోదని బోర్డు ప్రకటించింది. 1993లో ఎన్విడియాను స్థాపించి, ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన హువాంగ్.. తక్షణం విధుల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
అయితే హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టినంత మాత్రాన ఆయనపై జరుగుతున్న విచారణకు తెరపడినట్లు కాదు. విదేశీ నిఘా సంస్థలు హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయనే ఆరోపణలపై స్వతంత్ర బోర్డు కమిటీ దర్యాప్తు కొనసాగుతుందని ఎన్విడియా స్పష్టం చేసింది. ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తానని హువాంగ్ కూడా అంగీకరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో ఎన్విడియా చిప్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఈ క్రమంలో సంస్థను ఆ స్థాయికి తీసుకెళ్లిన హువాంగ్ ఆకస్మిక నిష్క్రమణ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఆయన తిరిగి రావడంతో, అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయని భావిస్తున్నారు.

Mari jagul meeda jarige vicharana ekada
For rich, wealth is the only qualification that matters. Honesty, integrity, commitment, loyalty, pride, self-respect, and all those other fancy virtues are relevant for the middle class.
For rich, wealth is the only qualification that matters. Honesty, integrity, commitment, loyalty, pride, self-respect, and all those other fancy virtues are relevant for the middle class only. For the wealthy, apologies and expressions of regret are as disposable as tissue paper, use them when convenient, throw them away without a second thought, and move on with life as if nothing ever happened.
For the wealthy, apologies, regrets
yedavaSodi.. trump gaadu vaadi chechaalu $90B peyteru ee company lo