డల్లాస్‌లో అక్టోబర్ 31న శివపార్వతుల కల్యాణ మహోత్సవం!

అమెరికాలోని తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందించే లక్ష్యంతో GRADA ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అక్టోబర్ 31, 2026న ఘనంగా నిర్వహించనున్నారు.

అమెరికాలోని తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందించే లక్ష్యంతో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అక్టోబర్ 31, 2026న ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టెక్సాస్‌లోని ఫ్రిస్కో ఇండిపెండెన్స్ హై స్కూల్‌లో జరగనుంది.

ఈ వేడుకకు ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్, మేయర్ ప్రో టెమ్ లారా రమ్మెల్, సిటీ కౌన్సిల్ సభ్యురాలు ఆన్ ఆండర్సన్, FISD ప్రతినిధి సురేష్ మండువాతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇతర విశిష్ట అతిథుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనంజయ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ రమణా రెడ్డి, ఎస్‌వీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ టి.వి. కృష్ణారెడ్డి, ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. కమ్యూనిటీ నాయకులు హరి వెల్కూర్, డాక్టర్ శ్రీధర్ కోర్సపాటి, వైఎస్సార్‌సీపీ యూఎస్ఏ కన్వీనర్ శివ మేకా, డాక్టర్ శ్రీపతి కేతు కూడా పాల్గొననున్నారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు GRADA నిర్వాహకులు తెలిపారు. డల్లాస్, ఫ్రిస్కో పరిసర ప్రాంతాల్లోని భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

కార్యక్రమ వివరాలు:

• తేదీ: అక్టోబర్ 31, 2026, శనివారం
• సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
• వేదిక: Independence High School, 10555 Pkwy, Frisco, TX 75035
• నిర్వాహకులు: GRADA
• వెబ్‌సైట్: www.gradaus.org
• రిజిస్ట్రేషన్: https://forms.gle/ZGqcjWGVvrTHhbuFA