స్పెషల్ ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్

ఇతిహాసాన్ని చెడగొట్టకుండా తీసినప్పటికీ, ఆత్మను కోల్పోయిన ఫీలింగ్ కలిగిందని మరికొందరంటున్నారు.

లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో రామాయణ పార్ట్ 1 ప్రపంచ ప్రీమియర్ జరిగింది.

రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, దర్శకుడు నితేష్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు హాజరయ్యారు.

పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైన ఈ త్రీడీ స్క్రీనింగ్‌లో ఇంగ్లీష్ డబ్‌ వెర్షన్ ప్రదర్శించారు.

ఇండియన్ వెర్షన్ కంటే దీని నిడివి తక్కువ. ఈ స్పెషల్ ప్రీమియర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రీమియర్‌ చూసిన చాలామంది సినిమాను విజువల్ వండర్‌గా చెప్పుకొచ్చారు. విజువల్స్, స్కేల్, యాక్షన్ సీక్వెన్స్‌లను మెచ్చుకుంటున్నారు.

రాముడి పాత్రలో రణబీర్ కపూర్ కొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టించారని అంటున్నారు.

యశ్ రావణుడిగా మేజికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. మరికొంతమంది దీన్ని లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తొలి భాగంతో పోల్చి చూస్తున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఎపిక్ మూవీ అంటున్నారు.

అయితే మరికొన్ని రివ్యూలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. డ్రామా, ఎమోషన్ కంటే విజువల్స్, గ్రాఫిక్స్‌ పై ఎక్కువగా ఆధారపడ్డారని అంటున్నారు.

ఇతిహాసాన్ని చెడగొట్టకుండా తీసినప్పటికీ, ఆత్మను కోల్పోయిన ఫీలింగ్ కలిగిందని మరికొందరంటున్నారు.

సినిమా సెకండాఫ్ కొన్ని చోట్ల డ్రాగ్ అయిందని, మ్యూజిక్ కూడా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు మరికొంతమంది. కొన్ని సీన్స్‌లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ కనిపించాయని చెబుతున్నారు.

ఇక కథలో అత్యంత కీలకమైన సాయిపల్లవి పాత్రకు పూర్తిస్థాయిలో సినిమాలో న్యాయం జరగలేదంటున్నారు. అయితే పార్ట్-1 కావడంతో ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుందని, పార్ట్-2లో ఆమెకు ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.

ఓవరాల్‌గా ఎక్కువమంది మాత్రం సినిమాలో ఎమోషనల్ డెప్త్ లోపించిందని, సెకెండాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు.

నెగెటివ్ కంటే పాజిటివ్ స్పందనే ఎక్కువగా కనిపించింది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న రామాయణం పార్ట్-1.

One Reply to “స్పెషల్ ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్”

  1. పోనీలే, ఇతిహాసాన్ని చెడగొట్టకుంటే మంచిది. అప్పట్లో ధుర్యోధననునికి డ్యూయెట్ పెట్టినట్టు, ఇక్కడ రావణనునికి పెట్టినట్టులేదు.

    ఆదిపురుష్ ను గుర్తు చెయ్యలేదేమో ఈ సినిమా… 🤪🤣🤪🤣

    అయినా, ఎన్నో గొప్పగొప్ప ఇతిహాస సినిమాలు చూసిన మన తెలుగోనికి ఇది నచ్చుతుందంటారా? అనుమానమే.

Comments are closed.