ప‌వ‌న్ అడ్డాలో జ‌న‌సేన‌కు వ‌ణుకు పుట్టిస్తున్న వైసీపీ!

వైసీపీ, జ‌న‌సేన నువ్వానేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డుతున్నాయి. ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు ఇరుపార్టీల అభ్య‌ర్థులు జ‌నంలోకి వెళ్లారు.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయ అడ్డా పిఠాపురం. అలాంటి చోట జ‌న‌సేన‌కు వైసీపీ వ‌ణుకు పుట్టిస్తోంది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో యు.కొత్త‌ప‌ల్లి జెడ్పీటీసీ పోరు ర‌స‌వత్త‌రంగా సాగుతోంది.

ఎలాగైనా వైసీపీని బ‌రిలో నుంచి త‌ప్పించి, జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవం చేసుకోవాల‌నే కాకినాడ ఎంపీ ఉద‌య్ వంశీ ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసి కొట్టాయి. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో వైసీపీతో జ‌న‌సేన త‌ల‌పడాల్సిన అనివార్య‌త ఏర్ప‌డింది.

యు.కొత్త‌ప‌ల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి వడిశెట్టి నారాయ‌ణ‌రెడ్డి స‌తీమ‌ణి గౌరీ రాజేశ్వ‌రిని బ‌రిలో నిల‌పాల‌ని వైసీపీ మొద‌ట నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆమె నామినేష‌న్ కూడా వేశారు.

ఇదే సంద‌ర్భంలో గౌరీ రాజేశ్వ‌రి కుమార్తె వినీలారెడ్డి కూడా ఎందుకైనా మంచిద‌ని డ‌మ్మీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. అయితే నామినేష‌న్ల ప‌రిశీల‌న‌లో సాంకేతిక లోపం ఉంద‌ని చెప్పి, గౌరీ రాజేశ్వ‌రి నామినేష‌న్‌ను అధికారులు తిర‌స్క‌రించారు. అయితే జ‌న‌సేన ఆనందం తాత్కాలిక‌మే అయ్యింది. ఎందుకంటే, వినీలారెడ్డి నామినేష‌న్‌ను మాత్రం ఓకే చేయ‌డాన్ని వారు విస్మ‌రించారు.

త‌ల్లి స్థానంలో కుమార్తె వినీలారెడ్డికి బీ ఫారం ఇచ్చి, వైసీపీ క‌ద‌న రంగంలో దూకింది. మ‌రోవైపు జ‌న‌సేన త‌ర‌పున తెలుగంశెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి శ్యామ‌ల‌ను బ‌రిలో నిలిపారు.

వైసీపీ, జ‌న‌సేన నువ్వానేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డుతున్నాయి. ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు ఇరుపార్టీల అభ్య‌ర్థులు జ‌నంలోకి వెళ్లారు.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని జెడ్పీటీసీ స్థానం కావడంతో స‌హ‌జంగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక్క‌డ వైసీపీకి రాజ‌కీయంగా సానుకూల అంశాలున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ‌మంతా టీడీపీకి పోటీ చేసే అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు. దీంతో టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పిఠాపురం టీడీపీ నేత వ‌ర్మ త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇదే సంద‌ర్భంలో మండ‌లంలో జ‌నసేన‌లో రెండు మూడు వ‌ర్గాలున్నాయి. జ‌న‌సేనలో అంత‌ర్గ‌త విబేధాలు వైసీపీకి క‌లిసొచ్చే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ మండ‌లంలో ద‌ళితులు, రెడ్లు, మ‌త్స్య‌కారులు, చేనేత‌లు వైసీపీ వైపు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రీ ముఖ్యంగా ఎస్ఈజెడ్‌లో ఎక్కువ భూముల్ని వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో తిరిగి ఇచ్చేయ‌డం ఆ పార్టీకి ఇప్పుడు క‌లిసొచ్చే అంశంగా ప‌లువురు చెబుతున్నారు. ఇక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి విష‌యంలోనూ సొంత పార్టీలో వ్య‌తిరేక‌త వుంది. జ‌న‌సేన అభ్య‌ర్థి బ‌లిజ సామాజిక వ‌ర్గం.

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో బ‌లిజ‌ల్ని కాపులు పెద్ద‌గా ద‌గ్గ‌ర చేసుకోర‌న్న అభిప్రాయం వుంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాలు, వైసీపీకి సానుకూల ఓట‌ర్లు, మ‌రీ ముఖ్యంగా టీడీపీలో తీవ్ర‌మైన ఆగ్రహం …. వెర‌సి వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేసిన అభ్య‌ర్థి విజ‌యానికి దోహ‌దం చేస్తాయ‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే ఆ జెడ్పీటీసీ ఎన్నిక‌పై అంద‌రి దృష్టి ప‌డింది.

5 Replies to “ప‌వ‌న్ అడ్డాలో జ‌న‌సేన‌కు వ‌ణుకు పుట్టిస్తున్న వైసీపీ!”

  1. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ,విపక్షం చాలా వీక్,ఇది భారత దేశం, ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం

  2. అదేంది…సెజ్ భూములు తిరిగి పంపిణీ కలిసివస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రావాలి కానీ ఇప్పుడు కలిసి రావడం ఏందో….నీకన్నా అర్ధం అవుతుందా ఏం రాసావో

    1. కదా..అసలు ఈ GA గాడికి రిపోర్టర్ స్ ఉంటారా ఆ ప్రాంతాల్లో..లేదంటే యాక్ చీ నుండి కాపీ పేస్ట్ నా?

Comments are closed.