ఆ పోలీస్‌లపై వైసీపీ ప్రైవేట్ కంప్ల‌యింట్స్ చేయదెందుకు?

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడద‌ల ర‌జినీని మ‌హిళా ఎస్ఐ ప్రియాంక ఏకంగా తోసి ప‌డేయ‌డానికి సంబంధించిన వీడియో దేశ‌మంతా వైర‌ల్ అయ్యింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసు యంత్రాంగం తీరు అత్యంత వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా పోలీస్‌శాఖ‌లోని హోంగార్డు మొద‌లు, ఐపీఎస్ అధికారుల వ‌ర‌కూ… కొంద‌రు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి, అధికార పార్టీల రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నార‌నే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోలీస్‌శాఖ‌లోని కొంద‌రు ఖాకీ దుస్తుల‌కు బ‌దులు, ప‌చ్చ చొక్కాలు ధ‌రించిన‌ట్టుగా టీడీపీ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతుతున్నాయి.

ఇటీవ‌ల సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జీ.ఈశ్వ‌ర‌య్య రాయ‌ల‌సీమ‌లోని ఒక పోలీస్ ఉన్న‌తాధికారిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. స‌ద‌రు పోలీస్ అధికారికి ఖాకీ చొక్కా అంటే ఇష్టం లేనట్టుంద‌ని, ఎల్లో ష‌ర్ట్ ధ‌రించాల‌ని ఈశ్వ‌ర‌య్య హిత‌వు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పులివెందుల డీఎస్పీ, సీఐ… అలాగే ఇత‌ర పోలీస్ యంత్రాంగంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్య‌ర్థుల్ని పోలీసులే అడ్డుకోవ‌డం బ‌హుశా దేశ చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ జ‌రిగి వుండ‌ద‌న్న అభిప్రాయాన్ని కొట్టి పారేయ‌లేం.

అలాగే గాల్లోకి కాల్పులు, బాష్ప‌వాయువు ప్రయోగాన్ని, ఎలాంటి కార‌ణం లేకుండానే పులివెందుల‌లో పోలీసులు చేప‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో పులివెందుల డీఎస్పీకి క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫోన్ చేసి, ఏ ర‌కంగా ప‌నితీరును త‌ప్పు ప‌ట్టారో లోక‌మంతా చూసింది.

స‌ద‌రు పోలీస్ అధికారిని మార్చాల‌ని ఎంపీ ఏకంగా కోర్టునే ఆశ్ర‌యించారంటే, ఎంత దుర్మార్గంగా అక్క‌డ పోలీసింగ్ సాగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌రోవైపు నెల్లూరు జిల్లాలో గూడూరు డీఎస్పీ వైసీపీ నాయ‌కుడు న‌రేంద‌ర్‌రెడ్డికి ఫోన్ చేసి జెడ్పీటీసీ స్థానానికి వేసిన నామినేష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

నెల్లూరులో ఒక సీఐ త‌నే వైసీపీ అభ్య‌ర్థికి డ‌బ్బు కూడా ఇవ్వ‌డానికి వెళ్తాన‌ని చెబుతూ, జ‌రిప‌న సంభాష‌ణ వెలుగు చూసింది. ఇలా ఒక‌ట్రెండు ఘ‌ట‌న‌లు కాదు.

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడద‌ల ర‌జినీని మ‌హిళా ఎస్ఐ ప్రియాంక ఏకంగా తోసి ప‌డేయ‌డానికి సంబంధించిన వీడియో దేశ‌మంతా వైర‌ల్ అయ్యింది.

ఏపీలో అధ్వాన‌మైన పోలీసింగ్‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని దేశంలోని ప్ర‌ముఖలంతా ఏకిపారేస్తున్నారు.

రుద్ర‌వ‌రం జెడ్పీటీసీ స్థానానికి నామినేష‌న్ వేసిన సీపీఐ అభ్య‌ర్థిని కిడ్నాప్ చేసేందుకు టీడీపీ అభ్య‌ర్థితో క‌లిసి ఏకంగా కానిస్టేబుల్ వెళ్ల‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. అలాగే కొన్ని చోట్ల వైసీపీ అభ్య‌ర్థులు విన‌క‌పోతే, వారి ఇళ్ల‌లో గంజాయి పెట్ట‌డానికి కూడా కొంద‌రు పోలీసులు వెనుకాడ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే , పాల‌కుల మెప్పు కోసం పోలీసు శాఖ‌లోని కొంద‌రు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిబంధ‌న‌ల‌ను య‌థేచ్ఛ‌గా ఉల్లంఘిస్తున్నారు.

రాష్ట్రంలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్న 50 మందికి పైగా పోలీస్ అధికారుల‌పై ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.

అయితే చ‌ర్య‌లు ఏవీ ఉండ‌వ‌ని వైసీపీకి తెలియంది కాదు. కానీ ఎస్ఈసీకి, మ‌రో సంస్థ‌కో ఫిర్యాదు చేయ‌డం వ‌ర‌కే త‌మ బాధ్య‌త తీరిపోయింద‌ని వైసీపీ ప్ర‌వ‌ర్తిస్తోంది.

ఇది స‌రైంది కాద‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అంటున్నారు. స‌ద‌రు పోలీస్ అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై ఎందుక‌ని ప్రైవేట్ కంప్ల‌యింట్ చేయ‌డం లేద‌నే ప్ర‌శ్న వైసీపీ శ్రేణుల నుంచే వ‌స్తోంది.

అలా చేసిన‌ప్పుడే తాము అధికారంలోకి వ‌చ్చాక‌, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోడానికి అవ‌కాశం వుంటుంద‌ని వారు అంటున్నారు. వైసీపీ త‌న కేడ‌ర్ మ‌నోభావాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

One Reply to “ఆ పోలీస్‌లపై వైసీపీ ప్రైవేట్ కంప్ల‌యింట్స్ చేయదెందుకు?”

Comments are closed.