ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్‌పై వైసీపీ ముఖ్య నేత ఎస్వీ సతీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత ఊరు వేంపల్లెలో వైసీపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాభారతంలో దుర్యోధనుడితో లోకేశ్‌ను, దృతరాష్ట్రుడితో చంద్రబాబును పోల్చుతూ సతీష్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తప్పు పట్టారు. అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దురాగతాలను చూస్తే, దిగ్భ్రాంతికి గురి కావాల్సి వస్తోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఇంత నీచంగా దిగజార్చవచ్చా? అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. ఇదే రకమైన పాలన కొనసాగితే, రాబోయే కాలంలో సామాన్య ప్రజల ఆస్తులు, మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా చంద్రబాబు ప్రెస్‌మీట్లు చూస్తుంటే అసహ్యం కలుగుతోందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయని స్థితిలో చంద్రబాబు సర్కార్ వుందన్నారు.
రాష్ట్రంలో అత్యంత తీవ్రమైన సమస్య నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల అని సతీష్‌రెడ్డి అన్నారు. పేదల జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
ఇన్ని సమస్యలుంటే, జగన్ కుటుంబ సమస్యల గురించి మాట్లాడే స్థాయికి చంద్రబాబు దిగజారారని ఆయన తప్పు పట్టారు. ఈ ధోరణి బాధ కలిగిస్తోందన్నారు.
చంద్రబాబు తాను సీఎం అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మంచి పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎందుకింత దిగజారుతున్నారో తనకు అర్థం కావడం లేదని సతీష్‌రెడ్డి అన్నారు.
జగన్ కుటుంబ సమస్యలు చంద్రబాబు తోక పత్రికలకు ప్రధాన శీర్షికలయ్యాయని మండిపడ్డారు. కుటుంబ సమస్యలు ఏ రకంగా పత్రికలకు బ్యానర్ శీర్షికలవుతాయని ఆయన నిలదీశారు.
చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. నీ కుటుంబ సమస్యలు, అంశాల గురించి జగన్ మాట్లాడారా? అని చంద్రబాబును సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా ఒక్క సందర్భం చూపించాలని ఆయన అడిగారు.
చెల్లెళ్లు, వారి హక్కుల గురించి ఇవాళ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. నీ చెల్లెళ్లు, తమ్ముళ్లకు, వారి పిల్లలకు ఏం చేశావో, వారి దగ్గరికి వెళితే చెబుతారని చంద్రబాబును ఉద్దేశించి ఆయన అన్నారు.
జగన్ కుటుంబ ఆస్తులు, వారి సమస్యల గురించి మాట్లాడ్డానికి నీవు ఎవరని బాబును ఆయన నిలదీశారు.
అహంకారంతో దుర్యోధనుడిలా లోకేశ్ పాలన సాగిస్తున్నాడని ఆయన ఘాటు విమర్శ చేశారు.
దృతరాష్ట్రుడి మాదిరిగా కుమారుడికి ఏమీ చెప్పలేక, ఆ పాపాలన్నీ తన మీద వేసుకుంటున్నారని బాబుపై ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేలా అధికారులు విధులు నిర్వహించాలని ఆయన కోరారు.

మనిషి తప్పు చేయడానికి ముందు నీతి గురించి మాట్లాడతాడు.
తప్పు చేసిన తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడతాడు.
దొరికిపోయిన తర్వాతే నిజం గురించి మాట్లాడతాడు.
వాళ్ళు దూతరాస్త్రుడు… దుర్యోధనుడు అవునో కాదో కానీ….సతీష్ నువ్వు మాత్రం కోవర్ట్ గజిని వి. YS కుటుంబం మీద ఆరు సార్లు పోటీ చేసినట్లు నటించావ్
40 yellu vaadiki aa family ki vyatirekamga poradi nee porataniki sramaki phalitam dakke lopu vaadiki banisa gaamari daridrudi ayyav..
Ayithe Neevu “Daridrudu”vi.
ram subba Reddy,nuvvu kalsi ekkadaina neellu leni baavi chooskondi re.