ఎన్నిక‌ల్లో అక్ర‌మాలపై జ‌గ‌న్ పోరాటం.. నిరుత్సాహం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీతో వైసీపీ ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీతో వైసీపీ ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతోంది. రాయ‌ల‌సీమ‌, ప‌ల్నాడుతో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో నామినేష‌న్లు వేయ‌డానికే వైసీపీ అభ్య‌ర్థులు యుద్ధం చేయాల్సి వ‌చ్చింది.

అయితే టీడీపీ రౌడీ మూక‌ల‌కు పోలీసుల మ‌ద్ద‌తు తోడు కావ‌డంతో చివ‌రికి పులివెందుల మున్సిపాల్టీలోనూ, నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప‌రిష‌త్ స్థానాల‌కు నామినేష‌న్లు వేయ‌లేని ప‌రిస్థితి. ఒక‌వేళ వేసిన‌వి కూడా మొక్కుబ‌డిగానే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

పులివెందుల‌తో పాటు క‌డ‌ప జిల్లాలో వైసీపీకి భారీ న‌ష్టం జ‌రిగాక వైఎస్ జ‌గ‌న్ త‌న అడ్డాకు వెళ్లారు. ఎవ‌రొస్తారో రండి, తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా వైసీపీ ప‌రిస్థితి త‌యారైంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ అరాచ‌కాల‌పై దేశ‌మంతా విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. విజ‌న‌రీగా, పెద్ద మ‌నిషిగా ఇంత‌కాలం సంపాదించుకున్న పేరంతా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అరాచ‌కాల కార‌ణంగా చంద్ర‌బాబు పోగొట్టుకున్నారు.

చంద్ర‌బాబు, ఆయ‌న నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాల్ని జాతీయ స్థాయిలో ఎండ‌గ‌ట్ట‌గానికి వైసీపీకి ఇంత‌కంటే మంచి స‌మ‌యం దొర‌క‌దు.

మ‌రీ ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీకి జ‌గ‌న్ నేతృత్వంలో వెళ్లి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అరాచ‌కాల‌పై వీడియోలు ప్ర‌ద‌ర్శించి, ఏకిపారేసే గొప్ప అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుక‌నో ఆ దిశ‌గా వైఎస్ జ‌గ‌న్ ఆలోచించ‌డం లేదు.

ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే, ఈ పాటికి చంద్ర‌బాబు త‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల్ని పెద్ద సంఖ్య‌లో ఢిల్లీకి తీసుకెళ్లి ర‌చ్చ చేసేవార‌నే మాట వినిపిస్తోంది.

బెంగ‌ళూరు-విజ‌య‌వాడ మ‌ధ్య జ‌గ‌న్ చ‌క్క‌ర్లు కొట్టే బ‌దులు, ఒక్క‌సారి ఢిల్లీ వెళితే న‌ష్టం ఏంట‌నే ప్ర‌శ్న సొంత పార్టీ కేడ‌ర్‌తో పాటు మేధావులు, త‌ట‌స్థులు, విద్యార్థి, ఉద్యోగ వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. ఇలాంటి స‌మ‌యాల్లో కూడా రాజ‌కీయంగా అనుకూలించే అంశాల్ని జ‌గ‌న్ వాడుకోక‌పోతే ఎలా అని పౌర స‌మాజం నిల‌దీస్తోంది.

వైసీపీ ప్ర‌మేయం లేకుండానే, జాతీయ స్థాయిలో ప‌లువురు మేధావులు, ప్ర‌భావ‌శీలురు త‌మ‌కు తామే ఏపీ అరాచకాల వీడియోల్ని త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, ఉతికి ఆరేస్తున్నారు.

మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీని ఒక మ‌హిళా ఎస్ఐ తోసి ప‌డేసిన వీడియో జాతీయ స్థాయిలో వైర‌ల్ అయ్యింది. ఏపీలో పోలీసింగ్ ఇంత అధ్వానంగా వుందా? అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌నే గౌర‌వం కూడా లేకుండా దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డంపై జాతీయస్థాయిలో తీవ్రంగా ఎండ‌గ‌డుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులెవ‌రూ జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్ల‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అరాచ‌కాల‌పై వీడియోల‌తో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌, నామినేష‌న్లు కూడా వేయ‌కుండానే ఏక‌గ్రీవాల పేరుతో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరుపై ఎండ‌గ‌ట్టాల‌నేది వైసీపీ శ్రేణుల‌తో పాటు త‌ట‌స్థుల కోరిక‌. కానీ వైసీపీ పెద్ద‌ల‌ నుంచి ఆ దిశ‌గా ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌డం లేదు.

పులివెందుల‌కు వెళ్లి, ష‌ర్ట్ మ‌డ‌త పెట్టాన‌ని, ఇక ఎవ‌రొస్తారో రండ‌ని జ‌గ‌న్ చెప్పి వ‌చ్చారు. తాము కూడా అదే ప‌నిలో ఉన్నామ‌ని, నీ అంతు తేలుస్తామంటూ ఆ మ‌రుస‌టి రోజే టీడీపీ నేత‌లు పులివెందుల‌ పూల అంగ‌ళ్ల వ‌ద్ద హెచ్చ‌రించారు.

వైసీపీ నేత‌లు చేసేదేముంది? రాజ‌కీయ విమ‌ర్శ‌లు, హెచ్చ‌రిక‌లు ఎన్ని ఉన్నా, మ‌రోవైపు అవ‌కాశాల‌న్ని వాడుకోవాల‌న్న ఆలోచ‌న లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఈ విష‌యంలో జ‌గ‌న్ తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

12 Replies to “ఎన్నిక‌ల్లో అక్ర‌మాలపై జ‌గ‌న్ పోరాటం.. నిరుత్సాహం!”

  1. అన్నియ్య ఢిల్లీ వెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే జాతీయ మీడియా సాక్షి గా అన్నియ్యె ర్రిపూ కవుతాడు..అందుకే వెళ్ళడు..

  2. నీకు పేమెంట్ అందడం వల్ల అన్న ఎక్కడో కనిపిస్తున్నాడు కానీ…నేషనల్ మీడియా లో ఇక్కడ పెయిడ్ ప్రెస్ మీట్ లో స్క్రిప్ట్ చదివినట్లు చదువుతా అంటే కుదరదు…..పెయిడ్ ప్రశ్నలీకే సమాధానం చెప్తా అంటే కుదరదు…ఇంగ్లీష్ లో డైనమిక్ స్క్రిప్ట్ అంటే సజ్జల, ప్రవీణ్ పూడి కి కష్టం…కాబట్టి it’s lengthy question అని అన్న బిక్క మొఖం పెట్టాలి…అన్న బాధ అర్ధం చేసుకో

  3. దొంగే దొంగ అన్నట్టు ఉంది. మీరు ఇప్పటి వీడియోలు  చూపిస్తే,అప్పటి వీడియోలతో కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దేశమంతా అన్న చేసిన బాగోతం బయటపడుతుంది. అది తెలిసే అన్న సైలెంట్గా ఉన్నాడు. 

  4. నిన్నే కదా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడన్నావు.

    మళ్ళీ అంతలోనే నిరుత్సాహమా?

    ఢిల్లీ వెళితే అక్కడివాళ్ళు మన అన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు వాళ్ళ ప్రశ్నలతో 

    అందుకే మూసుకుని బెంగుళూరు -తాడేపల్లి ట్రిప్పులేసుకుంటూ, మధ్యమధ్యలో తల్లి -చెల్లిని ఏడిపిస్తూ టైంపాస్ చేస్తున్నాడు 

  5. ఇక్కడ పు.ష్పం అవుతోంది సరిపోదా… దేశం మొత్తం తెలియాలా?

    అన్నియ టైమ్ లో ఎప్పుడూ కూడా ఎన్ని అరాచకాలు జరిగినా టీడీపీ ఢిల్లీ లో ఏడవలేదు 

    కానీ అన్నియ కూటమి అధికారం లో వచ్చిన నెల తిరగకుండానే మా వాళ్ళని వందల మందిని చంపేశారు అని గుక్క పెట్టాడు 

  6. ఇదే జగన్ పరిపాలన లో జరిగిన ఉంటే చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢీల్లి తీసుకుని వెళ్లి పెద్ద రచ్చ చేసేవారు: జీఏ

Comments are closed.