తిరుపతి పవిత్రతను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ అక్కడి వైసీపీ అభ్యర్థులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు వుంది. ఈ సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు తమదైన రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ నేతృత్వంలో తిరుపతిలో మేయర్ అభ్యర్థి వాసు యాదవ్, అలాగే ఆ పార్టీకి చెందిన 63 మంది అభ్యర్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
నవంబర్ 1న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్‌ను అరికట్టాలని, అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు.
నామినేషన్ల సమయంలో తమ పార్టీ అభ్యర్థులపై దాడులు జరిగాయని, నామినేషన్ పత్రాలను చించివేసి దాఖలు చేయకుండా అడ్డుకున్నారని అభినయ్ పేర్కొన్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పోలింగ్ రోజున రిగ్గింగ్, దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై అభ్యర్థుల వ్యక్తిగత సంతకాలతో కూడిన ఫిర్యాదులు, వీడియో సందేశాలను ఇప్పటికే ఎన్నికల అధికారులకు పంపినట్లు అభినయ్ తెలిపారు.
“కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర తిరుపతిలో శాంతిభద్రతలను కాపాడాలి. తిరుపతి పవిత్రతను రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రతి ఓటరూ భయం లేకుండా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి” అని అభినయ్‌తో పాటు వైసీపీ అభ్యర్థులంతా నినదించారు.

ఆహా ఇది భలే ఉందే …జోక్ అఫ్ ది ఇయర్ .
Century
double సెంచరీ 😜
వాళు తిరుపతి పవిత్రతను కాపాడాలని నిరసన చెసారు సరె! కనీసం అలా రాయటానికి నీకు అన్నా సిగ్గు ఉండాలిగా GA!!
.
భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభ్యర్థులంతా ప్లకార్డులు పట్టుకుని తిరుమల విలువలు ప్రవచిస్తుంటే, సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు కూడా తలపట్టుకొని ఉంటాడు.
.
మొన్నటిదాకా అధికారంలో ఉండి, లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు కల్తీ సింథటిక్ నెయ్యి వాడిన మహానుభావులు వీరు.
.
కోట్లాది మంది భక్తుల నమ్మకాలను కెమికల్స్ తో అపవిత్రం చేసి, ఇప్పుడు తిరుపతి పవిత్రత గురించి లెక్చర్లు ఇవ్వడం, ఒక్క Y.-.C.-.P కె సాద్యం!
500000000000
వాళు తిరుపతి పవిత్రతను కాపాడాలని నిరసన చెసారు సరె, కనీసం అలా రాయటానికి నీకు అన్నా సిగ్గు ఉండాలిగా GA!!
.
భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభ్యర్థులంతా ప్లకార్డులు పట్టుకుని తిరుమల విలువలు ప్రవచిస్తుంటే, సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు కూడా తలపట్టుకొని ఉంటాడు.
.
మొన్నటిదాకా అధికారంలో ఉండి, లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు కల్తీ సింథటిక్ నెయ్యి వాడిన మహానుభావులు వీరు.
.
కోట్లాది మంది భక్తుల నమ్మకాలను కెమికల్స్ తో అపవిత్రం చేసి, ఇప్పుడు తిరుపతి పవిత్రత గురించి లెక్చర్లు ఇవ్వడం, ఒక్క Y.-.C.-.P కె సాద్యం!
YCP become Sanatani Warriers after Tiripati Ghee adulteration.
highest cri?!minal cases ఆన్ వాసు యాదవ్.:18
తిరుపతి పవిత్రత గురించి వైకాపా మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే!