టీడీపీ అరాచ‌క ప్ర‌తిబింబం.. ఏక‌గ్రీవాలు!

ఏకగ్రీవాల్లోని డొల్ల‌త‌నాన్ని, టీడీపీది అబ‌ద్ధ ప్ర‌చారం అని చెప్ప‌డానికి పులివెందుల స్థానిక ఫ‌లితాలు చాల‌వా?

మూడు పార్టీలు క‌లిస్తే త‌ప్ప‌, వైసీపీని ఎదుర్కోలేమ‌నే భావ‌నే… టీడీపీ, జ‌న‌సేన‌ను ఏకం చేసింది. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు అధికారంలోకి రాక‌పోతే, ఇక త‌మ పార్టీల‌కు శాశ్వ‌త స‌మాధి త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్రంగా క‌ల‌త చెందారు.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అండ వుంటేనే, వివిధ వ్య‌వ‌స్థ‌ల మ‌ద్ద‌తు దొరుకుతుంద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌మ్మారు.

అందుకే చంద్ర‌బాబుతో పొత్తు కుదర్చ‌డానికి బీజేపీ పెద్ద‌ల‌తో చీవాట్లు తినాల్సి వ‌చ్చింద‌ని అనేక సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగానే అన్నారు.

వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి స‌వాల‌క్ష కార‌ణాలున్నాయి. కూట‌మి ఊహించ‌ని విధంగా 164 అసెంబ్లీ, 21 లోక్‌స‌భ స్థానాల్ని ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు. అప‌రిమిత‌మైన అధికారాన్ని అందించి, చ‌క్క‌టి ప‌రిపాల‌న సాగించాల‌ని ప్ర‌జ‌లు తీర్పు చెప్పారు.

కూటమి పాల‌న‌కు రెండున్న‌రేళ్ల గ‌డువు స‌మీపిస్తోంది. కూట‌మిలో మూడు పార్టీల ముఖ్య నేత‌ల మ‌ధ్య స్నేహ సంబంధాలు మూడు పువ్వులు, ఆరు కాయ‌ల‌న్న సామెత చందంగా కొన‌సాగుతున్నాయి. ఇంత వ‌ర‌కూ ఎలాంటి ఇబ్బంది లేదు.

అయితే పాల‌న గాడి త‌ప్పి, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వుంద‌నే భ‌యం ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని వెంటాడుతోంది. దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో, ముఖ్యంగా వైసీపీ అత్యంత బ‌లీయంగా వుంద‌ని భావించిన చోట‌, టీడీపీ , కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అరాచ‌కానికి తెర‌లేపింది.

అరాచ‌కానికి నిలువెత్తు సాక్ష్య‌మే ఏక‌గ్రీవాలు. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోతే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయ‌ని కూట‌మి ప్ర‌భుత్వం భావించింది.

దీంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌ప‌డింది. స్థానిక సంస్థ‌ల్లో నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డానికి, అలాగే త‌మ అభివృద్ధికి తామే ప్ర‌ణాళిక‌లు వేసుకోడానికి ఎన్నిక‌ల‌నేవి దోహ‌ద‌ప‌డ‌తాయి.

స‌హ‌జంగా చంద్ర‌బాబు అధికారంలో వుంటే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌రు. బాబు 17 ఏళ్ల పాల‌న‌లో ఇది రెండో ద‌ఫా స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇప్పుడు త‌న‌కు తోడు మ‌రో రెండు పార్టీలు కూడా జ‌త క‌ట్ట‌డంతో బ‌హుశా ఆయ‌న‌లో ధైర్యం వ‌చ్చిన‌ట్టుంది. రెండున్న‌రేళ్ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సునామీలా వైసీపీపై కూట‌మి విరుచుకుప‌డింది. కూట‌మి దెబ్బ‌కు వైసీపీ క‌కావిక‌ల‌మైంది.

అధికారం నుంచి దిగిపోయి, ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్న పార్టీని ఎదుర్కోవ‌డం ముఖ్యంగా టీడీపీకి పెద్ద క‌ష్టం కాదు. కానీ క్షేత్ర‌స్థాయిలో భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ గ్ర‌హించారు.

అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో టీడీపీ అరాచ‌కాల‌కు తెగ‌బ‌డింది. పోలింగ్ బూత్‌ల‌లో రిగ్గింగ్‌కు పాల్ప‌డ‌డం గురించి వింటూ వుంటాం.

కానీ నామినేష‌న్లే వేయ‌కుండా అడ్డుకోవ‌డం రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం అని వామ‌ప‌క్షాల నేత‌లు, ప్ర‌జాసంఘాల నేత‌లు కూడా ఆరోప‌ణ‌లు గుప్పించే ప‌రిస్థితి. ఈ ఆరోప‌ణ‌ల్ని కేవ‌లం వైసీపీ మాత్ర‌మే చేస్తే, రాజ‌కీయం అని స‌రిపెట్టుకోవ‌చ్చు.

మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల‌కు సంబంధించి ఏక‌గ్రీవాల‌న్నీ రాయ‌ల‌సీమ‌, ప‌ల్నాడు జిల్లాలోనే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప్రాంతాల్లో వైసీపీ అత్యంత బ‌లంగా వుంద‌నే అభిప్రాయం. కానీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ ప్రాంతాల్లో కూడా కూట‌మి హ‌వా సృష్టించింది. ప్ర‌స్తుతం అక్క‌డ కూట‌మి ఎమ్మెల్యేలే బ‌లంగా ఉన్నారు.

కానీ స్వేచ్ఛ‌గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు కూట‌మి పార్టీల‌కు భ‌యం. టీడీపీకి ఎక్కువ భ‌యం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఏక‌గ్రీవాల్లోని డొల్ల‌త‌నం అడుగ‌డుగునా క‌నిపిస్తోంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పులివెందుల‌లో నామినేష‌న్లు వేసేందుకు వైసీపీకి అభ్య‌ర్థులు లేర‌ని నిస్సిగ్గుగా టీడీపీ నేత‌లతో పాటు ఆ పార్టీని మోసే మీడియా చెబుతోంది.

ఇంత‌కంటే అబ‌ద్ధాలు, ఆత్మ వంచ‌న టీడీపీ, ఆ పార్టీ మీడియాకు మ‌రెదైనా వుంటుందా? అని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది.

జిల్లా ప‌రిష‌త్‌ల‌కు సంబంధించి మొత్తం 77 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. వీటిలో 76 స్థానాల్ని కూట‌మి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్యాపిలిలో వైసీపీ ఏక‌గ్రీవం చేసుకుంది.

టీడీపీ ఏకంగా 71 స్థానాల్ని, జ‌న‌సేన మాత్రం 2, బీజేపీ మూడింటితో స‌ర్దుకుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 9,829 ఎంపీటీసీల‌కు గాను 1,985 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీకి 1,781, జ‌న‌సేన‌కు 101, బీజేపీకి 52 స్థానాలు ద‌క్కాయి. వైసీపీకి 93 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు మండ‌లాల ప‌రిధిలో 65 ఎంపీటీసీల‌కు 64 స్థానాల‌ను టీడీపీ ద‌క్కించుకుంది.

ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల‌, న‌ర‌స‌రావుపేట‌, పెద‌కూర‌పాడు, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గాల్లోని 100 శాతం ఎంపీటీసీ స్థానాలు కూట‌మి సొంత‌మ‌య్యాయి.

వైసీపీకి రాజ‌కీయంగా బ‌లం లేక‌పోవ‌డంతో త‌మ‌కు 100 శాతం ఏక‌గ్రీవం అయ్యాయ‌ని టీడీపీ ఆత్మ వంచ‌న‌కు పాల్ప‌డితే చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు.

కానీ పోలీస్ యంత్రాంగాన్ని, అలాగే ఎన్నిక‌ల అధికారుల్ని అడ్డు పెట్టుకుని య‌థేచ్ఛ‌గా ప్ర‌జాస్వామ్యాన్ని దురాక్ర‌మించ‌డాన్ని యావ‌త్ దేశ‌మే గుర్తించింది, ఆవేద‌న చెందింద‌ని సంగ‌తిని పాల‌కులు గుర్తించుకోవాలి.

ఈ ఘోర త‌ప్పిదానికి భ‌విష్య‌త్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని కూడా గ‌మ‌నంలో పెట్టుకోవాలి.

మ‌రీ ముఖ్యంగా ఈ ఏక‌గ్రీవాలే, రానున్న రోజుల్లో త‌మ ఓట‌మికి పునాదుల‌నే అత్యంత కీల‌క అంశాన్ని మ‌రిచిపోకూడ‌ద‌ని పౌర స‌మాజం హెచ్చరిస్తోంది.

త‌మకు అనుకూలంగా బ‌ల‌మైన మీడియా వుంద‌ని, నేరాల్ని కూడా న్యాయమ‌ని న‌మ్మిస్తామ‌ని అనుకుంటే పొర‌పాటు. ఎందుకంటే, ప్ర‌జాకోర్టు అనేది ఒక‌టి వుంది. ఐదేళ్ల‌కోసారి తీర్పు వెలువ‌డుతుంది. అప్పుడు ఈ ప‌రిణామాల‌కు త‌గిన తీర్పు రాకమాన‌దు.

అంత వ‌ర‌కూ ఏక‌గ్రీవాల‌నే కృత్రిమ విజ‌యాలు ఆనందాన్ని ఇస్తాయో, భ‌య‌పెడుతూ వుంటాయో అనుభ‌వించే వారికే తెలియాలి. అబ‌ద్ధం ఆడినా అతికిన‌ట్టు వుండాల‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు.

ఏకగ్రీవాల్లోని డొల్ల‌త‌నాన్ని, టీడీపీది అబ‌ద్ధ ప్ర‌చారం అని చెప్ప‌డానికి పులివెందుల స్థానిక ఫ‌లితాలు చాల‌వా?

18 Replies to “టీడీపీ అరాచ‌క ప్ర‌తిబింబం.. ఏక‌గ్రీవాలు!”

  1. 20@21 పిరిపోయారు పోటీచేయ్యలేక ఎత్తితే రాజమండ్రి లో పడ్డావు ఏదో వారి వీరి కళ్ళు పట్టుకొని గెలిచావాయు next ఎలక్షన్ ఇలా అతి చేస్తే ఓటు వేసే వారు ఉండరు  జాగర్త వచ్చిన దానిని yeppudu నిలుపుకోవు లే babu 

  2. VOTE FOR FAN!✅️

    ఒకటైతే వాస్తవం కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ ఐనా మాట వాస్తవమే.

    – ABN వెంట్రుక కృష్ణ

  3. ఓరి నీ బండ బడా. .చంద్రబాబు 2.5ఏళ్ల పాలనకే విసుకు చెందారా!

    చంద్రబాబు కూటమి ప్రభుత్వం అస్సాం దిశగా పయనిస్తోంది!😂😂

  4. అయినా పార్టీ పెట్టి బలపడటానికి 25 ఏళ్లు పడుతుంది అని తెలిసి కూడా 2 ఏళ్లకే సీఎం అయిపోయావ్.. నువ్వేం నాయకుడివి Actor Vijay

    1. నీ బాధ ఏంది తమ్ముడు, కూటమి విడిపోవాలి అంతే నా? పిల్లి శాపాలకు ఉట్టి తెగదు అని గ్రహిస్తే మంచిది

  5. నీకు పేమెంట్ వస్తుంది కాబట్టి…మైండ్ బ్లాంక్ అయ్యి గతం మర్చిపోయావ్ కానీ…జనానికి బాగా గుర్తు ఉంది లే ఈ ఏకగ్రీవాలు ఎవరు స్టార్ట్ చేసారో… ఏకగ్రీవం కోసం ఎవరు డబ్బులు ఇచ్చారో అన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. మనం మా నమ్మకం నువ్వే అని ఇంటి ఇంటి కి తిరిగి చెప్పినా జనం రెండు ఒకట్లే ఇచ్చారు

  6. ఇంతమందిని ఏకగ్రీవం చపించడం అదీ పులివెందుల లాంటి చోట నిజ్జంగా సాధ్యమా?అలా అయితే మిగతా 2’0 వార్డు లని ఎందుకు చేసుకోలేదు?వాస్తవాలు ఏంటి అంటే ycheap నుండి పోటీ కి ఎవరూ ముందుకు రావడం లేదు.వచ్చినా ఏదో నామినేషన్ ఏసీ ఇంట్లో పడుకుంటున్నారు.విశాఖ విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో అయితే ycheap ఆఫీస్ లు దగ్గర ఒక్కడు కూడా కనిపించడం లేదు.ఇక ఈ;:దె!బ్బ తో పార్టీ క్లోజ్ అవుతుంది.

    1. మనుసులు కాదు మీరు కుక్కలు దెం @ గితే పుట్టి ఉంటారు మరి పులివెందుల లో అభ్యర్థులు లేకుంటే కూటమి ఎందుకు పొత్తు ఎందుకు మీకు పోలీస్ తో అడ్డుకోవడం గన్ తో కాల్పులు ఎందుకు చేసినట్టు 

    2. పులివెందుల లో గెలిచేకి ఎన్ని అడ్డదారులు తొక్కలో తొక్కేసారు మొత్తం vedio🙏 లు ఉన్నాయి ప్రభుత్వం మారినాక ఎందుకు చేసామో అని బాధపడే రోజులు ఇంటాయి  చూస్తూ ఉండు 

  7. 2021 లో ఏకగ్రీవాల వల్ల వచ్చే లాభాల్ని అన్న అరిటిపండు వలిచినంత తేలికగా విడమర్చి చెప్పాడు. అది ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. తప్పేముంది?!

  8. అధికారం మదం తో చేసారు ప్రజాస్వామ్యం లో ఎప్పుడు ఏమి జరుగుతుందో  చెప్పలేము అధికారం కుయమి పోయాక ఒక్కడు కనిపించదు అమాయకులు బలి అంతే 

  9.  పులివెందుల లో అభ్యర్థులు లేరు అని కామెడీ చెయ్యకండి పులివెందుల లో టౌన్ లో ఏ జనరల్ ఎలక్షన్ జరిగిన కూడా పదివేలు లోపలే votlu🌹 వచ్చేది టీడీపీ కీ 

    1. ఆ పదివేలు మాత్రం ఎందుకు?

      కానీ మనం మాత్రం కుప్పం నెగ్గెస్తాం.. వై నాట్ 175😄

  10. అన్నియ చొక్కా మడత పెట్టాకా కూడా 20 లో మూడు ఏకగ్రీవాలు అయ్యాయి అంటున్నారు… అంటే ఇంక అన్నియ డైరెక్ట్ గా అస్సాం లో పోటీ చేయచ్చు 😄

Comments are closed.