అమ‌రావ‌తి కోసం విజ‌య‌వాడ గొంతు పిసికి…!

భావిత‌రాల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌కు మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు ప్ర‌జానీకం స్వాగ‌తం ప‌లుకుతున్నారు

భావిత‌రాల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌కు మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు ప్ర‌జానీకం స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఈ విష‌యాన్ని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ‌త ప‌ది రోజులుగా చంద్ర‌బాబు లేదా కూట‌మి ఒక షో చేస్తున్న‌ట్టు ఆయ‌న విమ‌ర్శించారు.

రాజ‌ధాని పేరుతో ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే షో రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌పై కూట‌మి నేత‌లు మాట్లాడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌జలంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా వుండేలా జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌పై కూట‌మి నేత‌లు ఎందుకు ఆలోచించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

విజ‌య‌వాడ అంటే చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని గ‌తంలోనే తాము చెప్పామ‌న్నారు. విజ‌య‌వాడ అంటే బాబుకు క‌క్ష అన్నారు. అమరావ‌తి కోసం విజ‌య‌వాడ గొంతు పిసికి చంపేసేలా చంద్ర‌బాబు ముందుకెళుతున్నార‌ని తీవ్ర విమ‌ర్శ చేశారు. విమ‌నాశ్ర‌యాన్ని, రైల్వేస్టేష‌న్‌ను అభివృద్ధి చేయ‌లేద‌న్నారు. విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్ధి గురించి మాట్లాడ్డం లేద‌ని అవినాష్ విమ‌ర్శించారు.

2014-19 మ‌ధ్య , అలాగే ఈ రెండేళ్ల‌లో విజ‌య‌వాడ‌లో ఎలాంటి అభివృద్ధి చేయ‌లేద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. మీ వాళ్ల భూములు, స్కామ్‌ల కోసం మ‌ళ్లీ విజ‌య‌వాడ‌ను నాశ‌నం చేయ‌డానికి కూట‌మి నేత‌లు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. క‌నీసం క‌న‌క‌దుర్గ‌మ్మ ప్లై ఓవ‌ర్ క‌ట్ట‌లేని కూట‌మి నేత‌లు అమ‌రావ‌తిని నిర్మిస్తారా? అని అవినాష్ నిల‌దీశారు. బెంజి స‌ర్కిల్ ప్లైఓవ‌ర్‌ను క‌ట్ట‌లేని మీరు అమ‌రావ‌తిని క‌డ‌తారా? అని ప్ర‌శ్నించారు.

క‌న‌క‌దుర్గ‌మ్మ‌, బెంజిస‌ర్కిల్ ప్లైఓవ‌ర్ల‌తో పాటు ల‌క్ష‌లాది మందిని వ‌ర‌ద‌ల నుంచి కాపాడిన రిటైనింగ్ వాల్‌ను నిర్మించిన ద‌మ్మున్న నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ అని గ‌ర్వంగా చెబుతామ‌న్నారు. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌లో ఒక్క‌టైనా తాము చేసిన మంచి ఇదీ అని చెప్పే ద‌మ్ము కూట‌మి నేత‌ల‌కు ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

15 Replies to “అమ‌రావ‌తి కోసం విజ‌య‌వాడ గొంతు పిసికి…!”

  1. వచ్చాడండి…పెద్ద వాలంటీర్…గట్టిగ అయిదు నిమిషాలు తెలుగు మాట్లాడితే అన్న ని మించిన పండిత్యం బయటపడుతుంది

  2. మావిగాన్ ‘జింగ్ జింగ్ జి’ మోడల్ అంట కదా? సాక్షి ఈశ్వర్ చెప్తున్నాడు.

  3. మరి అన్న ఉన్న 5 years గుడ్డి గుర్రం పళ్ళు తోమారా, విజయవాడ ని డెవలప్ చేయకుండా. విజయవాడ గుంటూరు ycp వాళ్లకు suggestion ఈసారి అనవసరం గా డబ్బులు ఖర్చు పెట్టి పోగొట్టుకోకండి డిపాజిట్ లు కూడా రావు

  4. దేవినేని గారికి పిసికడం అంటే బాగా క్రేజీ అనుకుంట. బెంగళూర్  ప్యాలెస్ లో బాగా ప్రాక్టీస్ చేయవచ్చు, ఒక వీకెండ్ వెళితే.

  5. ఏ పార్టీ లో అయినా ఒకరో ఆరో వె*ధవలు ఉంటారు, వై*సీపీ ఖ*ర్మ ఏంటో కానీ పార్టీ లో ప్రతీ ఒక్కడు వె*కిలి వె*ధవలే, పార్టీ ప్రెసిడెంట్ ja** * నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు అందరూ సై*కోలే!! 

Comments are closed.